⚜️🕉️🚩 ఓం దక్షిణామూర్తయే నమః🌹🙏

 ⚜️🕉️🚩 ఓం దక్షిణామూర్తయే నమః🌹🙏


వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం

సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్!

త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం

జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి!!


తాత్పర్యము:

సంసార బంధములు, జనన మరణ  ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించబడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు. 


"రుద్ర యతే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యమ్"


-ఓ రుద్రా! నీ దక్షిణ ముఖంతో నిత్యం మమ్ము రక్షించు..

అని శ్వేతాశ్వతరోపనిషత్తు దక్షిణామూర్తిని ప్రార్థించింది.


గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్!

నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః!!


దక్షిణామూర్తి సకల జగద్గురు మూర్తి కనుక - స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది.

ఐహికంగా - బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం.


దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడిచెవికి మకర కుండలం ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి.

మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం.

తాటంకం స్త్రీల అలంకృతి.

దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశకుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి ఈ రెండు అలంకారాలు. 


సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి.

అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా.

ఈ విషయాన్నే లలితాసహస్రంలో..


"దక్షిణామూర్తి రూపిణీ | సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ" అని వివరిస్తోంది.


ఉత్తరం జ్ఞానదశ. ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి వెనుక భాగాన (పృష్ట భాగాన) దక్షిణ దిశ. అంటే యమ (మృత్యు) దిశ.


దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో, వారు యముని (మృత్యువుని) చూడరు.


యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు 'నిఘా' వేస్తుంది.


అజ్ఞానమే మృత్యువని ఉపనిషత్తు చేస్తుంది. ఆత్మ స్వరూపాన్ని ఎరుగకపోవడమే మృత్యువు - 'ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి' యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి.


'దక్షిణ' అంటే 'దాక్షిణ్య భావం' ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు.


ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం) భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. 


అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖవిమోచనం. ఆ అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించే జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥