విశిష్టాద్వైత సిద్ధాంత ప్రకారం నారాయణుడు ఐదు స్వరూపాలతో భాసిస్తున్నాడు.
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
💥అసలు ఏ నామాన్ని జపించాలి? భగవంతుడి రూపము ఏది? భగవంతుని నామము ఏది? ఇంతమంది దేవుళ్లలో ఎవరికి చెయ్యాలి? ఎలా చెయ్యాలి?
ఇంతమందికీ చేయకపోతే ఏమౌతుందో, ఎవరేమనుకుంటారో యిన్ని సందిగ్ధలతో అయోమయంలో పడిపోయి ఇటూ అటూ పరిగెడుతూ, కాలాన్ని వ్యర్థం చేయనవసరం లేదు.
నిశ్చయంగా సత్య స్వరూపుడు, పరమాత్ముడు సర్వవ్యాపి భగవంతుడు అయిన శ్రీ మహావిష్ణువు
పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారం అనెడి ఐదు విధములుగా వేంచేసియున్నాడు.
💥విశిష్టాద్వైత సిద్ధాంత ప్రకారం నారాయణుడు ఐదు స్వరూపాలతో భాసిస్తున్నాడు.
1) పర, 2) వ్యూహ, 3) విభవ, 4) అంతర్యామి,
5) అర్చావతారం.
1) #పరస్వరూపం:
శుద్ధసత్వంతో, అద్భుత తేజస్సుతో వైకుంఠంలో నిత్యమూ భాసించే, భూదేవీ శ్రీ దేవీ సమేత మూర్తి. కేవలం నిత్యముక్తులకు ఇది దర్శనమిస్తుంది.
నిత్య ముక్తులు అంటే జన్మ నుంచి విముక్తి పొందిన వారు.
2) #వ్యూహస్వరూపం:
జగత్ సృష్టికి మూలకారణమైన స్వరూపం.
నాలుగు వ్యూహాలతో ఉన్నది.
అవి - వాసుదేవ, అనిరుద్ద, ప్రద్యుమ్న, సంకర్షణ.
ఈ వ్యూహాలతో సృష్టి స్థితి లయలను నిర్వహించువాడు.
వాసుదేవుడు👉 క్షీర సాగర శయనుడైన మూలమూర్తి.
అనిరుద్ధుడు👉 సృష్టికారక చైతన్యం.
ప్రద్యుమ్నుడు👉 స్థితి శక్తి.
సంకర్షణుడు👉 లయ కారకుడు.
అనిరుద్దాంశ బ్రహ్మ, సంకర్షణాంశం రుద్రుడు, ప్రద్యుమ్న తేజం విష్ణువు.
3) #విభవస్వరూపం:
ధర్మ రక్షణార్ధం లీలగా అవతరించే నారాయణుడు. అప్రాకృత దివ్య మంగళస్వరూపంతో, లీలా విభూతితో ఇలకు దిగిన శ్రీరామ, శ్రీకృష్ణాదు లు హరి యొక్క విభవ స్వరూపులు.
శ్రీమన్నారాయణుడు ఆయన ధర్మ రక్షణార్ధం మన కోసం ఒక అవతారంగా వస్తాడు.
ఆయనను గుర్తించి ఆయనకు దగ్గర అవుతాము.
4) #అంతర్యామి:
జీవుల హృదయాలలో భాసించే పరమాత్మ.
అందరి ప్రవృత్తులకు కారకమై, సత్కర్మానుష్ఠానాలకు అనుమతించే స్వరూపమే అంతర్యామి.
ఈ స్వరూపం ఏమిటంటే మన లోపల వడ్లగింజ కొన పరిమాణంలో నీలపు రంగులో జ్యోతిలా వెలుగుతుంటాడు.
ఆ అంతర్యామి శరీరాన్ని , ఆత్మని నడిపిస్తూ వెంట ఉంటాడు. మనం చేసే పాప, పుణ్యాలు ఆయనకు అంటవు.
జ్ఞానం తెలుసుకొని నడుచుకోవాల్సినది మనమే.
దానిని బట్టి పాప పుణ్యాలు మళ్ళీ జన్మలు ఎత్తడం, కష్టాలు పడటం.. దానినుంచి బైట పడటమే మోక్షం
5) #అర్చావతారం:
అర్చింపబడి అనుగ్రహించేందుకు వివిధ క్షేత్రాలలో వెలసిన భగవద్రూపం.
మన కోసం ఇళ్ళలో, దేవాలయాలలో రథోత్సవాలలో
ప్రతిష్ఠితమై, మనలను కరుణిస్తోన్న అమృతమయ మూర్తులు.
తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడు...
శ్రీరంగంలో రంగనాథుడు మొదలైన వారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment