⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


తెలుగు పంచాంగం ప్రకారం, తెలుగు నెలల్లో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్నింటికంటే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. 


ఈ మాసంలోని కార్తీకసోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి, ఉపవాస వ్రతం ఆచరించి, దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందొచ్చని పండితులు చెబుతారు. 


కార్తీకసోమవారం అంటే శుభ ఫలితాలకు సంకేతమని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో భోళా శంకరుడిని పూజిస్తే దీర్ఘసుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతారు. 


అంతే కాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, ప్రవహించే నదిలో స్నానం చేసి "హర హర శంభో.. హర హర మహదేవ" అంటూ ఈశ్వరుడిని స్మరించుకుంటే కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని చాలా మంది విశ్వసిస్తారు.


కార్తీక మాసంలోని సోమవారం పూట ఉపవాసం ఉండి పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేయడం వల్ల కైలాసవాసం దర్శనభాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో వివరించబడింది. దీన్నే కార్తీక నక్తాలు అని కూడా అంటారు.


సాధారణంగానే సోమవారం అంటేనే ఈశ్వరుడికి ప్రీతికరమైనది. సోమ అనే పదంలో సోమ అంటే ఉమ అనే అర్థం వస్తుంది. అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెబుతారు.


ఈ కారణంగా సోమవారం రోజున శివునికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు.


కార్తీక సోమవారం సాయంత్రం రోజున సంధ్యా వేళలో పరమేశ్వరుని ఎదుట దీపారాధన చేయాలి. అనంతరం పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించి ఈశ్వర వ్రతం నియమాలను పాటించాలి.


ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు, ఆహారం కొరత అనేదే రాకుండా నిత్యం సుఖశాంతులు సిద్ధిస్తాయని చాలా మంది నమ్ముతారు.


కార్తీక మాసంలో పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు బిల్వ పత్రాలతో పూజించాలి. మీ ఇంట్లో స్వయంగా చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని మీరు తీసుకుని ఇతరులకు ప్రసాదంగా ఇవ్వాలి.


సాయంత్రం ఏదైనా పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి కార్తీక దీపం వెలిగించడం వల్ల సకల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. కార్తీక సోమవారమంతా పరమేశ్వరుని సేవలో తరిస్తే విశేష ఫలితాలొస్తాయి.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు