💥 కార్తీక శుద్ధ చతుర్థి..🐍 నాగులచవితి

 ⚜️🕉️🚩 ఓం నాగేంద్రాయ నమః 🌹🙏


💥 కార్తీక శుద్ధ చతుర్థి..🐍 నాగులచవితి


పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!

గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!

చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!

వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!


నన్నేలు నాగన్న నాకులమునేలు,

నాకన్నవారల నాఇంటివారల ఆప్తమిత్రులనందరిని ఏలు.

పడగ తొక్కిన పగవాడనుకోకు,

నడుము తొక్కిన నావాడనుకొనుము.

తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము

ఇదిగో ! నూకనిచ్చెదను మూకనిమ్ము. పిల్లల మూకను నాకిమ్ము.


💥కార్తీక శుద్ధ చవితినాడు సూర్యోదయానికి ముందు ఆకాశంలో తూర్పు దిక్కున శేషుని నక్షత్ర రూపం కనిపిస్తుంది. ఇది సర్పాకారంలో ఉంటుంది. కనుక ఈ చవితిని "నాగుల చవితి" అని పిలుస్తారు.


ప్రకృతిని, అందులోని జంతువులను పూజించడం భారతీయులకు అనాదిగా వస్తున్న ఆచారం.

సమస్త జీవకోటిలో ఈశ్వరుడు ఉన్నాడని విశ్వసిస్తారు.

ఇందులో భాగంగానే పాములను పూజిస్తారు.


నాగుల చవితి నాడు నాగేంద్రుని శివ భావముతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని..

పెండ్లి కావాల్సిన యువతులు నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోస్తే త్వరగా పెళ్లి అవుతుందని నమ్మకం. 


సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని, గర్భ దోషాలు పోతాయని, వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయని, చెవి, చర్మవ్యాధులు తొలగి పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారని భక్తుల నమ్మకం. 


💥నాగుల చవితి రోజు ఉదయమే స్నానము చేసి పుట్ట దగ్గరికి వెళ్ళి, నాగరాజును పూజించి పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు, తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు.


ఆ పుట్ట మట్టిని పుట్టబంగారం అని, దానిని కొద్దిగా తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటారు.

ముఖ్యముగా చెవి బాధలు వున్నవారికి ఈ పుట్ట బంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు.


ఆ సందర్భంగా పుట్ట వద్ద "దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.


💥నాగులచవితి రోజు పుట్టలో పాలు పోస్తూ పఠించే #శ్లోకం:


పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ

సత్సంతాన సంపత్తిం దేహియే శంకర ప్రియ

అనంతాది మహానాగ రూపాయ వరదాయచ

తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!


💥మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే "నవరంధ్రాలు" అంటూ ఉంటారు.

మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను "వెనుబాము" అని అంటారు.


అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలో వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది.


ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని..


అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విష సర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది..


అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలో గల అంతర్యమని చెప్తారు.

సేకరణ... 🌹🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు