⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః 🌹🙏
⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః 🌹🙏
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం l
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ll
"ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తీ, నారాయణ సరసిజాసన సన్నివిష్టః"
-అంటే సూర్య మండల మధ్యవర్తి అయిన నారాయణమూర్తే ధ్యానింపదగిన మూర్తి అనీ, దానినే ఎప్పుడూ ధ్యానించాలని ఆదిత్య హృదయం చెప్తున్నది.
వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసా దించే ప్రత్యక్ష భగవానుడు సూర్యదేవుడు.
యోగ్యత, అయోగ్యలతో నిమిత్తం లేకుండా సర్వ జీవకోటికి సమానంగా వెలుగులు (కాంతులు) పంచే భగ వానుడు.
సృష్టి స్థితి లయలు సూర్యుని ప్రమేయంతోనే జరుగుతున్నాయని..
(సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితానిచ/
సూర్యే లయం ప్రాప్నువంతి య సూర్యః సోహ మేవచ) ‘సూర్యోపనిషత్తు’ పేర్కొంది.
ఉద్యంత మస్తయంత మాదిత్య మభిధ్యాయన్ కుర్వన్ బ్రహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే’-
‘ఉదయిస్తున్న, అస్తమిస్తున్న సూర్యుణ్ని ఎవరు ధ్యానిస్తున్నారో, వారికి అన్ని శుభాలూ కలుగుతాయి’ అని శ్లోక భావం.
'ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అని సూక్తి.
అంటే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవం కూడా సూర్య భగవానుడే అని అర్థం.
సూర్యభగవానుడికి, సముద్రుడికి, మట్టికి (భూమికి) గల స్నేహం, బాంధవ్యం వర్షం, పంటల రూపంలో లోకాన్ని ఆదుకుంటోంది. తన కిరణాలతో నీటిని గ్రహించి వర్షరూపంలో ధరణిని సస్యశ్యామలం చేస్తున్నాడు.
తినే మెతుకుపై వారి వారి పేర్లుంటా యన్నది ఎంత నిజమో, పండే ప్రతి గింజ సూర్య భగవానుడి దయాపాత్రమనడం అంతే నిజమంటారు విజ్ఞులు.
సమస్త లోకాలకు కర్మసాక్షిగా అనంతమైన శక్తికిరణాలతో వెలుగును, తేజస్సును ప్రసాదిస్తున్న ఆదిత్యుడు ఆదితి కశ్యప ప్రజాపతి కుమారుడిగా విశాఖ నక్షత్రంలో ఉద్భవించినట్లు బ్రహ్మాండ పురాణ కథనం.
ఆదివారాలలో సూర్య నమస్కారాలు చేసి పాలను నివేదిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.
సూర్యభగవానుడు సమత్వానికి, చైతన్యానికి, క్రమశిక్షణకు ప్రతీక. తరతమ భేదాలు, పాప పుణ్యాలతో నిమిత్తం లేకుండా అందరికి వెలుగు నిస్తాడు.
ఆయన ఉదయాస్తమానాలు క్రమశిక్షణకు నిదర్శనం.
కాలానికి ఆదిత్యుడే కొలమానం.
సమస్త జీవరాశికి ఆధారభూతుడు. కాలం ఎవరి కోసం ఆగదని నిరూపిస్తూ సాగుతాడు.
లోకబాంధవుడు సూర్యుడు ఎవరి ప్రభావం లేకుండానే ఉదయిస్తూ, ఆరోగ్యభాగ్యాన్ని ప్రసాదిస్తూ తన పని చేసుకుంటూ పోతాడు. ఎప్పటిపనులు అప్పుడు చేయాలన్న సందేశం ఆయన గమనంలో కనిపిస్తుంది.
అందుకే ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం సంధ్యా సమయాల్లో సూర్యుడిలోని తేజోపుంజాన్ని ఉపాసించి, తేజస్సును, మేధస్సును, ఆరోగ్యాన్ని పొందుదురు గాక.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment