💥గరుడవాహనా గోవిందా!!

 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥గరుడవాహనా గోవిందా!!


శ్రీవేంకటేశ్వరుడు, శ్రీ శ్రీనివాసుడు, ఆనంద నిలయంలో ఆనందరూపునిగా వెలిశాడు "గోవిందుడు"


ఎన్ని వాహన సేవలు జరిగిన శ్రీనివాసునికి గరుడ వాహనమంటేనే మిక్కిలి ఇష్టం.

శ్రీ మలయప్ప స్వామి వారిని గరుడవాహనంపై చూసేందుకు రెండు కళ్లు చాలవు.


గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.


అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

అందుకే శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై విహరించడం ఎంతో విశేషం.


💥స్ఫూర్తిమంతం.. గరుడ చరితం!


చతుర్దశ భువనాల బరువు మోసేవాడు శ్రీ మహావిష్ణువు.

ఆ జగన్నాథుడి బరువు మోసేవాడు గరుత్మంతుడు. 


విష్ణుమూర్తిని భుజస్కంధాలపై మోసే అదృష్టం గరుత్మంతుడికి ఊరికే వచ్చింది కాదు.

రెక్కలు తొడిగింది మొదలు శ్రీహరి విజయ ధ్వజంపై ఎగిరేవరకు గరుడ చరితం స్ఫూర్తిమంతం.


పక్షీంద్రుడైన గరుత్మంతుడు ఇతర జీవకోటికీ ప్రభువే. కీర్తినీ, శాంతినీ ప్రసాదించే దైవం ఆయన.


గరుత్మంతుడిని గరుడాళ్వార్‌, గరుడస్వామి అని భక్తులు కీర్తిస్తారు.

శక్తి సామర్థ్యాలనూ, సంతాన సౌభాగ్యాలనూ ప్రసాదించే దైవంగా గరుత్మంతుడు మనకు పురాణాల్లో కనిపిస్తాడు.


గరుత్మంతుడు పట్టుదలకు ప్రతీక.

చేపట్టిన కార్యాన్ని ఎన్ని విఘ్నాలు ఎదురైనా చెక్కుచెదరని విశ్వాసంతో పూర్తిచేసిన ఘనుడు.


ఆయన మాతృప్రేమ యుగయుగాలకు స్ఫూర్తిదాయకం. 


నాగులు, గరుత్మంతుడు విరోధులే అయినా, జన్మతః వాళ్లు సవతి తల్లుల బిడ్డలు.

కశ్యప ప్రజాపతి భార్యలు కద్రువ, వినత.


కద్రువ ద్వారా సర్పజాతి ఉద్భవించింది.

అనూరుడు, గరుత్మంతుడు వినత కొడుకులు.


అనూరుడు (అరుణుడు) సూర్యుడి రథసారథి.

కద్రువ మోసం వల్ల వినత ఆమెకు దాస్యం చేసే పరిస్థితి ఏర్పడుతుంది.


తల్లి దాస్యానికి కారణం తెలుసుకున్న గరుత్మంతుడు, ఆమె దాస్య విముక్తికి ఏం చేయాలో చెప్పమని కద్రువ సంతానమైన సర్పాలను అడుగుతాడు.


స్వర్గం నుంచి అమృతం తెచ్చి ఇస్తే వినతకు దాస్య విముక్తి కలిగిస్తామంటాయి సర్పాలు.

స్వర్గంలో ఇంద్రుడి అధీనంలో ఉన్న అమృతాన్ని తెచ్చి, తల్లి దాస్యాన్ని పోగొట్టాలని భావిస్తాడు గరుత్మంతుడు.


భువి నుంచి దివి వరకు సాగిన గరుత్మంతుడి ప్రయాణంలో గరుత్మంతుడు చేసిన సాహస కార్యాలు అన్నీ ఇన్నీ కావు.


స్వర్గంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్న అమృతభాండాన్ని ధైర్యంతో, తెలివితేటలతో చేజిక్కించుకున్నాడు.


గరుత్మంతుడి సంకల్పబలం మెచ్చిన విష్ణుమూర్తి, అతని ఎదుట నిలిచి వరాలు కోరుకోమన్నాడు.


మొదటి వరంగా, విష్ణుమూర్తి ధ్వజం మీద తాను ఉండాలని కోరాడు.

అమృతం తాగకుండానే తనకు నిత్య యౌవనం, అమరత్వం సిద్ధించాలని రెండో వరం అడిగాడు.


ఈ రెండు వరాలు తీర్చడంతోపాటు తనకు వాహనంగా ఉండేలా గరుత్మంతుడిని అనుగ్రహించాడు విష్ణువు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏