ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏


వీణాం కరైః, పుస్తకమ్ అక్షమాలాం

బిభ్రాణమ్ అబ్రాభ గళం వరాఢ్యం

ఫణీంద్ర కక్ష్యం మునిభిః శుకాద్యైః

సేవ్యం వటాధః కృత నీడ మీడే! 


💥"మేధా దక్షిణామూర్తి" సంగీతానికి గుర్తుగా వీణను, విద్యలకు గుర్తుగా పుస్తకం, అక్షరానికి గుర్తుగా అక్షమాలను ధరించి ఉంటాడు.


నల్లటి గొంతు భాగం ఆస్వామి గరళ కంఠుడని

చెబుతుంది. ఒక నాగుపామును నడుముకు చుట్టుకుని

ఉంటాడు. విషసర్పంతో సమానమైన విషయాలను కూడా బంధించగల శక్తి ఆ స్వామికి ఉందనడానికి ఇది సూచనగా భావించాలి.


ఒక వట వృక్ష ఛాయలో ప్రశాంతంగా కూర్చుని ఉన్నట్లు దక్షిణామూర్తి స్వరూపం ఉంటుంది.


కరుణామయ వీక్షణాలతో వరాలను ప్రసాదిస్తున్నట్లు ఆ స్వామి ముఖం ఉంటుంది. ఆయన సదా "చిన్ముద్ర"లో ఉంటాడు. అగ్నిలాంటి తేజస్సుతో వెలుగుతుంటాడు.


మర్రి చెట్టు కింద ఒక వేదికపై కూర్చుని ఉంటాడు. కుడి కాలిని కిందికి జారవిడిచినట్లు కనిపిస్తాడు. ఆ కాలి కింద "అపస్మారుడు" అనే ఒక రాక్షసుడిని అదిమి పట్టి ఉంచుతాడు. అపస్మారుడు అజ్ఞానానికి గుర్తు.


ఆయన పాదాల చెంత ఆయనకంటే వృద్ధులైన శిష్యులు కనిపిస్తారు. ఎంత వయసు ఉన్నా జ్ఞానుల ముందు విధేయులుగా ఉండాలనే సందేశం ఇక్కడ కనిపిస్తుంది.


బలహీనులు, మూఢులు, విషయాలను అర్థం చేసుకునే శక్తి లేని వారు మాయా ప్రభావానికి లోనవుతారు. శరీరం, ఇంద్రియాలు, మనస్సు... ఇవి సత్యమని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి భ్రమలను తొలగించే శక్తి సర్వలోకాలకు గురువైన దక్షిణామూర్తికే ఉంది.


శివుడి అష్టమూర్తులు భూమి, జలం, అగ్ని, ఆకాశం, వాయువు, సూర్యుడు, చంద్రుడు, జీవుడుగా విరాజిల్లుతుంటాయి.


అంటే అన్నిటిలో ఉండి, వాటిని నడిపించే, వెలిగించే అఖండమైన ఆ శక్తి శివుడే అని అర్థం చేసుకోవాలి.

ఈ విషయాన్ని తెలుసుకున్న సాధకుడికి అందరిపై,

అన్నిటిపై సమభావన కలుగుతుంది.


ఇదే "#శివతత్త్వజ్ఞానం" దీన్ని తెలుసుకున్న వారికి మరణభయం ఉండదు. ఇదే విషయాన్ని మార్కండేయ మహర్షి తన దగ్గరకు వచ్చిన ఋషులకు తెలియజేశాడు.


💥దక్షిణామూర్తి "#చిన్ముద్ర" మహోదాత్త సందేశాన్ని అందిస్తుంది. ఈముద్రలో చూపుడు వేలు, బొటనవేలిపై ఆనించి ఉంటుంది. మిగిలిన మూడు వేళ్లు తిన్నగా ఉంటాయి.


ఈ తిన్నగా ఉన్న మూడు వేళ్లు మనిషిలో ఉండే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు సంకేతాలు. వీటిపై అధికారాన్ని సంపాదించి వాటిని అదుపులో ఉంచుకోమని చేసే సూచన ఇక్కడ కనిపిస్తుంది.


ఆయన కృపను పొందాలంటే... ముందుగా వైరాగ్యమనే నూనెను సంపాదించుకోవాలి. భక్తి అనే దీపపు వత్తిని సిద్ధం చేసుకోవాలి. ఆ నూనెను, వత్తిని జ్ఞానబోధ అనే పాత్రలో ఉంచి ధ్యానమనే దీపాన్ని వెలిగించాలి. అప్పుడు ఆత్మజ్ఞానం ఆవిష్కృతమవుతుంది. సాధకుడి హృదయం దేదీప్యమానమవుతుందని మార్కండేయ మహర్షి తెలిపారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు