Posts

Showing posts from February, 2025

⚜️🕉️🚩ఓం సరస్వత్యై నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩ఓం సరస్వత్యై నమః🌹🙏 💥సరస్వతీదేవి ఉపాసకుడైన శ్రీనాథుడు ఆ దేవి రూపాన్ని ఈ క్రిందివిధంగా వర్ణించాడు. సింహాసనము చారుసిత పుండరీకంబు చెలికత్తె చెలువారు పలుకు జిలక శృంగార కుసుమంబు చిన్ని చుక్కలరాజు పసిడి కిన్నెరావీణె పలుకుదోడు నలువ నెమ్మోము దమ్ములు కేళీగృహములు తళుకుటద్దంబు సత్కవుల మనసు వేదాది విద్యలు విహరణ స్థలములు చక్కని రాయంచ యెక్కిరింత యెపుడు నే దేవికాదేవి యిందుకుండ చంద్రచందన మందార సారవర్ణ శారదాదేవి మామకస్వంత వీధి నిండు వేడుక విహరించు చుండుగాత 🌹ఆ తల్లి కూర్చున్న సింహాసనం అందమయిన తెల్లని పద్మం. ఆమెకు చెలికత్తె చక్కటి పలుకులు పలికే హిలుక. అమ్మ అలంకరించుకున్న పువ్వు బాలచంద్రుడు. అమ్మ పాటలకు తోడుగా బంగారు కిన్నెరా వీణ మ్రోగుతుంటుంది. బ్రహ్మదేవుని ముఖపద్మాలే అమ్మవారు ఆడుకునే కేళీగృహాలు. సత్కవుల మనసే అమ్మవారి ప్రతిబింబం కనబడే తళుకుటద్దం. వేదాది సకల విద్యలు అమ్మవారి నివాసాలు. చక్కని రాజహంస ఆ తల్లి వాహనం. సితపుండరీకం, చిలుక, చుక్కలరాజు చంద్రుడు, పసిడి కిన్నెరా వీణ, బ్రహ్మ ముఖాలు, సత్కవుల మనస్సు, వేదాది విద్యలు, రాయంచ...ఇవన్నీ అమ్మను సేవిస్తున్నాయి. ఆ దేవి తెల్లని రంగు గల వస్తువులతో,...

💥శ్రీవిష్ణువుకు ప్రీతికరం.. ఫాల్గుణమాసం

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 💥శ్రీవిష్ణువుకు ప్రీతికరం.. ఫాల్గుణమాసం. ఫాల్గుణ మాసం విశిష్టత: ఉత్తరఫల్గుణి నక్షత్రం పౌర్ణమి నాటి చంద్రునితో కలిసి ఉన్నందువల్ల ఈ మాసానికి "ఫాల్గుణమాసం" అని పేరు వచ్చింది. ఉత్తరఫల్గుణి బుద్ది వికాసాన్ని, దైర్య స్థైర్యాలను నూతనోత్తేజాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నదని శాస్త్ర వచనం.  వాతావరణ ప్రభావంతో ఆకులన్నీ రాలి పోయి చెట్లు మోడుబారి పోయే కాలమిది. కొత్త అవకాశాలకి ప్రతీకగా చిగుళ్ళ రూపంలో ఆశలను ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుందీ మాసం. శుక్ల పాడ్యమి మొదలు ద్వాదశి వరకు పన్నెండు రోజులూ భగవంతునికి పాలు మాత్రమే నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలని చెబుతారు. ఈ మాసంలో గోదానం, ధాన్య దానం, వస్త్రదానం చేస్తే పుణ్యప్రదమని ధర్మ శాస్త్రాలు వివరిస్తున్నాయి. శుక్లపక్ష ఏకాదశి దీనినే "#ఆమలకఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజున ఉసిరి చెట్టును పూజించాలని, ఉసిరి ఫలాలను దానం చేయాలని, వాటిని తినాలని పురాణ కథనం. ఉసిరికి ఎన్నో ఔషద గుణాలున్నాయి, రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. అనేక వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది. ద్వాదశి - దీనినే "#గోవిందద్వాదశి" అని కూడా అ...

⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏 దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తి హరంవందే స్మర్తృగామీ సనోవతు॥ 'అక్షరాత్‌, వరేణ్యాత్‌, ధూత సంసార బంధనాత్‌ తత్వ మస్యాది లక్ష్యత్వాత్‌, అవధూత ఇతీర్యతే’ ఆశా పాశాల నుంచి విముక్తి పొందిన వాడు, పూర్వకర్మల నుంచి విడివడిన వాడు, ధూళితో కూడిన శరీరం వాడు (దేహం పట్ల అభిమానం లేనివాడు), తత్వ చింతన కలవాడు అవధూత అంటుంది దత్తావధూతగీత. దీన్నే అవధూత ఉపనిషత్తు ఇంకాస్త విశదంగా చెప్తూ అవధూత అంటే అక్షరుడు (నాశనం లేనివాడు), వరేణ్యుడు (ఉత్తముడు), ధూతబంధనుడు (సంసార బంధనాలేవీ లేనివాడు) వేదాంత గోచరమైన తత్వమస్యాది వాక్యాలకు లక్ష్యమైన వాడని చెబుతుంది. ఈ లక్షణాలన్నీ కలిగి బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుల అంశతో త్రిమూర్తి స్వరూపంగా అవతరించిన పరబ్రహ్మ స్వరూపమే దత్తావతారం. లోకంలో మహర్షులందరూ అవధూతలు కారు. వ్యాసుడు మహర్షి. ఆయన కొడుకు శుకమహర్షి అవధూత. శుకమహర్షి తండ్రిని విడిచి వెడుతూంటే పుత్రప్రేమతో వ్యాసుడు ఆయన్ను పిలుస్తూ వెనకాలే వెంబడిస్తున్నాడట. అక్కడ ఒక సరస్సులో స్నానం చేస్తున్న దేవతా స్త్రీలు శుక మహర్షిని పట్టించుకోలేదు. కానీ, వయోవృద్ధుడైన వ్యాసమహర్షి వస్తూంటే మాత్రం సిగ...

💥బిల్వాష్టకం.. తాత్పర్య సహితం.

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ🌹🙏 🔱హర హర మహాదేవ శంభో శంకర 🔱 💥బిల్వాష్టకం.. తాత్పర్య సహితం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం ☘️తాత్పర్యము: మూడు దళాలు కలిగిన, మూడు గుణాలకు ప్రతీకగా, మూడు కన్నులవలె, మూడు ఆయుధాలుగా, మూడు జన్మాల పాపాన్ని నాశనం చేసే ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం ☘️తాత్పర్యము: మూడు శాఖలు కలిగి, రంధ్రములు లేని, కోమలంగా, శుభము కలిగించే బిల్వపత్రంతో శివునికి పూజ చేస్తున్నాను. అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం ☘️తాత్పర్యము: ఛిద్రం కాని ఒక్క పత్రాన్ని నందికి సమర్పిస్తే సర్వ పాపాలను కడిగి వేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. సాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్ సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం ☘️తాత్పర్యము: సాలగ్రామాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తే, సోమ యాగం చేస్తే వచ్చే ఫలాన్ని ఇచ్చే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ కోటికన్యా...

💥మహాశివరాత్రి

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥మహాశివరాత్రి "మహాశివరాత్రి" పండుగను జరుపుకోవడంలో మూడు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి, స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది #శివార్చన. #ఉపవాసం ఎలా? శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష పాధాన్యం ఉంది. శివరాత్రి నాడు అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతుంది. చిన్నపిల్లలకు, ముసలి వాళ్ళకు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు గర్భవతులకు, మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా, శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్థం ...

💥మహాశివరాత్రి💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥మహాశివరాత్రి💥 ప్రతిమాసంలోనూ బహుళ పక్షం వచ్చే చతుర్ధశికి మాస శివరాత్రి అని పేరు. అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తాయి. వాటన్నింటిలోనూ తలమానికమైనది, మహి మాన్వితమైనది మాఘమాసములో కృష్ణ పక్ష చతుర్ధశి.. మహాశివరాత్రి. తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందురోజు – రాత్రి చతుర్దశి కలిగి ఉన్న రోజుని జరుపుకోవాలని నిర్ణయ సింధు చెబుతోంది. శివరాత్రి అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన రాత్రి అని అర్థం. క్షీరసాగర మథనంలో అమృతం కంటే ముందు హాలాహలం పుట్టిన విషయం తెలిసిందే. అది ముల్లోకాలను దహించివేస్తుందన్న ప్రమాదం ఉండడంతో దేవదానవులందరు భీతావహులై తమను రక్షించాలంటూ పరమేశ్వరుణ్ణి వేడుకోవడంతో లోక రక్షణార్థం ఆ గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి "గరళ కంఠుడు"గా పేరుపొందాడు. 💥#పురాణగాథ: పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము ‘నేను గొప్ప అంటే నేను గొప్ప ’ అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్తా వివాదంగా మారింది. రానురానూ అది మరింతగా పెరిగి భయంకరమైన యుద్ధానికి దారితీసింది. అరివీర భయంకరమైన ఆ యుద్ధానికి త్రిలోకాలూ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్...

పరమాత్మ తత్వాన్ని మేల్కొలపడమే “మ‌హా శివరాత్రి” విశేషం.

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥పరమాత్మ తత్వాన్ని మేల్కొలపడమే “మ‌హా శివరాత్రి” విశేషం. మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం న కర్ణం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు: చిదానంద రూపశ్శివోహం శివోహం... అంటూ ఆదిశంక‌రాచార్యులు నిర్వాణ‌ష‌ట్కంలో వ‌ర్ణించారు. దీన‌ర్థం ఏంటంటే నేను మనసునూ కాను, బుద్దినీ కాను, అహంకారమునూ కాను, చిత్తమునూ కాను, నేను చెవుల‌నూ కాను, నేను జిహ్వనూ కాను, నేను ఘ్రాణ ఇంద్రియము ఐన నాసికనూ కాను, నేను చక్షురింద్రియము ఐన నేత్రములనూ కాను. నేను ఆకాశమునూ కాను, నేను భూమినీ కాను. నేను తేజస్సునూ కాను, నేను వాయువునూ కాను, చిదానంద రూపుడైన‌టువంటు శివుడ‌ను నేను అని భావం. పరమ మంగళకరమైనది శివ స్వరూపం. అతన్ని నిరాకారంగానూ, సాకారంగానూ రెండు రకాలుగా ఆరాధిస్తాం. సగుణోపాసన నుండి నిర్గుణోపాసన వైపు మరల్చడమే శివతత్వం. దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ ఒక్కసారి కనుక అవగతమైతే గొప్ప యోగి అవుతాడనడంలో సందేహమేమీ లేదు. శివుడి సాకార రూపానికి ప్రతిరూపం శివలింగం. ఆ లింగం ఉద్భవించిన రోజే మహాశివరాత్రి. అసలైతే ప్రతి నెల కృష్ణ చతుర్దశిని ‘మాస శివరాత్రి’ గా శివుడిని ధ్యానిస్తూ జరుపుకుంటాం. ...

⚜️🕉️🚩శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌹🙏

Image
 ⚜️🕉️🚩శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌹🙏 శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం! సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం! ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం! రామం నిశాచర వినాశకరం నమామి!! 💥అయనము అంటే నడక అని అర్థం. రామాయణము అంటే రాముని యొక్క నడక అని అర్థం. మీరు చూడండి శ్రీ మహవిష్ణువు యొక్క దశావతారములలో ఒక్క రామావతారములో తప్ప ఇక ఏ అవతారము గూర్చి ప్రస్తావించినా పెద్దలు అయనము అన్న మాట వేయ లేదు, ఎందుకు ? రామావతారంలొ స్వామి పరిపూర్ణముగా మానవుడే, అందుకే ఎక్కడా రాముడు తాను దేవుడినని కాని, దైవత్వమును ప్రకటించడము కాని చేయడు. ఆయన ఆ అవతారంలో మానవునిగానే జీవించాడు. అంతా బాగుందండీ కాని మరి “రామస్య ఆయనం రామాయణం” కదా మరి రాముని కదలికకి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? అంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం. మరొ అడుగు వేస్తే అది సత్యం. ఆయన నడక ఆయన కదలిక అంతా సత్య - ధర్మములే. అందుకే కదండీ “రామో విగ్రహవాన్ ధర్మః ” అన్నారు. అందుకే పెద్దలు తరచు ఒక విషయం చెప్తారు. రామాయణాన్ని నరుడి కథగా చదవండి అని, ఎందుకంటే రామాయణాన్ని నరుడి కథగా మనం చదివినప్పుడు రాముని నడవడిని చూసినప్పుడు ఒక నరుడు సత్యాన్ని ధర్మాన్ని పట్టుకొని ఇలా జీవించ గలడ...

💥సూర్యాష్టకం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః 🌹🙏 ఉదయగిరి ముపేతం భాస్కరం పద్మహస్తాం || సకల భువన నేత్రం నూ త్నరత్నోపధేయం తిమిరకరి మృగేంద్రం బోధకం పద్మినీ నాం సురవరమభి వంద్యం, సుందరం, విశ్వరూపం || సూర్య నమస్కారాల వల్ల జ్ఞానం, సద్గుణం, వర్చస్సు, బలం, ధనం, సంతానం, పాపనాశనం, సకల రోగ నివారణ, ఆయుర్వుద్ధి కలుగుతాయని ఋగ్వేద వచనం. ఆదివారాలలో సూర్య నమస్కారాలు చేసి పాలను నివేదిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. 💥సూర్యాష్టకం💥 ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం మహా ...

ఓం నమో భగవతే వాసుదేవాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🌹🙏 💥కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న అతని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు. ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు. "అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు" అని నిలదీస్తాడు… అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు… "ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు, ఇది ఇలా జరగడానికి, నీకు పుత్రశోకం కలగడానికీ అన్నిటికీ కారణం నువ్వూ, నీ కర్మ.  యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతకుడివి (వేటగాడు).. ఒకరోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోకవృక్షం మీద రెండు గువ్వల జంట వాట...

💥శ్రీమన్నారాయణుని చరణారవిందాల ఘనతను వర్ణించిన అన్నమయ్య కీర్తనను గురించి తెలుసుకుందాం..

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 💥శ్రీమన్నారాయణుని చరణారవిందాల ఘనతను వర్ణించిన అన్నమయ్య కీర్తనను గురించి తెలుసుకుందాం.. ఈ పాదమే కదా యిల యెల్లఁ గొలిచినది - అన్నమయ్య #పల్లవి: ఈ పాదమే కదా యిల యెల్లఁ గొలిచినది యీ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది #చరణములు: ఈ పాదమే కదా యిందఱును మ్రొక్కెడిది యీ పాదమే కదా యీ గగనగంగ పుట్టినది యీ పాదమే కదా యెలమిఁ బెంపొందినది యీ పాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది ఈ పాదమే కదా యిభరాజు దలఁచినది యీ పాదమే కదా యింద్రాదు లెల్ల వెదకినది యీ పాదమే కదా యీ బ్రహ్మ గడిగినది యీ పాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది యీ పాదమే కదా యిల నహల్యకుఁ గోరికైనది యీ పాదమే కదా యీక్షింప దుర్లభము యీ పాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది 💥కీర్తన భావ సౌరభం: ఈ పాదమే కదా వామనావతారంలో భూమండలమంతా కొలిచింది! ఈ పాదం నుండే గంగ పుట్టి విష్ణు పాదోద్భవ అయింది. ఆ గంగను బ్రహ్మ తన కమండలంలో పట్టుకున్నాడట.  వామనావతారంలో శ్రీ హరి తన రెండవ అడుగుగా ఆకాశాన్ని కొలిచినప్పుడు బ్రహ్మ తన దగ్గరున్న గంగతో ఆయన పాదం కడగడం వలన బ్రహ్మకడిగిన పాదమైంది. ఈ పాదం అనంతమైనది. ఇంద్రాది దేవతలకు ఆ అడుగే ఇ...

💥చతుర్వింశతి గాయత్రీ

Image
 ⚜️🕉️🚩 ఓం నమో గాయత్రీ మాత్రే🌹🙏 💥గాయత్రీ మంత్రం: ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ || --- ఇదే గాయత్రీ మూల మంత్రం. 💥చతుర్వింశతి గాయత్రీ గాయత్రీ మంత్రంలో యిరువది నాలుగు అక్షరములతో పాటు యిరువది నాలుగు దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా నుండును. ఈ యిరువది నాలుగు గాయత్రీ మూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అనిపేరు. 🌹శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు!! 01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు. 02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే. 03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్టాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు. 04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు. 05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్టాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్టలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు. 06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్టాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావా...

⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం! దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం! శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం! త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం!! మేలిమి గుణాలు, శోభ, కళ, సంపద, ఉత్సాహం, ఆనందం, శాంతం, సామరస్యం, సౌమనస్యం... ఈ శుభ గుణాలకు సాకారమే శ్రీ లక్ష్మి. ఈ శుభగుణాలే ప్రతివారు ఆశించేవి. అందుకే లక్ష్మీ ఆరాధన. అమ్మవారు రసస్వరూపిణి. అందుకే రసమయుడైన చంద్రుని కళల వృద్ధిని అనుసరించి ఆమెను మనం ఆరాధించడం. ‘చన్ద్రాం చన్ద్ర సహోదరీం’ అని లక్ష్మీనామాలు. చంద్రుని తోబుట్టువని పురాణాల మాట. ఆహ్లాదం, ప్రసన్నత, ఆర్ద్రత, నిండుదనం,ప్రీతి... మొదలైనవి చంద్ర భావనలు. ఈ భావనల దేవత లక్ష్మి. జగతిని పోషించే ఐశ్వర్యశక్తి, లక్షణ శక్తి లక్ష్మి. ఏ వస్తువు లక్షణం దానికి ఐశ్వర్యం. ప్రకృతిలో ప్రతి పదార్ధానికి ఉండవల్సిన లక్షణ సమృద్ధి, కళ లక్ష్మీ స్వరూపం. ‘సిద్దలక్ష్మిః మోక్షలక్ష్మీః జయలక్ష్మీః సరస్వతీ శ్రీ ర్లక్ష్మీః వరలక్ష్మీశ్చ ప్రసన్నాదా మమ సర్వదా’ ఏ కార్యమైనా సిద్ధే ప్రయోజనం. అది లేనపుడు కార్యానికి ప్రయత్నమే ఉ...

⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః🌹🙏 శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది.  సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింప జేయుటయే దత్తమూర్తి అవతారము. దత్తాత్రేయుడు వేదజ్ఞానము నధిగమించిన జ్ఞానసాగరుడు. దత్తాత్రేయుడు అత్రి మహర్షి, అనసూయాదేవి కుమారుడు. అత్రి మహర్షి పుత్ర సంతానము కొరకై ఘోర తపస్సు చేసి దివ్యశక్తులు కలిగిన కుమారుడు కావాలని త్రిమూర్తులను కోరుకున్నాడు. తన తపస్సు ఫలితంగా బ్రహ్మ అంశమున చంద్రుడు, విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసుడు జన్మించారు.  కాలాంతరమున జన్మించిన ఆ ముగ్గురే శ్రీదత్తుడు అను నామముతో ప్రసిద్ధి చెందిరి. చంద్రుడు, దుర్వాసుడు తమ యొక్క శక్తులను దత్తునికి ధారపోశారు. దత్తుడు అనగా తనంత తానుగా ఎదుటి వ్యక్తికి ఇష్టముతో పెంచుకొనుటకై వెళ్లినవాడు అని అర్థం. శ్రీహరి తన జన్మస్థలమైన వైకుంఠ పట్టణమును విడిచి, అత్రికి పుత్రుడైన కారణముగా ఈయన ఆత్రేయుడైనాడు. ‘దత్తుడు + ఆత్రేయుడు ‘దత్తాత్రేయుడు’ అని మనం వ్యవహరించుచున్నాము. ఆధిభౌతికమ...

💥శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రమ్💥

Image
 ⚜️🕉️🚩ఓం విఘ్నరాజాయ నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥జై గణేశ జై జై గణేశా!!!💥 💥ఏ పూజ అయినా, ఏ కార్యక్రమము అయినా తొలుత  ఆచరించేది శ్రీ వినాయక పూజ. ఆ గణనాధుడికి  పూజ చేసి ప్రారంభము చేస్తే ఎటువంటి విఘ్నాలు  లేకుండా విజయము లభిస్తుంది అని నమ్మకం. విద్యారంభములోను , గృహ ప్రవేశము నందు, వివాహము నందు విఘ్నేశ్వర పూజ చేస్తే విఘ్నాలు లేకుండా ఉంటాయి. స్వామి భక్తులకు నీలాపనిందలు, విఘ్నాలు తొలగించి విజయాన్ని ప్రసాదిస్తారు. వినాయకుడు కూడా  పదహారు గుణాలు కలిగిన స్వామి కనుక ఆ స్వామిని  షోడశ నామాల  స్తోత్రముతో  పూజ ప్రారంభిస్తారు. 💥శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రమ్💥 సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః | లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || 1 || ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః | వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః || 2 || షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి | విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా | సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే || 3 || 💥శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిః - వివరణ💥 🌹ఓం సుముఖాయ నమః: వినాయకుడు నర ముఖముతోనే  జన్మించారు. కానీ గజాసుర...

💥శ్రీసుబ్రహ్మణ్య క్షమాపణ సోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 💥శ్రీసుబ్రహ్మణ్య క్షమాపణ సోత్రం💥 నమస్తే నమస్తే గుహా తారకారే నమస్తే నమస్తే గుహా శక్తిపాణే నమస్తే నమస్తే గుహా దివ్యమూర్తే క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ || 1 || నమస్తే నమస్తే గుహా దానవారే నమస్తే నమస్తే గుహా చారుమూర్తే నమస్తే నమస్తే గుహా పుణ్యమూర్తే క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ || 2 || నమస్తే నమస్తే మహేశాత్మపుత్ర నమస్తే నమస్తే మయూరాసనస్థ నమస్తే నమస్తే సరోర్భూత దేవ క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ || 3 || నమస్తే నమస్తే స్వయం జ్యోతిరూప నమస్తే నమస్తే పరం జ్యోతిరూప నమస్తే నమస్తే జగం జ్యోతిరూప క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ || 4 || నమస్తే నమస్తే గుహా మంజుగాత్ర నమస్తే నమస్తే గుహా సచ్చరిత్ర నమస్తే నమస్తే గుహా భక్తమిత్ర క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ || 5 || నమస్తే నమస్తే గుహా లోకపాల నమస్తే నమస్తే గుహా ధర్మపాల నమస్తే నమస్తే గుహా సత్యపాల క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ || 6 || నమస్తే నమస్తే గుహా లోకదీప నమస్తే నమస్తే గుహా బోధరూప నమస్తే నమస్తే గుహా గానలోల క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ || 7 || నమస్తే నమస్తే మహా దేవసూనో నమస్తే నమస్తే మహా మోహహారి...

💥నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం..

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 💥నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం.. శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం వస్తుందని "పరాశర సంహిత"లో ఉంది. నవగ్రహాల అనుగ్రహం త్వరగా పొందాలంటే వాల్మీకి రామాయణం లోని ఈ 9 శ్లోకాలు నిత్యం పారాయణ చేయడం మంచిది. నవగ్రహాలు అత్యంత కరుణా స్వరూపులు. మనం పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపాల బట్టి ఫలితాలని ఇస్తారు.  కానీ భక్తితో వారిని ఇటువంటి స్తోత్రాలతో స్తుతిస్తే శుభఫలితాల్ని అనుగ్రహిస్తారు.  శ్రీ ఆంజనేయ నవరత్నమాలా శ్లోకాల పారాయణం వల్ల విద్యార్థులకు మేధస్సు, ఉద్యోగస్తులు, వ్యాపారులకు అభివృద్ధి, స్త్రీలకు వివాహం, సత్సంతానము మరియు వృద్దులకు ఆరోగ్యం కలుగుతుంది. నిత్యం లేదా శనివారం అయినా వీటిని పారాయణ చేయడం వలన శుభఫలితాలని పొందవచ్చు. వాల్మీకి రామాయణమునకు సుందరకాండ తలమానికము. సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం.  రత్నముల వంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామి వారికి సమర్పించబడినది. ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది.  ఇవి శ్...

💥అర్థనారీశ్వర_స్తోత్రమ్💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱 💥అర్థనారీశ్వర_స్తోత్రమ్💥 చాంపేయ గౌరార్థ శరీరకాయై- కర్పూర గౌరార్థ శరీరకాయ ధమిల్ల కాయైచ జటాధరాయ- నమశ్శివాయై చ నమశ్శివాయ కస్తూరికా కుంకుమ చర్చితాయై-చితారజః పుంజ విచర్చితాయ కృత స్మరాయై వికృత స్మరాయ-నమశ్శివాయై చ నమశ్శివాయ ఝణత్క్వణత్కంకణ నూపురాయై-పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ-నమశ్శివాయై చ నమశ్శివాయ విశాల నీలోత్పల లోచనాయై-వికాసి పంకేరుహ లోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ-నమశ్శివాయై చ నమశ్శివాయ మందార మాలా కవితాలకాయై-కపాల మాలాంకిత కంథరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయై-నమశ్శివాయై చ నమశ్శివాయ అంభోధర శ్యామల కుంతలాయై-తటిత్రభా తామ్ర జటధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ-నమశ్శివాయై చ నమశ్శివాయ   ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై-సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే-నమశ్శివాయై చ నమశ్శివాయ ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై-స్ఫురన్మహా పన్నగ భూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ-నమశ్శివాయై చ నమశ్శివాయ ఏతత్పఠే దష్టక నిష్టదం యో-భక్త్వా స మాన్యోభువి దీర్ఘ జీవీ ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం-భూయాత్సదా చాన్య సమస్త సిద్ధిః ఇతి శ్రీ మచ్చంకరాచార్య విరచ...

💥శివ పంచాక్షరీ స్తోత్రము... భావ సహితం:

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱 💥శివ పంచాక్షరీ స్తోత్రము... భావ సహితం: నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై "న" కారాయ నమః శివాయ 🌹భావం: నాగేంద్రుని హారముగా ధరించిన వాడు, మూడు కన్నులు గలవాడు, పవిత్రమైన బూడిదని ఒళ్లంతా పూసుకొన్న వాడు, మహేశ్వరుడు, నిత్యుడు, శుద్ధ స్వరూపుడు, నలుదిక్కులను వస్త్రములుగా ధరించిన వాడు, పంచాక్షరీ మహామంత్రంలో 'న' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై "మ" కారాయ నమః శివాయ 🌹భావం: మందాకిని నదీ జలాలతో పూజింపబడే వాడు, చందనంతో పూయబడిన మేని కలిగిన వాడు, నంది, సకల భూతప్రేతాలకు అధిపతి అయిన మహేశ్వరుడు, మందారం మరియు అనేక ఇతర పుష్పాలతో పూజింపబడేవాడు, పంచాక్షరీ మహామంత్రంలో ' మ' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము. శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై "శి" కారాయ నమః శివాయ 🌹భావం: మంగళ కరుడు, గౌరీ వదనారవిందాన్ని ఉదయింపజేసే సూర్యుడ...

💥శ్రీ భాస్కర స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం భాస్కరాయ నమః🙏 💥శ్రీ భాస్కర స్తోత్రం💥  హంసాయ భువనధ్వాంతధ్వంసాయాఽమితతేజసే | హంసవాహనరూపాయ భాస్కరాయ నమో నమః || ౧ || వేదాంగాయ పతంగాయ విహంగారూఢగామినే | హరిద్వర్ణతురంగాయ భాస్కరాయ నమో నమః || ౨ || భువనత్రయదీప్తాయ భుక్తిముక్తిప్రదాయ చ | భక్తదారిద్ర్యనాశాయ భాస్కరాయ నమో నమః || ౩ || లోకాలోకప్రకాశాయ సర్వలోకైకచక్షుషే | లోకోత్తరచరిత్రాయ భాస్కరాయ నమో నమః || ౪ || సప్తలోకప్రకాశాయ సప్తసప్తిరథాయ చ | సప్తద్వీపప్రకాశాయ భాస్కరాయ నమో నమః || ౫ || మార్తాండాయ ద్యుమణయే భానవే చిత్రభానవే | ప్రభాకరాయ మిత్రాయ భాస్కరాయ నమో నమః || ౬ || నమస్తే కమలానాథ నమస్తే కమలప్రియ | నమః కమలహస్తాయ భాస్కరాయ నమో నమః || ౭ || నమస్తే బ్రహ్మరూపాయ నమస్తే విష్ణురూపిణే | నమస్తే రుద్రరూపాయ భాస్కరాయ నమో నమః || ౮ || సత్యజ్ఞానస్వరూపాయ సహస్రకిరణాయ చ | గీర్వాణభీతినాశాయ భాస్కరాయ నమో నమః || ౯ || సర్వదుఃఖోపశాంతాయ సర్వపాపహరాయ చ | సర్వవ్యాధివినాశాయ భాస్కరాయ నమో నమః || ౧౦ || సహస్రపుత్రనేత్రాయ సహస్రాక్షస్తుతాయ చ | సహస్రనామధేయాయ భాస్కరాయ నమో నమః || ౧౧ || నిత్యాయ నిరవద్యాయ నిర్మలజ్ఞానమూర్తయే | నిగమార్థప్రకాశాయ భాస్కరాయ నమో నమః || ౧౨ ||...

💥అష్టాదశపురాణాలు💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥అష్టాదశపురాణాలు💥 అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. వీటిని వ్యాసభగవానుడు మనకు అందించాడు. ఈ 18 గుర్తుపెట్టుకోవడం కష్టమైతే, ఈ క్రింది శ్లోకం నేర్చుకుంటే గుర్తుపెట్టుకోవడం చాలా సులభం. శ్లో! ! మద్వయం భద్వయం చైవ, బ్రత్రయం వచతుష్టయం ! అనాపలింగ కూస్కానీ, పురాణాని ప్రచక్షత !! మద్వయం: మ కారంతో ప్రారంభమయ్యేవి 2. అవి మత్స్య పురాణం. మార్కండేయ పురాణం. భద్వయం: భ కారంతో ప్రారంభమయ్యేవి 2. అవి భాగవత పురాణం. భవిష్యత్ పురాణం. బ్రత్రయం: బ్ర కారంతో ప్రారంభమయ్యేవి 3. అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం. వచుతష్టయం: వకారంతో ప్రారంభమయ్యేవి 4. అవి వాయుపురాణం, వరహా పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం. అ కారంతో అగ్ని పురాణం, నా కారంతో నారద పురాణం, ప కారంతో పద్మ పురాణం, లి కారంతో లింగ పురాణం, గ కారంతో గరుడ పురాణం, కూ కారంతో కూర్మ పురాణం మరియు స్క కారంతో స్కంద పురాణం రచించిరి. 1) మత్స్య పురాణం: దీనీలో 14000 శ్లోకములన్నవి. మత్స్యావతార మెత్తిన విష్ణువుచే మనువుకు బోధింపబడినది. కార్తికేయ, మయాతి, సావిత్రుల చరిత్రలు. ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత...

ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 💥లక్ష్మీ తత్వం: అందరూ సిరిసంపదలు కోరుతూంటారు. అవి కోరగానే వచ్చేవి కావు. అవి వరింపదగిన వారినే వరించి వస్తాయి. అంటే వాటికై మనం కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. లక్ష్మీ అంటే ధనం ఒక్కటే కాదు, 8 విధాలైన కోరికలను లక్ష్ములుగానే వ్యవహరిస్తున్నాం. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గృహలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, మోక్షలక్ష్మి. 💥లక్ష్మీదేవి ఎక్కడ ఉండదంటే: "యత్ర నాస్తి హరేఃపూజా, తదీయ గుణకీర్తనం నోత్యుకశ్య ప్రశంసాయం నయామి తస్యమందిరం" శ్రీహరి యొక్క పూజ, కీర్తన, ఉత్సుకత లేని వారి ఇంట నేను ప్రవేశించను అని లక్ష్మిదేవియే స్వయముగా చెప్పినది. మిట్టమధ్యాహ్నం దాక నిద్ర పోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచకపోవడం. గురువులను, తల్లితండ్రులను దూషించడం, దూషణలు చేసేవారి ఇంట లక్ష్మీదేవి ఉండదు. "సిరి తా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి తా పోయిన పోవును కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ" సంపద కలుగునపుడు కొబ్బరి కాయలోనికి నీరువచ్చు విధముగానే రమ్యముగా కలుగును. సంపద పోవునపుడు ఏనుగు మ్రింగిన వెలగపండులోని గుంజు మాయమగు విధముననే...

💥దక్షిణామూర్తి చతుర్వింశతి వర్ణమాలా స్తోత్రమ్:

Image
 ⚜️🕉️🚩 ఓం నమో భగవతే దక్షిణామూర్తయే 🙏 దక్షిణామూర్తి నామాన్ని నిత్యం మననం చేసుకుంటే అదే మంత్రం అవుతుంది. ఆ మంత్ర శక్తిని అందరికీ అందజేయడానికి శంకరులు ఆ మంత్రంలోని ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకాన్ని రచించారు. మొత్తం 24 అక్షరములతో 24 శ్లోకములు అందించారు.  ఈ స్తోత్రము నందలి ప్రతి శ్లోకంలోని మొదటి అక్షరము వరుసగా చేర్చినచో "ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రయచ్చ స్వాహా" అను దక్షిణామూర్తి మహామంత్రమగును. 💥దక్షిణామూర్తి చతుర్వింశతి వర్ణమాలా స్తోత్రమ్: ఓమిత్యేతద్యస్య బుధైర్నామ గృహీతం యద్భాసేదం భాతి సమస్తం వియదాది యస్యాజ్ఞాతః స్వస్వపదస్థా విధిముఖ్యాస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి (1) నమ్రాంగాణాం భక్తిమతాం యః పురుషార్థాన్దత్వా క్షిప్రం హంతి చ తత్సర్వవిపత్తీః పాదాంభోజాధస్తనితాపస్మృతిమీశం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి (2) మోహధ్వస్త్యై వైణికవైయాసికిముఖ్యాః సంవిన్ముద్రాపుస్తకవీణాక్షగుణాన్యమ్ హస్తాంభోజైర్బిభ్రతమారాధితవంతస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి (3) భద్రారూఢం భద్రదమారాధయితృణాం భక్తిశ్రద్ధాపూర్వకమీశం ప్రణమంతి ఆదిత్యా యం వాంఛితసిద్ధ్యై కరుణాబ్ధిం తం ప్రత్యంచం దక...

💥మహామాఘి - మాఘ పౌర్ణమి.

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 💥మహామాఘి - మాఘ పౌర్ణమి. చంద్రుడు మఖ నక్షత్రంలో ఉండే మాసం కాబట్టి దీనిని మాఘమాసం అంటారు. 'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు శ్రేష్ఠమైన మాసంగా దీనిని భావిస్తారు. మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కాబట్టి ఇది మాఘమాసమైంది. ఇక మాఘమాసంలో స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. దీన్ని పవిత్రస్నానంగా భావించి, పాప పరిహారం కోసం నదీస్నానాలు చేయడం మాఘ సంప్రదాయం.  మాఘస్నానాలు సకల కల్మషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణం తెలిపింది. మృకండు మహర్షి- మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలం వల్లే వారి కుమారుడైన మార్కండేయుడు మృత్యువును జయించాడని పురాణ కథనం. మాఘమాసంలో సూర్యుడు స్థానం ప్రకారం ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుకుంటాయి. ఈ సమయంలో సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేస్తే మరింత శ్రేష్ఠమని ఆధునిక శాస్త్రవేత్తలు సైతం పేర్కొంటున్నారు. మాఘ స్నానాలకు అధిష...

💥హనుమ లాంగూల స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏 జయ హనుమంత జ్ణానగుణవందిత జయపండిత త్రిలోక పూజిత!! ఎంతటి కష్టాన్ని అయినా పోగొట్టే "హనుమాన్ లాంగూల స్తోత్రమ్" 💥హనుమ లాంగూల స్తోత్రం💥 శ్రీమంతం హనుమంత మాత్త రిపుభి ర్భూభృత్తరు భ్రాజితం| చాల్ప ద్వాలధిబధ్ధ వైరినిచయం చామీకరాది ప్రభం| రోషా ద్రక్త పిశంగ నేత్ర నలినం భ్రూభంగ మంగస్ఫుర| త్ర్పోద్య చ్చండమయూఖ మాండల ముఖం దుఃఖాపహం దుంఖినాం|| కౌపీనం కటిసూత్ర మౌంజ్యజినయు గ్దేహం విదేహాత్మాజా| ప్రాణాధీశ పదారవింద నిహిత స్వాం తం కృతాంతం ద్విషాం| ధ్యాత్వైవం సమరాంగణ స్థిత మథానీయ స్వహృత్పంకజే| సంపూజ్యాఖిల పూజనోక్తవిధినా సంప్రార్ధయే త్ర్పార్ధితమ్|| హనుమన్నంజనీసూనో మహాబలపరాక్రమ | లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || మర్కటాధిప మార్తండమండలగ్రాసకారక | లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర | లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || రుద్రావతార సంసారదుఃఖభారాపహారక | లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || శ్రీరామచరణాంభోజమధుపాయితమానస | లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || వాలిప్రమథక్లాంతసుగ్రీవోన్మోచనప్రభో | లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || సీతావిరహవారాశిభగ్న సీ...

ఓం అరుణాచలేశ్వరాయ నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం అరుణాచలేశ్వరాయ నమః🌹🙏 శ్లో: "దర్శనాత్ అబ్రసదసి జననాత్ కమలాలయే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః" ‘స్వామీ ఇన్ని జన్మలెత్తలేకపోతున్నాం. అందునా వచ్చేది కలియుగం. చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం. మాయకు లోబడిపోతాం. తప్పు పనులు చేస్తాం. మళ్లీ పునర్జన్మలొస్తాయి. మరి అలా రాకుండా ఉండాలంటే మాకొక తేలికమార్గం ఏదైనా ఉపదేశం చెయ్యి’ అంటూ ఒకానొకప్పుడు మానవులు వేడుకోగా.. సాక్షాత్తూ పరమేశ్వరుడు చేసిన ఉపదేశం ఇది.  దీని ప్రకారం.. చిదంబరంలో ఆకాశలింగాన్ని దర్శనం చేసుకుంటే ఇక పుట్టవలసిన అవసరం లేదు.  చిదంబరంలో దర్శనమంటే.. అక్కడ మారేడు దళాల దండలుంటాయంతే. ఆకాశమంటే అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిన ఆకాశంలో అన్నీ ఉంటాయి. అటువంటి ఆకాశాన్ని, అనంతంగా నిండిపోయిన ఆకాశ స్వరూపాన్ని ఒక గోడగా చూపించి దానికే మారేడు దళాలు వేస్తారు. అంతటా నిండినిబిడీకృతమైపోయి ఉన్నది పరమేశ్వర స్వరూపమని అర్థం చేసుకోగలిగే వాడికి చిదంబర దర్శన రహస్యం తెలుస్తుంది. లేనివాడికి చిదంబర దర్శనం అర్థం కాదు. అందుకే భక్తులు.. ‘మహాప్రభో మాకది ఎలా నిలబడుతుంది? అంత తేలికా? సాధ్యం కాదు. ఇంకొంచెం తేలిక మార్గం చెప్పండి...