💥ఆదిత్యహృదయ పారాయణ వైశిష్టత

 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥ఆదిత్యహృదయ పారాయణ వైశిష్టత💥


ఆదిత్య హృదయంలో 3 నుండి 5 శ్లోకాలు: ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.


రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం |

యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి || 3 || 


అర్థము:

ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు.


ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం |

జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం || 4 || 


అర్థము:

ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది.


సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం |

చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం || 5 ||


అర్థము:

ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును. ఆధివ్యాధులను తొలగించి ఆయుస్సును వృద్ధి పరుచును. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యము.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏