💥మహాశివరాత్రి
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
💥మహాశివరాత్రి
"మహాశివరాత్రి" పండుగను జరుపుకోవడంలో మూడు
ప్రధానమైన విషయాలు ఉన్నాయి.
శివార్చన, ఉపవాసం, జాగరణం.
శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి, స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది #శివార్చన.
#ఉపవాసం ఎలా?
శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష పాధాన్యం ఉంది. శివరాత్రి నాడు అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతుంది. చిన్నపిల్లలకు, ముసలి వాళ్ళకు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు గర్భవతులకు, మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.
ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు.
ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా, శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి.
ఉపవాసం అనే పదానికి అర్థం 'దగ్గరగా ఉండడం' అని!
భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం.
ఆరోగ్యపరంగా చూసినప్పుడు, ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది.
మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ
చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును మళ్లించడం కష్టం.
మూడోది #జాగారం.
శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు.. నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటం.
ఈ విధంగా జాగారం చేసిన వారికి పునర్జన్మ ఉండదని స్కాంధ పురాణం చెబుతోంది.
శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పాపాలను నశింపజేస్తుంది. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతోనో, ఎలాంటి ప్రయోజనం లేని వాటిని చూస్తూనో కాకుండా..
శివనామాన్ని స్మరిస్తూ, శివ గాథలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యమూ, పురుషార్థమూ రెండూ లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.
శివరాత్రి నాడు శివలింగానికి రుద్రాభిషేకం చేయించడం
మంచిది. అంతేకాదు జాగారం వుండి శివ పంచాక్షరి
మంత్రంతో ధ్యానం చేయడం వల్ల ఎంతో మేలు
జరుగుతుందని నమ్ముతారు భక్తులు.
కనుకనే మహాశివరాత్రి నాడు "నమః శివాయ" అంటూ
మారుమోగుతాయి శివాలయాలన్నీ.
'త్రయంబకం యజామహే...' అంటూ మృత్యుంజయ మంత్రం జపిస్తే సకల రోగబాధలూ తగ్గి, పూర్ణాయుష్షు లభిస్తుందని ప్రతీతి.
శివరాత్రి నాడు కలిగినంతలో దానాలు చేయడం వలన
సత్ఫలితాలు లభిస్తాయి. అందుకే "చేసిన వాడికి చేసుకున్నంత మహాదేవా" అన్నారు.
ఇవేవీ చేయ(లే)కపోయినా నిర్మలమైన మనస్సుతో వీలైనన్ని సార్లు "ఓం నమః శివాయ" అనే పంచాక్షరీ మంత్ర జపం చేసినా చాలు, బోళాశంకరుడు పొంగిపోయి వరాలిస్తాడు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment