💥శ్రీ వేంకటేశమంగళాశాసనం.. తెలుగు తాత్పర్యముతో..
⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏
💥శ్రీ వేంకటేశమంగళాశాసనం.. తెలుగు తాత్పర్యముతో..
శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేఽర్థినామ్ ।
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥ 1 ॥
#తాత్పర్యం:
లక్ష్మీదేవి భర్తయును, కళ్యాణ గుణములకు నిధియును, శరణార్థులకు రక్షకుడును, వేంకటాచలనివాసియు నగు శ్రీనివాసునకు మంగళ మగును గాక.
లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే ।
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్ ॥ 2 ॥
#తాత్పర్యం:
లక్ష్మీదేవిని విలాసముగా చూచునట్టియు, చక్కని కనుబొమలు కల్గినట్టి నేత్రములు కలవాడును, సమస్త లోకములకును కన్నువంటివాడును అగు వేంకటేశ్వరునకు మంగళమగు గాక.
శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే ।
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥ 3 ॥
#తాత్పర్యం:
శ్రీ వేంకటాచల శిఖరాగ్రమునకు చక్కని యాభరణమైన పాదములు కలవాడును, సమస్త మంగళములకు నిలయమైనవాడును అగు శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగు గాక.
సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసామ్ ।
సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ ॥ 4 ॥
#తాత్పర్యం:
సర్వావయవముల యొక్క సౌందర్య సంపదచే సమస్త ప్రాణులకును సమ్మోహమును కల్గించునట్టి శ్రీ వేంకటేశ్వరునికి మంగళమగు గాక.
నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే ।
సర్వాంతరాత్మనే శ్రీమద్-వేంకటేశాయ మంగళమ్ ॥ 5 ॥
#తాత్పర్యం:
నిత్యుడు, దోషములు లేనివాడు, సత్య స్వరూపుడు, చిదానందరూపుడు, సర్వాంతర్యామియు అగు శ్రీవేంకటేశ్వరునికి మంగళమగు గాక.
స్వత స్సర్వవిదే సర్వ శక్తయే సర్వశేషిణే ।
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్ ॥ 6 ॥
#తాత్పర్యం:
స్వభావము చేతనే సమస్తము ఎరిగినవాడు, సర్వసమర్థుడు, సర్వమునకు నియంతయైనవాడు, సులభుడు, సుస్వభావము కలవాడు నగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.
పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ।
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్ ॥ 7 ॥
#తాత్పర్యం:
పరబ్రహ్మస్వరూపుడు, నిండిన కోరికలు కలవాడు, పరమాత్మయు అగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.
ఆకాలతత్త్వ మశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్ ।
అతృప్త్యమృత రూపాయ వేంకటేశాయ మంగళమ్ ॥ 8 ॥
#తాత్పర్యం:
కాలతత్త్వమును గమనింపక, ఎల్లపుడును తన్ను చూచుచున్న జీవాత్మలకు తనివితీరని అమృత స్వరూపుడగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.
ప్రాయః స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా ।
కృపయాఽఽదిశతే శ్రీమద్-వేంకటేశాయ మంగళమ్ ॥ 9 ॥
#తాత్పర్యం:
పురుషులందరికిని తన పాదములే శరణమని వారియెడల గల దయచే తఱచుగా తన హస్తముతో చూపుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.
దయాఽమృత తరంగిణ్యా స్తరంగైరివ శీతలైః ।
అపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్ ॥ 10 ॥
#తాత్పర్యం:
దయ యనెడి అమృత ప్రవాహము నందలి అలల వలె చల్లనైన తన కటాక్షములను వ్యాపింపజేసి జీవలోకమును చల్లపరచుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.
స్రగ్-భూషాంబర హేతీనాం సుషమాఽఽవహమూర్తయే ।
సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ ॥ 11 ॥
#తాత్పర్యం:
తాను ధరించిన పూలమాలలవలనను, నగల వలనను, వస్త్రములవలనను, ఆయుధములవలనను, ప్రకాశించు సుందర విగ్రహము కలవాడును, సమస్త బాధలను పోగొట్టువాడును అగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.
శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే ।
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్ ॥ 12 ॥
#తాత్పర్యం:
శ్రీ వైకుంఠ నివాసమున విరక్తిని పొంది, స్వామి పుష్కరిణీ తీరమునకు వచ్చి, అచట లక్ష్మీదేవితో కూడ వినోదించుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.
శ్రీమత్-సుందరజా మాతృముని మానసవాసినే ।
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥ 13 ॥
#తాత్పర్యం:
శ్రీమణవాళ మహర్షి యొక్క మనసునందును, సమస్త జీవరాసులయందును నివసించునట్టి శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక!
మంగళా శాసనపరైర్-మదాచార్య పురోగమైః ।
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ ॥ 14 ॥
#తాత్పర్యం:
మంగళాశాసనమును చేయుచున్న మా గురువును, సమస్త పూర్వాచార్యులును ఆరాధించు శ్రీనివాసునకు మంగళమగు గాక.
శ్రీ పద్మావతీ సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment