💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥
⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ దైవంగా, ఏడుకొండల స్వామిగా, అనాధ నాధుడుగా, ఆర్త జన దీక్షాదక్షుడుగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా, శ్రీనివాసుడుగా అన్నింటికీమించి గోవిందుడుగా కొనియాడబడుచూ కొలువబడుతున్నాడు. పద్మావతీదేవి, అలివేలుమంగ పతిగా, సప్తగిరీశుడుగా, తిరుమలేశుడుగా భక్తకోటికి దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నాడు. వేంకటాద్రికి సరితూగే స్థానంగాని వేంకటేశ్వరుడికి సమాన దైవంగాని లేరని శాస్త్ర కథనం. స్వామివారి పుష్కరిణిలో స్నానం, శ్రీ వరాహస్వామి దర్శనం, కటాహతీర్థపానం - ఈ మూడూ ముల్లోకాలలో దుర్లభాలని స్కాందపురాణం తెలుపుతోంది. స్వామివారి కృపా వీక్షణాలతో, మూగవాడు మాట్లాడ గలుగుతాడని, కుంటివాడు నడువ గలుగుతాడని భక్తుల విశ్వాసం. కిఅజ్ఞానినా మయాదోషాన్ అశేషాన్, విహితాన్ హరేః క్షమస్వతం క్షమస్వతం- శేషశైల శిఖామణే’ అంటూ భక్తులు రెండు చేతులూ జోడించి శ్రీహరి వేంకటేశ్వరుని వేడుకుంటూ ఉంటారు. 💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥 ఓం శ్రీవేంకటేశః శ్రీవాసో లక్ష్మీ పతిరనామయః । అమృతాంశో జగద్వంద్యో గోవింద శ్శాశ్వతః ప్రభుః ॥ 1 ॥ శేషాద్రినిలయో దేవః కేశవో మధుసూదనః అమృతో మాధవః కృష్ణ...

Comments
Post a Comment