💥 హరహర మహాదేవ శంభో శంకర!!💥
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
💥 హరహర మహాదేవ శంభో శంకర!!💥
త్రిమూర్తులు ఈ సృష్టిని నడిపిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యాన్ని నిర్వహిస్తుంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మయాజాలమే ఈ ప్రపంచం. అందులో లయకారుడు శివుడి గూర్చి ఎంత చెప్పుకున్నా, ఎంత తెలుసుకున్నా తనివితీరదు.
శివుడి ఆకారం, ఆయన తత్వం, ఆయన తీరు అంతా ప్రతి మనిషికి సందేశాన్ని ఇచ్చే గొప్ప మార్గం అని చెప్పవచ్చు.
ఆయన అలంకారాలు చేసుకోడు, అవన్నీ వ్యర్థమైనవే అని, ఎంత అలంకరణ చేసుకున్న అది కొన్ని గంటల్లోనో, కొన్ని రోజుల్లోనో పోయేదే, అలా పోగానే మళ్ళీ అలంకరణ, మళ్ళీ శరీరం మీద తాపత్రయం, అలా అలంకరణ చేసుకుని ఇతరులను చూసి బేరీజు వేసుకుని మళ్ళీ ఏవో హెచ్చు తగ్గుల చిట్టా తయారు చేసుకుని ఇదే మనిషి ప్రస్తుతం చేస్తున్నది. వాటి వల్ల ప్రయోజనం ఏమిటి అనిపించదూ ఇదంతా అవగాహనకు వస్తే.
శివుడు స్మశానంలో ఉంటాడు. మనిషి పుట్టినప్పటి నుండి చచ్చేవరకే అందరి తోడూ, అందరి ప్రేమలు, అందరి తహతహలు చివరకు మనిషి మట్టిలో కలవడమో లేదా కాలి బూడిద అవ్వడమో ఇదే జరిగేది. అప్పుడు ఆ స్మశానంలోనే ఉండాల్సింది అని చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తుంది.
శివుడు బూడిద పూసుకుంటాడు. మనిషి చివరకు బూడిదే అవుతాడు. ఈ శరీరం చివరకు బూడిదే, దాని మీద వ్యామోహం వద్దు అని అన్నట్టు.
పాములు మెడలో వేసుకుంటాడు. ఆ పాములు మనిషిని వెంటాడే అరిషడ్వర్గాలు. వాటిని అదుపులో పెట్టుకోవాలని చెప్పడమే అన్నట్టు.
ఇక శివుడికి మూడవ కన్ను ఉంటుంది అది తెరిస్తే అంతా ప్రళయమే అంటారు. మనిషికి కూడా మూడవ కన్ను ఉంటుంది అదే జ్ఞాన నేత్రం. మనిషికి అంతర్గతంగా బయటకు కనిపించనిది, కేవలం ఆత్మ ద్వారా అవగాహన ద్వారా మాత్రమే తెరవగలిగినది అది. దాన్ని తెలుసుకున్నవాడు, దాన్ని అనుభూతి చెందేవాడు ఇక ఈ భౌతికదేహానికి అతీతంగా అంతర్గత ప్రపంచంలో, పరమానందంతో జీవిస్తాడు.
ఇదే శివ తత్వం, ఇదే శంకరుడి వెనుక చిద్విలాసాభరితమైన సందేశం. శంకరుడి కరుణకు పాత్రులవ్వండి. హారహార మహాదేవ అని భక్తిపూర్వకంగా స్మరించండి.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment