💥శివ పంచాక్షరీ స్తోత్రము... భావ సహితం:
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱
💥శివ పంచాక్షరీ స్తోత్రము... భావ సహితం:
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై "న" కారాయ నమః శివాయ
🌹భావం:
నాగేంద్రుని హారముగా ధరించిన వాడు, మూడు కన్నులు గలవాడు, పవిత్రమైన బూడిదని ఒళ్లంతా పూసుకొన్న వాడు, మహేశ్వరుడు, నిత్యుడు, శుద్ధ స్వరూపుడు, నలుదిక్కులను వస్త్రములుగా ధరించిన వాడు, పంచాక్షరీ మహామంత్రంలో 'న' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.
మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై "మ" కారాయ నమః శివాయ
🌹భావం:
మందాకిని నదీ జలాలతో పూజింపబడే వాడు, చందనంతో పూయబడిన మేని కలిగిన వాడు, నంది, సకల భూతప్రేతాలకు అధిపతి అయిన మహేశ్వరుడు,
మందారం మరియు అనేక ఇతర పుష్పాలతో పూజింపబడేవాడు, పంచాక్షరీ మహామంత్రంలో ' మ' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.
శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై "శి" కారాయ నమః శివాయ
🌹భావం:
మంగళ కరుడు, గౌరీ వదనారవిందాన్ని ఉదయింపజేసే సూర్యుడు, దక్షుని యజ్ఞం నాశనం చేసిన వాడు,
నీలకంఠుడు, వృషభధ్వజుడు, పంచాక్షరీ మహామంత్రంలో 'శి' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.
వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై "వ" కారాయ నమః శివాయ
🌹భావం:
వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు మొదలైన మునిశ్రేష్ఠులచే మరియు సకల దేవతలచే పూజింపబడే వాడు, విశ్వమంతటికీ కిరీటం వంటి వాడు (శేఖరుడు), సూర్య, చంద్ర, అగ్నులను మూడు కన్నులుగా కలిగినవాడు, పంచాక్షరీ మహామంత్రంలో ' వ' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.
యజ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై "య" కారాయ నమః శివాయ
🌹భావం:
యజ్ఞస్వరూపుడు, జటాధరుడు, త్రిశూలం ధరించిన వాడు, సనాతనుడు, తేజస్సు కలవాడు, నలుదిక్కులను వస్త్రములుగా ధరించిన వాడు, పంచాక్షరీ మహామంత్రంలో 'య' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.
పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే
🌹భావం:
ఈ పంచాక్షరీ స్తోత్రమును శివసన్నిధిలో జపించువారు,
శివలోక ప్రాప్తి కలిగి బ్రహ్మానందులై ఉందురు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment