⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏
⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం!
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం!
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం!
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం!!
మేలిమి గుణాలు, శోభ, కళ, సంపద, ఉత్సాహం, ఆనందం, శాంతం, సామరస్యం, సౌమనస్యం... ఈ శుభ గుణాలకు సాకారమే శ్రీ లక్ష్మి. ఈ శుభగుణాలే ప్రతివారు ఆశించేవి. అందుకే లక్ష్మీ ఆరాధన.
అమ్మవారు రసస్వరూపిణి. అందుకే రసమయుడైన చంద్రుని కళల వృద్ధిని అనుసరించి ఆమెను మనం ఆరాధించడం.
‘చన్ద్రాం చన్ద్ర సహోదరీం’ అని లక్ష్మీనామాలు. చంద్రుని తోబుట్టువని పురాణాల మాట. ఆహ్లాదం, ప్రసన్నత, ఆర్ద్రత, నిండుదనం,ప్రీతి... మొదలైనవి చంద్ర భావనలు. ఈ భావనల దేవత లక్ష్మి.
జగతిని పోషించే ఐశ్వర్యశక్తి, లక్షణ శక్తి లక్ష్మి. ఏ వస్తువు లక్షణం దానికి ఐశ్వర్యం. ప్రకృతిలో ప్రతి పదార్ధానికి ఉండవల్సిన లక్షణ సమృద్ధి, కళ లక్ష్మీ స్వరూపం.
‘సిద్దలక్ష్మిః మోక్షలక్ష్మీః జయలక్ష్మీః సరస్వతీ
శ్రీ ర్లక్ష్మీః వరలక్ష్మీశ్చ ప్రసన్నాదా మమ సర్వదా’
ఏ కార్యమైనా సిద్ధే ప్రయోజనం. అది లేనపుడు కార్యానికి ప్రయత్నమే ఉండదు. అందుకే ‘సిద్ధి’ అనేది మొదటి లక్ష్మి.
సిద్ధించిన కార్యభారం నుంచి విముక్తులవుతాం. ఆ ముక్తియే ‘మోక్షలక్ష్మి’.
ప్రతికూల పరిస్థితులను దాటడమే జయలక్ష్మి.
పనికి కావల్సిన తెలివితేటలు, సమయస్ఫూర్తి సరియైన నిర్ణయశక్తి, విజ్ఞానం... వంటివన్నీ విద్యాలక్ష్మి. అదే ‘సరస్వతి’
ఫలితంగా పొందే సంపద, ఆనందం శ్రీ లక్ష్మి.
దాని వలన కల్గిన శ్రేష్టత్వం, ఉన్నతి వరలక్ష్మి. చివరి గమ్యం ఇదే. అందుకే వరలక్ష్మీ వ్రతం అంటే మిగిలిన ఐదు లక్ష్ములను కూడా ఆరాధించి, ఆ అనుగ్రహాన్ని పొందటమే.
‘వర’ అంటే శ్రేష్టమైనది అని అర్ధం. ప్రతీవారు ప్రతిరంగంలో, ప్రత్యంశంలో శ్రేష్టతనే ఆశిస్తారు. ఆ శ్రేష్టతే దేవీ స్వరూపం.
శుద్ధ సత్వ స్వరూపంతో భాసించే జగజ్జనని శ్రీ లక్ష్మి. కొందరు అష్టలక్ష్ములుగా, కొందరు షోడశ లక్ష్ములుగా సంభావిస్తున్నా, ఆమె మాత్రం అనంతలక్ష్మి.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment