💥నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం..
⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏
💥నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం..
శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం వస్తుందని "పరాశర సంహిత"లో ఉంది.
నవగ్రహాల అనుగ్రహం త్వరగా పొందాలంటే వాల్మీకి రామాయణం లోని ఈ 9 శ్లోకాలు నిత్యం పారాయణ చేయడం మంచిది.
నవగ్రహాలు అత్యంత కరుణా స్వరూపులు. మనం పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపాల బట్టి ఫలితాలని ఇస్తారు.
కానీ భక్తితో వారిని ఇటువంటి స్తోత్రాలతో స్తుతిస్తే శుభఫలితాల్ని అనుగ్రహిస్తారు.
శ్రీ ఆంజనేయ నవరత్నమాలా శ్లోకాల పారాయణం వల్ల విద్యార్థులకు మేధస్సు, ఉద్యోగస్తులు, వ్యాపారులకు అభివృద్ధి, స్త్రీలకు వివాహం, సత్సంతానము మరియు వృద్దులకు ఆరోగ్యం కలుగుతుంది.
నిత్యం లేదా శనివారం అయినా వీటిని పారాయణ చేయడం వలన శుభఫలితాలని పొందవచ్చు.
వాల్మీకి రామాయణమునకు సుందరకాండ తలమానికము. సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం.
రత్నముల వంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామి వారికి సమర్పించబడినది. ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది.
ఇవి శ్రీ ఆంజనేయస్వామి వారి వైభవము, స్వామి వారికి నవ గ్రహములతో గల సంబంధము తెలియబర్చును. ఈ స్తోత్రం పారాయణ చేసినవారికి శ్రీ ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో బాటు నవగ్రహముల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది.
💥మాణిక్యం –
తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః ।
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ॥ 1 ॥
ముత్యం –
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ ।
స్మృతిర్మతిర్ధృతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి ॥ 2 ॥
ప్రవాలం –
అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖమ్ ।
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః ॥ 3 ॥
మరకతం –
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై ।
నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యః
నమోఽస్తు చంద్రార్కమరుద్గణేభ్యః ॥ 4 ॥
పుష్యరాగం –
ప్రియాన్న సంభవేద్దుఃఖం అప్రియాదధికం భయమ్ ।
తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనామ్ ॥ 5 ॥
హీరకం –
రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః ।
రూపదాక్షిణ్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే ॥ 6 ॥
ఇంద్రనీలం –
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః ।
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ।
దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః ।
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥ 7 ॥
గోమేధికం –
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః ।
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః ॥ 8 ॥
వైడూర్యం –
నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమమ్ ।
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్ ॥ 9 ॥
ఇతి శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రమ్ ।
సేకరణ... 💐🙏

Comments
Post a Comment