ప్రతి రోజు స్నానానంతరం పఠించాల్సిన సూర్య భగవానుడి స్తోత్రం..

 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః 🌹🙏


💥సాక్షాత్తు శ్రీకృష్ణుడి కొడుకైన సాంబుడు సూర్యుడిని ఆరాధించినట్లు ప్రతీతి. ఇతడు శ్రీకృష్ణుడికి జాంబవతి వల్ల పుట్టిన కొడుకు. ముని శాపం వల్ల కుష్టు వ్యాధి గ్రస్థుడయ్యాడు. సూర్యుడిని ఆరాధించి రోగ విముక్తుడయ్యాడు. 


కుష్టువ్యాధిగ్రస్థుడైన సాంబుడు సూర్యుడి కోసం పన్నెండేళ్లు కఠోర తపస్సు చేశాడు. సూర్యుడు కరుణించడంతో రోగ విముక్తి పొందాడు.


సూర్యసాక్షాత్కారం జరిగిన తర్వాత సూర్య సహస్ర నామాల కంటే మించిన 21 నామాలను సాంబుడికి సూర్యుడు ఉపదేశిస్తాడు.


ప్రతి ఒక్కరు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఎదురుగా నిలబడి వీటిని భక్తితో చదివితే వారికి అనారోగ్య సమస్యలు రావు. వచ్చిన వారికి వాటి నుంచి విముక్తి లభిస్తుందని భవిష్యపురాణం పేర్కొంది.


💥ప్రతి రోజు స్నానానంతరం పఠించాల్సిన సూర్య భగవానుడి స్తోత్రం...


వికర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవిః


లోకప్రకాశకః శ్రీమాన లోక చక్షుర్గ్రహేశ్వరః


లోకసాక్షీ త్రిలోకేశః కర్తా హర్తా తమిస్రహా


తపన స్తాపనశ్చైవ శుచి స్సప్తాశ్వవాహనః


గభస్తిహస్తో బ్రహ్మా చ సర్వదేవనమస్కృతః


ఏకవింశతి రిత్యేషస్తవ ఇష్టస్సదా మమ


శరీరారోగ్యద శ్చైవ ధనవృద్ధి యశస్కరః


స్తవరాజ ఇతి ఖ్యాతస్రీషులోకేషు విశ్రుతః


పై శ్లోకాన్ని సంధ్యాకాలాలలో పఠించినవారు సర్వపాప విముక్తులవుతారు. ధనవృద్ధి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.  


సూర్యుడికి ఇష్టమైన రోజు అయిన ఆదివారం నుంచి దీన్ని ప్రారంభించండి. అరోగ్యాన్ని పొందండి.


🌹🌹ఓం నమో భాస్కరాయనమః🌹🌹

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం