Posts

Showing posts from July, 2025

ఓం శరవణ భవాయ నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శరవణ భవాయ నమః 🌹🙏 శరవణభవ శరవణభవ శరవణభవ పాహిమాం! శరవణభవ శరవణభవ శరవణభవ రక్షమాం!! శ్రీసుబ్రహ్మణ్యుడు జ్ఞాన స్వరూపి, తేజస్వి. అగ్నితేజం గలవాడు. కాని, గంగా తనయుడగుటచే అమృతంవలె చల్లదనమునిచ్చే స్వభావము గలవాడు. ఆయన మంత్రం షడక్షరి “శరవణభవ” ఇది మిక్కిలి మహిమాన్వితమైనది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము లను ఆరు దుర్గుణములను నశింపచేసి విజ్ఞానవంతులుగ రూపొందించునట్టిది. ఇహపర సుఖదాయకమైనది. శరవణభవ అనే మంత్రాన్ని పఠిస్తేచాలు సమస్త సన్మంగళాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. 💥శరవణభవ మంత్రాక్షరషట్కం💥 శక్తిస్వరూపాయ శరోద్భవాయ శక్రార్చితాయాథ శచీస్తుతాయ | శమాయ శంభుప్రణవార్థదాయ శకారరూపాయ నమో గుహాయ || ౧ || రణన్మణిప్రోజ్జ్వలమేఖలాయ రమాసనాథప్రణవార్థదాయ | రతీశపూజ్యాయ రవిప్రభాయ రకారరూపాయ నమో గుహాయ || ౨ || వరాయ వర్ణాశ్రమరక్షకాయ వరత్రిశూలాభయమండితాయ | వలారికన్యాసుకృతాలయాయ వకారరూపాయ నమో గుహాయ || ౩ || నగేంద్రకన్యేశ్వరతత్త్వదాయ నగాధిరూఢాయ నగార్చితాయ | నగాసురఘ్నాయ నగాలయాయ నకారరూపాయ నమో గుహాయ || ౪ || భవాయ భర్గాయ భవాత్మజాయ భస్మాయమానాద్భుతవిగ్రహాయ | భక్తేష్టకామప్రదకల్పకాయ భకారరూపాయ నమో గుహాయ || ౫ || వల్లీవలారాత...

💥శ్రీ శివ ప్రోక్త దశహరా గంగా స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గంగా దేవ్యై నమః🌹🙏 💥శ్రీ శివ ప్రోక్త దశహరా గంగా స్తోత్రం💥 ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమో నమః! నమస్తే విష్ణురూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమోస్తుతే!! నమస్తే రుద్రరూపిణ్యై శాంకర్యై తే నమోనమః! సర్వదేవ స్వరూపిణ్యై నమో భేషజమూర్తయే!! సర్వస్య సర్వవ్యాధీనాం భిషక్ శ్రేష్ఠ్యై నమోస్తుతే! స్థాస్ను జంగమ సంభూత విషహంత్ర్యై నమోస్తుతే!! సంసార విషనాశిన్యై జీవనాయై నమోస్తుతే! తాపత్రితయసంహత్ర్యై ప్రాణేశ్యైతే నమో నమః!! శాంతి సంతానకారిణ్యై నమస్తే శుద్ధమూర్తయే! సర్వస్వం శుద్ధికారిణ్యై నమః పాపారిమూర్తయే!! భుక్తిముక్తి ప్రదాయిన్యై భద్రదాయై నమోనమః! భోగోపభోగ్యదాయినై భోగవత్త్యై నమోస్తుతే!! మందాకిన్యై నమస్తేస్తు స్వర్గదాయై నమో నమః! నమస్త్రైలోక్యభూషాయై త్రిపథాయై నమో నమః!! నమ స్త్రిశుక్ల సంస్థాయై క్షమావత్యై నమో నమః! త్రిహుతాశన సంస్థాయై తేజోవత్యై నమో నమః!! నందాయై లింగధారిణ్యై సుధాధారాత్మనే నమః! నమస్తే విశ్వముఖ్యాయై రేవత్యై తే నమో నమః!! బృహత్యైతే నమస్తేస్తు లోకధాత్ర్యై నమోస్తుతే! నమస్తే విశ్వమిత్రాయై నందిన్యై తే నమో నమః!! పృథ్వ్యై శివామృతాయైచ సువృషాయై నమో నమః! పరాపరశతాధ్యాయై తారాయై తే నమో నమః!! పాశజ...

💥జ్యేష్ఠ మాస శుక్ల పక్ష దశమి.. దశపాపహరదశమి - గంగావతరణం.

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గంగా దేవ్యై నమః🌹🙏 💥జ్యేష్ఠ మాస శుక్ల పక్ష దశమి.. దశపాపహరదశమి - గంగావతరణం. “గోలోకస్థాన ప్రస్థాన సుఖసోపాన రూపిణీ పవిత్ర రూపా తీర్థానాం సరితాం చ పరావరా శంభుమౌళి జటామేరు ముక్తాపంక్తి స్వరూపిణీ తపస్సంపాదినీ సద్యో భారతేషు తపస్వినామ్” అంటే... పాపాత్ముల పాపాలు అనే ఎండుకట్టెలను కాల్చే అగ్నిలాంటిది. సుఖస్పర్శ, స్నానపానాలతో నిర్వాణ పదవిని అందించే శక్తి గలది.. గోలోకాన్ని చేరుకునేందుకు సుఖ సోపాన స్వరూపిణి.. సర్వనదీ నద తీర్థాలలోకి పరమపావని, శివుడి జటాభారానికి కొసను వేలాడేట్టు అలంకరించిన ముత్యాలదండ.. తపస్సులను శీఘ్రంగా సిద్ధింపచేసే పవిత్రురాలు గంగాదేవి అని అర్థం. అంతటి గంగానదిలో స్నానం చేయడం వల్ల, సర్వపాపాలూ హరించుకుపోతాయన్నది భక్తుల అచంచల విశ్వాసం.   కలియుగ మానవులు చేసేటి పాపాలను, మన పూర్వీకులు దశవిధాలుగా వర్ణించారు. వాటిని మూడు వర్గాలుగానూ వర్గీకరించారు. దశ పాపాలు అంటే.. (1) అసత్యోక్తి – అసత్యం పలకడం, (2) దోషారోపణోక్తి – పరులపై నిందలు వేయడం, (3) కఠినోక్తి – ఇతరులు గాయపడేలా మాట్లాడడం, (4) నిష్ఫలోక్తి – నిష్ప్రయోజనంగా వాగడం, (5) చౌర్యకరణం – దొంగతనం, (6) దుష్కార్య కరణం – ఇ...

💥దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రము💥 - (తాత్పర్య సహితం)

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రము💥 -             (తాత్పర్య సహితం) విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ || 1 || #తాత్పర్యము: విశ్వేశ్వరుడు, నరకమనే సాగరమును దాటించేవాడు, శ్రవణానంద మైన వాడు, నెలవంకను ధరించిన వాడు, కర్పూరము యొక్క కాంతి వలె తెల్లగా ఉన్నవాడు, జటా ఝూటములు కలిగిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు. గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజవిమర్దనాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ || 2 || #తాత్పర్యము: పార్వతీ ప్రియ వల్లభుడు, చంద్ర వంకను ధరించిన వాడు, యముని అంతము చేసే వాడు, సర్పములను కంకణములుగా ధరించిన వాడు, గంగను కేశములలో ధరించిన వాడు, గజాసురుని సంహరించిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు. భక్తిప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ || 3 || #తాత్పర్యము: భక్తులకు ప్రియుడు, రోగ భయమును పోగొట...

శ్రీరామ జయరామ జయ జయ రామ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 శ్రీరామ జయరామ జయ జయ రామ 🌹🙏 నృణాం శతాని పంచాశత్‌ వ్యాయతానాం మహాత్మనామ్‌ మంజూషామ్‌ అష్టచక్రానాం తాం సమూహస్తే కథంచన॥ 🌹బలిష్ఠులు, దీర్ఘకాయులు అయిన ఐదువేల మంది పురుషులు, ఎనిమిది చక్రాలున్న శకటం మీద అమర్చి ఉన్న శివధనుస్సును అతికష్టంతో తోసుకుంటూ తీసుకు వస్తారు. కేవలం రాముడి కర స్పర్శతోనే ధనుస్సు వంగుతుంది. ఎడమ చేతితో ధనుస్సును పట్టుకుని, కుడి చేతితో ఆ వింటి నారిని పైకొనకు బంధించి, ఆకర్ణాంతం అల్లెత్రాటిని లాగుతాడు. మరుక్షణంలో ఫెళఫెళమంటూ లోకభీకరమైన శబ్దం చేస్తూ, శివధనుస్సు రెండుగా విరిగిపోతుంది. 💥మహోజ్జ్వలమైన ఈ ఘట్టాన్ని ఆధ్యాత్మికంగా పరికించి చూస్తే, సమున్నతమైన ఆత్మబోధ మనకు అందుతుంది.  శాస్త్ర పరిభాషలో ధనుస్సు అంటే ఓంకారం (ప్రణవం) అని అర్థం. ‘ప్రణవో ధనుః శిరోహ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే’ అని ఉపనిషద్వాక్యం. ప్రణవం అంటే వంగేది అని అర్థం. ప్రణవం ఎవరికైతే వంగుతుందో, అటువంటి వ్యక్తికి మన ఆత్మను అర్పించాలి. ఇక్కడ ధనుస్సు రూపంలో ప్రణవం రామచంద్రునికి వంగింది. అంటే, మన ఆత్మను అర్పించడానికి తగిన దైవం శ్రీరాముడు. శివధనుస్సును ఎక్కుపెట్టడానికి ఎందరో దేవతలు కూడా ప్రయత్నించారు. వారె...

ప్రతి రోజు స్నానానంతరం పఠించాల్సిన సూర్య భగవానుడి స్తోత్రం..

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః 🌹🙏 💥సాక్షాత్తు శ్రీకృష్ణుడి కొడుకైన సాంబుడు సూర్యుడిని ఆరాధించినట్లు ప్రతీతి. ఇతడు శ్రీకృష్ణుడికి జాంబవతి వల్ల పుట్టిన కొడుకు. ముని శాపం వల్ల కుష్టు వ్యాధి గ్రస్థుడయ్యాడు. సూర్యుడిని ఆరాధించి రోగ విముక్తుడయ్యాడు.  కుష్టువ్యాధిగ్రస్థుడైన సాంబుడు సూర్యుడి కోసం పన్నెండేళ్లు కఠోర తపస్సు చేశాడు. సూర్యుడు కరుణించడంతో రోగ విముక్తి పొందాడు. సూర్యసాక్షాత్కారం జరిగిన తర్వాత సూర్య సహస్ర నామాల కంటే మించిన 21 నామాలను సాంబుడికి సూర్యుడు ఉపదేశిస్తాడు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఎదురుగా నిలబడి వీటిని భక్తితో చదివితే వారికి అనారోగ్య సమస్యలు రావు. వచ్చిన వారికి వాటి నుంచి విముక్తి లభిస్తుందని భవిష్యపురాణం పేర్కొంది. 💥ప్రతి రోజు స్నానానంతరం పఠించాల్సిన సూర్య భగవానుడి స్తోత్రం... వికర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవిః లోకప్రకాశకః శ్రీమాన లోక చక్షుర్గ్రహేశ్వరః లోకసాక్షీ త్రిలోకేశః కర్తా హర్తా తమిస్రహా తపన స్తాపనశ్చైవ శుచి స్సప్తాశ్వవాహనః గభస్తిహస్తో బ్రహ్మా చ సర్వదేవనమస్కృతః ఏకవింశతి రిత్యేషస్తవ ఇష్టస్సదా మమ శరీరారోగ్యద శ్చ...

💥శ్రీ వేంకటేశమంగళాశాసనం.. తెలుగు తాత్పర్యముతో..

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 💥శ్రీ వేంకటేశమంగళాశాసనం.. తెలుగు తాత్పర్యముతో.. శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేఽర్థినామ్ । శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥ 1 ॥ #తాత్పర్యం:  లక్ష్మీదేవి భర్తయును, కళ్యాణ గుణములకు నిధియును, శరణార్థులకు రక్షకుడును, వేంకటాచలనివాసియు నగు శ్రీనివాసునకు మంగళ మగును గాక. లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే । చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్ ॥ 2 ॥ #తాత్పర్యం:  లక్ష్మీదేవిని విలాసముగా చూచునట్టియు, చక్కని కనుబొమలు కల్గినట్టి నేత్రములు కలవాడును, సమస్త లోకములకును కన్నువంటివాడును అగు వేంకటేశ్వరునకు మంగళమగు గాక. శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే । మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥ 3 ॥ #తాత్పర్యం:  శ్రీ వేంకటాచల శిఖరాగ్రమునకు చక్కని యాభరణమైన పాదములు కలవాడును, సమస్త మంగళములకు నిలయమైనవాడును అగు శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగు గాక. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసామ్ । సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ ॥ 4 ॥ #తాత్పర్యం:  సర్వావయవముల యొక్క సౌందర్య సంపదచే సమస్త ప్రాణులకును సమ్మోహమును కల్గించునట్టి శ్రీ వేంకటేశ్వరునికి మంగళమగు గాక...

💥శ్రీ కామాక్షీ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 💥శ్రీ కామాక్షీ స్తోత్రం💥 కల్పనోకహ పుష్పజాల విలసన్నీలాలకాం మాతృకాం కాంతాం కంజదళేక్షణాం కలిమల ప్రధ్వంసినీం కాళికాం కాంచీనూపురహార హీరసుభగాం కాంచీపురీనాయకీం కామాక్షీం కరికుంభసన్నిభకుచాం వందే మహేశప్రియామ్ || ౧ || మాయామాదిమకారణం త్రిజగతామారాధితాంఘ్రిద్వయా- -మానందామృతవరిదాసి జగతాం విద్యాం విపద్దుఃఖహాం మాయామానుషరూపిణీ మణులసన్మధ్యాం మహామాతృకాం కామాక్షీం గజరాజ మందగమనాం వందే మహేశప్రియామ్ || ౨ || కాశాభాం శుకసుప్రభాం ప్రవిలసత్కోశాతకీ సన్నిభాం చంద్రార్కానలలోచనాం సురచితాలంకారభూషోజ్జ్వలాం బ్రహ్మ శ్రీపతి వాసవాదిమునిభిః సంసేవితాంఘ్రిద్వయాం కామాక్షీం పరిపూర్ణచంద్రవదనాం వందే మహేశప్రియామ్ || ౩ || ఐం క్లీం సౌమితియాం వదంతి మునయస్తత్వార్థరూపాం పరాం వాచామాదిమకారణాం హృది సదా ధ్యాయంతి యాం యోగినః బాలాం ఫాలవిలోచనాం నవజపావర్ణాం సుషుమ్నాలయాం కామాక్షీం సకలార్తిభంజనపరాం వందే మహేశప్రియామ్ || ౪ || యత్పాదాంబుజరేణులేశమనిశం లబ్ద్వా విధత్తే విధిః విశ్వం తత్పరిపాతి విష్ణురఖిలం యస్యాః ప్రసాదాచ్చిరం రుద్రస్సంహరతి క్షణాత్తదఖిలం యన్మాయయా మోహితం కామాక్షీమతిచిత్రచారుచరితాం వందే మహేశప్రియామ్ |...

💥శ్రీ మహాలక్ష్మ్యష్టకం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🌹🙏 💥రెండు చేతులలో కమలాలు ధరించి, అభయ, వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా... భక్తుల అభీష్టాలను తీర్చే మహాలక్ష్మి సర్వ మంగళకారిణి. లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్ముల సమష్టి రూపమైన మహాలక్ష్మీదేవినీ పూజిస్తే... ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుందనీ, సుఖ సంతోషాలు చేకూరుతాయనీ, దారిద్య్రం, దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలూ కలుగుతాయనీ భక్తుల నమ్మిక. 💥శ్రీ మహాలక్ష్మ్యష్టకం💥 ఇంద్ర ఉవాచ - నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే । శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1 ॥ తాత్పర్యం:  అమ్మా ! శ్రీపీఠనివాసిని ! మహామాయారూపిణీ!దేవతలచే పూజించబడుతల్లీ ! గదాశంఖచక్రాలను ధరించినదేవీ ! మహాలక్ష్మీ ! నీకు అనేక నమస్కారములు.   #వివరణ: సృష్టి స్థితి లయాలకు మూలకారణమైన శక్తికి మహామాయ అనిపేరు.  ఆమెయే శ్రీచక్రారూడ. సకల దేవతలు ఆమెనే పూజిస్తుంటారు. ఆమె శంఖచక్రగదాహస్త అయి, వైష్ణవీరూపంతో మహాలక్ష్మిగా, విష్ణుపత్నిగా జగద్రక్షణ చేస్తూంది. లక్ష్మి అంటే సర్వాన్నీ చూ...

ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏 వీణాం కరైః, పుస్తకమ్ అక్షమాలాం బిభ్రాణమ్ అబ్రాభ గళం వరాఢ్యం ఫణీంద్ర కక్ష్యం మునిభిః శుకాద్యైః సేవ్యం వటాధః కృత నీడ మీడే!  💥"మేధా దక్షిణామూర్తి" సంగీతానికి గుర్తుగా వీణను, విద్యలకు గుర్తుగా పుస్తకం, అక్షరానికి గుర్తుగా అక్షమాలను ధరించి ఉంటాడు. నల్లటి గొంతు భాగం ఆస్వామి గరళ కంఠుడని చెబుతుంది. ఒక నాగుపామును నడుముకు చుట్టుకుని ఉంటాడు. విషసర్పంతో సమానమైన విషయాలను కూడా బంధించగల శక్తి ఆ స్వామికి ఉందనడానికి ఇది సూచనగా భావించాలి. ఒక వట వృక్ష ఛాయలో ప్రశాంతంగా కూర్చుని ఉన్నట్లు దక్షిణామూర్తి స్వరూపం ఉంటుంది. కరుణామయ వీక్షణాలతో వరాలను ప్రసాదిస్తున్నట్లు ఆ స్వామి ముఖం ఉంటుంది. ఆయన సదా "చిన్ముద్ర"లో ఉంటాడు. అగ్నిలాంటి తేజస్సుతో వెలుగుతుంటాడు. మర్రి చెట్టు కింద ఒక వేదికపై కూర్చుని ఉంటాడు. కుడి కాలిని కిందికి జారవిడిచినట్లు కనిపిస్తాడు. ఆ కాలి కింద "అపస్మారుడు" అనే ఒక రాక్షసుడిని అదిమి పట్టి ఉంచుతాడు. అపస్మారుడు అజ్ఞానానికి గుర్తు. ఆయన పాదాల చెంత ఆయనకంటే వృద్ధులైన శిష్యులు కనిపిస్తారు. ఎంత వయసు ఉన్నా జ్ఞానుల ముందు విధేయులుగా ...

💥దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏 జీవితంలో మానవులకు ఎన్నో రకాల సమస్యలు. అన్ని సమస్యలకూ పరిష్కారం ఆధ్యాత్మిక జ్ఞానం. సర్వ కష్టాలను కడతేర్చే శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం.. దీనిని నిత్యం పారాయణం చేయటం ద్వారా సర్వాభీష్ట సిద్ది కలుగును.. 💥దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం💥 అస్య శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్ర మహా మంత్రస్య, పరమహంస ఋషిః, దత్త పురుష పరమాత్మా దేవతా, సకల కామనా సిద్ద్యర్తే పారాయనే (జపే) వినియోగ: హరిః ఓం... ప్రథమస్తు మహాయోగీ ద్వితీయ ప్రభురీశ్వరః తృతీయశ్చ త్రిమూర్తిశ్చ చతుర్థో జ్ఞాన సాగరః పంచమో జ్ఞాన విజ్ఞానం  షష్ఠస్యాత్ సర్వమంగళమ్ సప్తమః పుండరీకాక్షో అష్టమో దేవ వల్లభః నవమో నందదేవేశ దశమా నందదాయకః ఏకాదశ మహారుద్రో ద్వాదశః కరుణాకరః!! ఏతాని ద్వాదశ నామాని దత్తాత్రేయ మహాత్మనః! మంత్రరాజేతి విఖ్యాతం దత్తాత్రేయో హరఃపరః!! క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం! రాజద్వారే పతే ఘోరే సంగ్రామేషు జలాంతరే!! గిరేర్గుహాంతరేరణ్యే వ్యాఘ్రచోర భయాదిషు! ఆవర్తన సహస్త్రేషు లభతే వాంఛితం ఫలం!! త్రికాలే యః పఠే నిత్యం మోక్ష సిద్ధిమవాప్నుయాత్! దత్తాత్రేయః సదారక్షిత్ యశః సత్యం న సంశయః!! విద్యార్థీ ...

ఓం లక్ష్మీనృసింహాయ నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩ఓం లక్ష్మీనృసింహాయ నమః🌹🙏 💥పగలు రాత్రి కాని సంధ్యా సమయాన, నరుడు జంతువు కాని రూపంతో, భూమ్యాకాశాలు కాని తొడలపై, సజీవము నిర్జీవమూకాని చేతిగోళ్ళతో, హరణ్య కశిపుని చీల్చి భక్త జన రక్షకుడై, సుదర్శన, శంఖ, చక్ర, ఖడ్గ, అంకుశ, పాశు, పరశు, ముసల, కులిశ, పద్మాదులను కలిగి గదాధరుడై ప్రకాశించిన ఉగ్రనారసింహ అవతార తత్వం మిగతా అవతారాలకు భిన్నమైనది. దుష్టశిక్షణ శిష్ట రక్షణ, సర్వాంతర్యామిత్వం, భక్తుని మాటను నిజం చేయడం... నమ్మినబంటును శాప విముక్తుని గావించడం, ఎన్ని నియంత్రణలు, వరాలున్నా వాటిని అధిగమించి భక్తుడు లేక వైరి కోరుకున్న విధంగానే శతృవధ చేయడం, సూక్ష్మం నుండి స్థూల రూపాన్ని ఏదైనా ధరించడం నరసింహావతారంలో విశిష్టతలు.  💥విష్ణుసేవా తత్పరులైన జయ విజయులు వైకుంఠంలో ద్వారపాల కులు. ఒకసారి సనక సనందాది మహా మునులు వికుంఠుని దర్శనార్ధం వెళ్ళగా, అది తగిన సమయం కాదని, జయవిజయులు అడ్డగించగా, మునులు కోపించి వారిని విష్ణు లోకానికి దూరం కాగలరని శపించారు.  అప్పుడు వారు విష్ణువు శరణు వేడగా, మునుల శాపానికి తిరుగు లేదని చెప్పారు. కాని వారిలోని భక్తిని తెలిసిన మహావిష్ణువు వారికి ఒక ఉపాయాన్ని చెప్పారు. అ...

💥బ్రహ్మకు ప్రీతికరమైన "జ్యేష్ఠమాసం"

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥బ్రహ్మకు ప్రీతికరమైన "జ్యేష్ఠమాసం" చాంద్రమానం ప్రకారం జ్యేష్ఠ మాసం మూడవ నెల. ఈ మాసంలోని పూర్ణిమరోజు చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల దీనికి జ్యేష్ఠమాసం అని పేరు ఏర్పడింది. ఈ మాసం అత్యంత ఫలప్రదమైంది. మహా విష్ణువుకు వైశాఖ మాసం ప్రీతిపాత్రమైనట్లు ఈ మాసం బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. బ్రహ్మదేవుడికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ప్రతిరోజూ బ్రహ్మదేవుడిని పూజించాలని శాస్త్రవచనం. ఛైత్ర, వైశాఖం తర్వాత వచ్చే జ్యేష్ఠ మాస పుణ్య కాలంలో చేసే పూజలు, జపాలు, పారాయణాదులకు విశేష ఫలముంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. జ్యేష్ఠంలో విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే ఈ మాసంలో జలదానం చేయడం చాలా ఉత్తమం. జ్యేష్ఠశుద్ద తదియను "#రంభాతృతీయ"గా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజించడమే కాదు, దానాలకు శుభకాలం. ముఖ్యంగా అన్న దానం చేయడం ఉత్తమం. జ్యేష్ఠశుద్ద దశమిని "#దశపాపహరదశమి" అంటారు. అంటే 'పది రకాల పాపాలను పోగొట్టే దశమి' అని అర్ధం. పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం, లేదా ఏదైనా నది...

💥శని స్తోత్రం దశరథ కృతం💥

Image
 ⚜️🕉️🚩ఓం శనైశ్చరాయ నమః🌹🙏 💥శని స్తోత్రం దశరథ కృతం💥 నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ । నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ చ ॥ 1 ॥ నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ । నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక ॥ 2 ॥ నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః । నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః ॥ 3 ॥ నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే । నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోఽస్తు తే ॥ 4 ॥ నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః । నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోఽస్తు తే ॥ 5 ॥ సూర్యపుత్త్ర నమస్తేఽస్తు భాస్వరోభయదాయినే । అధోదృష్టే నమస్తేఽస్తు సంవర్తక నమోఽస్తు తే ॥ 6 ॥ నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమోనమః । తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ ॥ 7 ॥ జ్ఞానచక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజసూనవే । తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్‍ క్షణాత్ ॥ 8 ॥ దేవాసురమనుష్యాశ్చ సిద్ధవిద్యాధరోరగాః । త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే ॥ 9 ॥ బ్రహ్మా శక్రోయమశ్చైవ మునయః సప్తతారకాః । రాజ్యభ్రష్టాః పతంతీహ తవ దృష్ట్యాఽవలోకితః ॥ 10 ॥ త్వయాఽవలోకితాస్తేఽపి నాశం యాంతి సమూలతః । ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్థితః ॥ 11 ॥ ⚜️🕉️⚜️🕉️⚜...

💥రామాంజనేయ బంధం హరిహరాత్మకం💥

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 💥రామాంజనేయ బంధం హరిహరాత్మకం💥 రామాంజనేయుల బంధం భక్తుడు, భగవంతుడికి ఉండే సామాన్య సంబంధం కాదు. ఇద్దరు సమ ఉజ్జీల మధ్య నడిచిన అనుబంధం. సేవలందుకునే రాముడు, సేవించుకునే హనుమంతుడు ఇద్దరూ భగవంతులే. నరత్వం ఒకరిది. వానరత్వం ఇంకొకరిది. రాముడు మర్యాదా పురుషోత్తముడైతే హనుమంతుడు బుద్ధిమంతులలో వరిష్ఠుడు. చిటికలో వ్యూహాలు అల్లగల చతురుడు రాముడు. చిట్కా చెప్పి చిటికేస్తే ఎలాంటి ఘనకార్యాలనైనా క్షణాలలో సాధించుకు రాగల కార్యధురీణుడు హనుమంతుడు. తండ్రి మాటకు కట్టుబడినవాడు రాముడు, రాముడి మాటకు కట్టుబడినవాడు హనుమంతుడు. శివుని విల్లు ఎక్కు పెట్టినవాడు రాముడు. శివుని మనసు తెలిసి మసలుకునేవాడు హనుమంతుడు. రాముడు సూర్యవంశజుడు. హనుమంతుడు సూర్యుని అనుంగు శిష్యుడు. సూర్యుని ముఖతః వేదవేదాంగాలు, సర్వశాస్త్రాలు ఉపదేశం పొందినవాడు ఆంజనేయుడు. రామకార్య నిర్వహణే జన్మకారణమైనవాడు, అదే గురుదక్షిణగా సమర్పించుకోవాల్సినవాడు హనుమంతుడు. రాముని మనసెరిగి మసలుకునే గొప్ప బంటు హనుమంతుడు. హనుమ మనసులో కొలువుండి దర్శనమిచ్చే భగవానుడు రాముడు.  ‘శివస్య హృదయం విష్ణోః విష్ణ్యస్థ హృదయం శివః’ అన్నమాటకు ఈ అనుబంధం ర...

💥శివ షడక్షరీ స్తుతి💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 ఈశ్వరుడిని మరియు న, మ, శి, వా, య, గా పిలవబడే పవిత్రమైన పంచాక్షరాల శక్తిని కీర్తించే ప్రసిద్ధమైన శివపంచాక్షర స్తోత్రం.. శివ షడక్షరీ స్తోత్రం. 💥శివ షడక్షరీ స్తుతి💥 ||ఓం ఓం|| ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః | కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః || 1 || ||ఓం నం|| నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాం గణాః | నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః || 2 || ||ఓం మం|| మహాతత్వం మహాదేవ ప్రియం ఙ్ఞానప్రదం పరమ్ | మహాపాపహరం తస్మాన్మకారాయ నమోనమః || 3 || ||ఓం శిం|| శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణమ్ | మహాపాపహరం తస్మాచ్ఛికారాయ నమోనమః || 4 || ||ఓం వాం|| వాహనం వృషభోయస్య వాసుకిః కంఠభూషణమ్ | వామే శక్తిధరం దేవం వకారాయ నమోనమః || 5 || ||ఓం యం|| యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభమ్ | యం నిత్యం పరమానందం యకారాయ నమోనమః || 6 || షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ | తస్య మృత్యుభయం నాస్తి హ్యపమృత్యుభయం కుతః || శివశివేతి శివేతి శివేతి వా భవభవేతి భవేతి భవేతి వా | హరహరేతి హరేతి హరేతి వా భుజమనశ్శివమేవ నిరంతరమ్ || ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమచ్ఛంకరభగవత్పాదపూజ్యకృత శివషడక్షరీస్తో...

💥శ్రీ మహా మృత్యుంజయ స్తోత్రమ్..

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥శ్రీ మహా మృత్యుంజయ స్తోత్రమ్.. హరిః ఓం అస్యశ్రీ మహా మృత్యుంజయ స్తోత్ర మహామంత్రస్య శ్రీ మార్కండేయ ఋషిః అనుష్టుప్ఛంధః శ్రీ మృత్యుంజయో దేవతా గౌరీ శక్తిః మమ సర్వారిష్ట సమస్త మృత్యు శాంత్యర్థే జపే వినియోగః #ధ్యానమ్ చంద్రార్కాగ్ని విలోచనం స్మితముఖం పద్మద్వ యాంతః స్థితం | ముద్రాపాశ మృగాక్ష స్రక్ర్ప విలస త్పాణిం హిమాంశుప్రభం | కోటీందుప్రగల త్సుధా ఫ్లుతతనుం హారాది భూషోజ్జ్వలం | కాంతం విశ్వ విమోహనం పశుపతిం మృత్యుంజయ భావయే || ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిమ్ నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభుం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || గంగాధరం మహాదేవం సర్పాభరణ భూషితం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || అనాధ పరమానందం కైవల్యపద గామినం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరి...

💥శ్రీ రామచంద్రుని వంశ వృక్షం💥

Image
 ⚜️🕉️🚩శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏 శరీరస్య గుణానాం చ, దూరమత్యంత మంతరం శరీరం క్షణవిధ్యంసి, కల్పాంతస్థాయినో గుణాః 🌹శరీరానికి, గుణానికి చాలా భేదమున్నది. శరీరం ఏ క్షణంలో నైనా పతనమౌతుంది. (తేలు కుడితే, దోమ కుడితే, అత్యంత సూక్ష్మక్రిమి దాడి చేస్తే నశించేది శరీరం) కాని సృష్టి చివరి వరకు నిలిచి ఉండేది వ్యక్తి గుణం మాత్రమే. శరీరం కోసం జీవించడం కాదు. లోకకళ్యాణం కోసం ఈ జీవితాన్ని అర్పించాలి. ఈ శరీరాన్ని ఉపయోగించి లోకకల్యాణ కారకమైన సద్గుణాలను సంపాదించుకోవాలి. మనం విగ్రహారాధకులం మాత్రమే కాదు, గుణారాధకులం.  మహాపురుషుల విగ్రహాలు పెట్టుకున్న మనం వారి గుణాలనూ స్మరించాలి. 💥లోకాభిరాముని వంశం ఎంత గొప్పదో చూడండి. రాముడు ఒక ఉత్తమ కొడుకుగా, ఉత్తమ ప్రజాసేవకుడు 'రాజు'గా, ఉత్తమ మిత్రునిగా, ఉత్తమ భర్తగా, ఉత్తమ సోదరునిగా, ఉత్తమ శిష్యునిగా ఈ విధంగా అనేకమైన సుగుణాలు కలిగిన రాముడుకి అన్ని ఉత్తమ లక్షణాలు రావడానికి వారి వంశజులను ' పూర్వీకులను' గమనిస్తే అర్ధం అవుతుంది, శ్రీరామ చంద్రుని వంశ పరంపర విన్నా చదివినా , పుణ్యఫలం దక్కుతుంది. 💥శ్రీ రామచంద్రుని వంశ వృక్షం💥 బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు ...

త్రికాలాల్లో సూర్యారాధన...

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః 🌹🙏 💥సూర్యుడిని ఎలా ఉపాసించాలి? త్రికాలాల్లో సూర్యారాధన... బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వర: | సాయంధ్యాయేస్సదా విష్ణుం త్రయీమూర్తిర్దివాకర: || సూర్యభగవానుడు త్రిమూర్తి స్వరూపుడు. జీవుల పుట్టుక, పెరుగుదల, క్షయం అన్నీ సూర్యతేజస్సు వల్లే జరుగుతున్నాయి. ఈవిధంగా సూర్యుడు త్రిమూర్తి స్వరూపుడయ్యాడు. ప్రాత:కాలం : బ్రహ్మముహూర్తంలో సూర్యదండకాన్ని స్మరిస్తూ నిద్రలేచి, కాలోచిత కృత్యాలు పూర్తిచేసుకోవాలి. స్నానం, సంధ్యావందనం, నిత్యార్చన పూర్తిచేసుకున్న తర్వాత సూర్యమంత్రాన్ని ఉపాసన చెయ్యాలి. సూర్యతర్పణం అనంతరం తులసికోటలో సూర్యునికి అర్ఘ్యం విడిచి పెట్టాలి. ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలి. మధ్యాహ్నకాలం : మాధ్యాహ్నిక అర్చన తర్వాత సూర్యనారాయణస్వామి రూపును లేదా సూర్య సాలగ్రామాన్ని పూజించాలి. మహానివేదన సమర్పించి, ఆదిత్యహృదయం పారాయణ చెయ్యాలి. తీర్థప్రసాదాలు స్వీకరించాలి. సాయంకాలం : నీరెండగా ఉన్న సమయంలో సంధ్యావందనం పూర్తి చేసుకుని, సూర్యభగవానుడికి షోడశ ఉపచారాలతో పూజ చెయ్యాలి. నివేదన చేసి, హారతి సమర్పించాలి. సూర్యాష్టకం, దండకం పారాయణ చెయ్యాలి. 💥సూర్యోపాసన ...

💥శ్రీ లక్ష్మీనారాయణాష్టకం💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥శ్రీ లక్ష్మీనారాయణాష్టకం💥 ఆర్తానాం దుఃఖశమనే దీక్షితం ప్రభుమవ్యయమ్ | అశేషజగదాధారం లక్ష్మీనారాయణం భజే || 1 || అపారకరుణాంభోధిం ఆపద్బాంధవమచ్యుతమ్ | అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే || 2 || భక్తానాం వత్సలం భక్తిగమ్యం సర్వగుణాకరమ్ | అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే || 3 || సుహృదం సర్వభూతానాం సర్వలక్షణసంయుతమ్ | అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే || 3 || చిదచిత్సర్వజంతూనాం ఆధారం వరదం పరమ్ | అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే || 5 || శంఖచక్రధరం దేవం లోకనాథం దయానిధిమ్ | అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే || 6 || పీతాంబరధరం విష్ణుం విలసత్సూత్రశోభితమ్ | అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే || 7 || హస్తేన దక్షిణేన యజం అభయప్రదమక్షరమ్ | అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే || 8 || యః పఠేత్ ప్రాతరుత్థాయ లక్ష్మీనారాయణాష్టకమ్ | విముక్తస్సర్వపాపేభ్యః విష్ణులోకం స గచ్ఛతి || 9 || ఇతి శ్రీ లక్ష్మీనారాయణాష్టకం | ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

💥శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏 💥శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి💥 ఈశానాం జగతోఽస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షఃస్థల నిత్యవాసరసికాం తత్-క్షాంతి సంవర్ధినీమ్ । పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్ ॥ శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ । స్వామిన్ సుశీల సుల భాశ్రిత పారిజాత శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే ॥ 2 ॥ ఆనూపురార్చిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ । సౌమ్యౌ సదానుభనేఽపి నవానుభావ్యౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 3 ॥ సద్యోవికాసి సముదిత్త్వర సాంద్రరాగ సౌరభ్యనిర్భర సరోరుహ సామ్యవార్తామ్ । సమ్యక్షు సాహసపదేషు విలేఖయంతౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 4 ॥ రేఖామయ ధ్వజ సుధాకలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రైః । భవ్యైరలంకృతతలౌ పరతత్త్వ చిహ్నైః శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 5 ॥ తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్-మహోభి రభిభూత మహేంద్రనీలౌ । ఉద్య న్నఖాంశుభి రుదస్త శశాంక భాసౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 6 ॥ స ప్రేమభీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేఽపి సపది క్లమ మాధధానౌ । కాంతా న...

ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః🌹🙏 ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయైు ముఖైస్త్రీ క్షణైః యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్‌ గాయత్రీం వరదాభయాం కుశకశా శ్శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మథారవింద యుగళం హస్తైర్వహంతీం భజే! 💥సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం , చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాత: కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది.  ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. "న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌" అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. "గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తన భాష్యములో వివరించారు. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షిం...

💥మహాలక్ష్మీస్తోత్రం (ఇంద్రరచితం)

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 💥ఇంద్రునికి దేవేంద్ర ఆధిపత్యం కలుగజేసిన మహాలక్ష్మీ మంత్ర స్తోత్రంతో అమ్మవారి పూజ చేయడం వలన ఎన్నో జన్మలనుంచీ అనుభవిస్తున్న అలక్ష్మీ దోషాలన్నీ తొలగి ఆ ఇంట లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువుంటుంది. శ్రీలక్ష్మీ మహామంత్ర స్తోత్రం పారాయణ చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి. ఇది ఇంద్రుడికి దేవేంద్ర ఆధిపత్యం ఇచ్చిన మహాలక్ష్మి మంత్ర స్తోత్రం. 💥మహాలక్ష్మీస్తోత్రం (ఇంద్రరచితం) నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః | కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమో నమః || పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః | పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః || సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యై నమో నమః | హరిభక్తిప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమో నమః || కృష్ణవక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః | చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే || సంపత్యధిష్ఠాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః | నమో వృద్ధిస్వరూపాయై వృద్ధిదాయై నమో నమః || వైకుంఠే యా మహాలక్ష్మీః యా లక్ష్మీః క్షీరసాగరే | స్వర్గలక్ష్మీరింద్రగేహే రాజలక్ష్మీః నృపాలయే || గృహలక్ష్మీశ్చ గృహిణాం గేహే చ గృహదేవతా | సురభిస్సాగరే జాతా దక్షిణా యజ్ఞకామనీ || అద...

💥దక్షిణామూర్తి చతుర్వింశతి వర్ణమాలా స్తోత్రమ్:

Image
 ⚜️🕉️🚩 ఓం నమో భగవతే దక్షిణామూర్తయే 🙏 దక్షిణామూర్తి నామాన్ని నిత్యం మననం చేసుకుంటే అదే మంత్రం అవుతుంది. ఆ మంత్ర శక్తిని అందరికీ అందజేయడానికి శంకరులు ఆ మంత్రంలోని ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకాన్ని రచించారు. మొత్తం 24 అక్షరములతో 24 శ్లోకములు అందించారు.  ఈ స్తోత్రము నందలి ప్రతి శ్లోకంలోని మొదటి అక్షరము వరుసగా చేర్చినచో "ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రయచ్చ స్వాహా" అను దక్షిణామూర్తి మహామంత్రమగును. 💥దక్షిణామూర్తి చతుర్వింశతి వర్ణమాలా స్తోత్రమ్: ఓమిత్యేతద్యస్య బుధైర్నామ గృహీతం యద్భాసేదం భాతి సమస్తం వియదాది యస్యాజ్ఞాతః స్వస్వపదస్థా విధిముఖ్యాస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి (1) నమ్రాంగాణాం భక్తిమతాం యః పురుషార్థాన్దత్వా క్షిప్రం హంతి చ తత్సర్వవిపత్తీః పాదాంభోజాధస్తనితాపస్మృతిమీశం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి (2) మోహధ్వస్త్యై వైణికవైయాసికిముఖ్యాః సంవిన్ముద్రాపుస్తకవీణాక్షగుణాన్యమ్ హస్తాంభోజైర్బిభ్రతమారాధితవంతస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి (3) భద్రారూఢం భద్రదమారాధయితృణాం భక్తిశ్రద్ధాపూర్వకమీశం ప్రణమంతి ఆదిత్యా యం వాంఛితసిద్ధ్యై కరుణాబ్ధిం తం ప్రత్యంచం దక...

💥శ్రీ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రం..

Image
 ⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం🌹🙏 💥శ్రీ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రం.. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జహద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాక్తమిత్రం |1| భజే పామరం భావనీ నిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుభాసం భజే చంద్రికా కుందమందారహాసం భజే సంతతం రామ భూపలహాసమ్ |2| భజే లక్ష్మణ ప్రాణ రక్షాతి దక్షం భజే తోషితానేక గౌర్వాణ పక్షం భజే ఘోర సంగ్రామసీమా హతాక్షం భజే రామనామాతి సంప్రాప్తరక్షమ్ |3| కృతాభీలనాదం క్షితిక్షిప్రవాదం ఘనక్రాంత భృంగం కటిస్థోరంగం వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాశమ్ జయశ్రీ సమేతం భజే రామదూతమ్ |4| చలద్వాలఘాతం భ్రమచ్ఛక్రవాలం కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండం మహాసింహనాధాద్విశీర్ణత్రిలోకం భజేదాంజనేయం ప్రభుం వజ్రకాయమ్ |5| రణేభీషణే భీషణే మేఘనాధే సనాదే సరోషే సమారోపితే మిత్రముఖ్యే ఖగానాం ఘనానాం సురాణాంచమార్గే నటంతం వహంతం హనూమంతమీడే |6| ఘనద్రత్నజంభారి దంభోళిధారం ఘనద్యంతనిర్ధూత కాలోగ్రదంతం పదాఘాత భీతాబ్ధభూతాధివాసం రణోక్షోణిదక్షం భజే పింగళాక్షమ్ |7| మహాగ్రాహపీడాం మహోత్ఫాతపీడాం మహారోగపీడాం మహతీవ్రపీడాం హరత్యాస్తుతే పాదపద్మానురక్తో నమస్తే కపిశ్రేష్ట రామప్రియాయహ ...

💥వైశాఖ బహుళ దశమి... హనుమజ్జయంతి.

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 💥వైశాఖ బహుళ దశమి... హనుమజ్జయంతి. కలౌ పరాశర స్మృతి: కలియుగంలో పరాశర సంహిత అను స్మృతి గ్రంధం ప్రామాణికం కనుక.. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం.. శ్లో: వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే.. పైన తెలిపిన ప్రామాణిక శ్లోకాన్ని అనుసరించి.. ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించాడని అందుకే ఈరోజున హనుమంతుడి జన్మతిథి చేసుకోవడం అన్నీ రకాలా శ్రేష్టం అని అర్ధమగుచున్నది. హనుమంతుని జన్మవృత్తాంతం: శివమహాపురాణం, రామాయణం, మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది. హిందూ పురాణ కధల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా అంటారు. ఈ పుణ్య దినాన భక్తులు హనుమంతుని ఆలయాలకు వెళ్ళి స్వామిని పూజించి వడమాలలను వేసి, అప్పాలను స్వామికి సమర్పిస...

ఓం గం గణపతయే నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩ఓం గం గణపతయే నమః🌹🙏 గణపతిని జ్యేష్ఠ రాజుగా, సర్వ దేవతలలో ప్రథమ పూజ్యుడుగా ఋగ్వేదం వర్ణించింది. ముప్పది మూడు కోట్ల మంది దేవతలు గణాలుగా ఉండగా, వారందరికీ అధినాయకుడు గణపతియేనని వేదాలు నిర్దేశించాయి. శ్రీ మహా గణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్ట వసువులకూ కూడా ప్రభువు. ప్రణవ నాద స్వరూపుడు వినాయకుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యాజ్ఞ వల్క్యస్మృతి చెప్పింది. "గణ్యంతే బుధ్యంతే తే గణాః" అన్నట్లు సమస్త దృశ్య మాన వస్తు ప్రపంచానికి అధిష్టాన దేవత గణపతి.  నాయకుడు లేని సర్వస్వతంత్రుడు వినాయకుడు. సమస్త విఘ్నాలను తొలగించి శుభాలను కలుగజేసేవాడు విఘ్నేశ్వరుడు. దేవతా గణాలు ఉద్భవించి, సృష్టి ప్రారంభం అయినప్పటి నుండీ ఆది పురుషునిగా గణపతి పూజలు అందుకుంటున్నట్టుగా గణేశపురాణం తెలియజేస్తోంది. గణేశుడు విష్ణు స్వరూపమని ‘శుక్లాంబరధరం విష్ణుం’ అన్న శ్లోకం సూచిస్తుంది. వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో ఆవిర్భవిస్తాడు. కృతయుగంలో సింహవాహనంపై పదితలలతో దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో నెమలివాహనంపై మయూరేశుడుగా ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై చతుర్...