💥హనుమాన్ చాలీసా - తెలుగు తాత్పర్యముతో...

 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏


💥"హనుమాన్ చాలీసా" - ఇది శ్రీరాముని ప్రసిద్ధ భక్తుడైన "తులసీదాసు" హనుమంతుని స్తుతించే స్తోత్రం. అవధి భాషలో రచించబడింది.

"హనుమన్ చాలీసా"లో నలభై శ్లోకాలు ద్విపదులుగా ఉంటాయి.


హనుమంతుని గుణాలు - అతని బలం, ధైర్యం, జ్ఞానం, బ్రహ్మచర్యం, శ్రీరాముని పట్ల భక్తి.. హనుమాన్ చాలీసాలో వివరంగా ఉన్నాయి


💥హనుమాన్చాలీసా - తెలుగు తాత్పర్యముతో...


దోహా

శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।

వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥

బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।

బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥


💥భావం:

శ్రీ గురుదేవులు ఆంజనేయస్వామి చరణ ధూళిచే 

నా హృదయ దర్పణము శుభ్రపరచి చతుర్విధ పురుషార్థంబులనిచ్చు శ్రీరామచంద్రుని కీర్తిని 

గానము చేతును. 


నా బుద్ధిహీనతను తెలిసినవాడనై ఓ పావనతనయా! 

ఓ హనుమా! నిన్ను స్మరింతును. ఓ ప్రభూ! నాకు బలము బుద్ధి విద్యలను ప్రసాదించి నాలోని పంచ క్లేశములను, షడ్వికారములను హరింపుము.  


ధ్యానం

గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।

రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥


💥భావం:

సాగరమును ఆవుడెక్కలా భావించి దాటినవాడా! రాక్షసులను దోమలలాగా నలిపినవాడా! రామాయణమనెడి మహామాలలో రత్నము వంటి వాడా! వాయుపుత్రుడా! నీకు నమస్కారము.!


యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।

భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥


💥భావం:

ఎక్కడెక్కడ రఘునాథుడు కీర్తింపబడతాడో 

అక్కడక్కడ నీళ్ళు నిండిన కళ్ళతో శిరస్సు వంచి నమస్కారము చేస్తూ ఉంటావు. రాక్షసుల అంతు చూసే వాయుపుత్రా!నీకు నమస్కారము! 


చౌపాఈ

జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।

జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥


💥అనంతములైన జ్ఞాన గుణముల యందు పరిపూర్ణుడైన ఓ హనుమా! నీకు జయము.

మూడు లోకాలను ప్రకాశింప చేసే ఓ కపీశ్వరా  నీకు జయము.


రామదూత అతులిత బలధామా ।

అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥


💥శ్రీరామచంద్రుని రాయబారీ! 

సాటిలేని బలము గలవాడా! 

అంజనీదేవి కుమారుడా! 

పవన సుతుడను నామము కలవాడా!  


మహావీర విక్రమ బజరంగీ ।

కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥


💥మహావీరుడా! వజ్రము వంటి దృఢమైన దేహము 

కలిగిన పరాక్రమవంతుడా! దుర్బుద్ధిని తొలగించువాడా! 

మంచిబుద్ధి గలవారికి సహాయపడువాడా!


కంచన వరణ విరాజ సువేశా ।

కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥


💥బంగారువన్నెతో మంచి వేషముతో ప్రకాశించువాడా! చెవులకు కుండలములు అలంకారములుగా కలిగి ఉంగరములు తిరిగిన తలవెంట్రుకలు కలిగినవాడా!


హాథవజ్ర ఔ ధ్వజా విరాజై ।

కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥


💥చేతిలో వజ్రమును ఆయుధమును మరియు జండాను ధరించి విరాజిల్లువాడా! భుజమందు ముంజ గడ్డితో చేయబడిన యజ్ణోపవీతముతో శోభిల్లువాడా!  


శంకర సువన కేసరీ నందన ।

తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥


💥పరమేశ్వరుని పుత్రుడా! కేసరీ కుమారుడా! 

తేజస్సు ప్రతాపములతో జగత్తంతటిచే పూజింపబడువాడా


విద్యావాన గుణీ అతి చాతుర ।

రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥


💥విద్వాంసుడా! గుణవంతుడా! అతి చతురుడా!

శ్రీరామ కార్యనిర్వహణలో ఎంతో ఆత్రము, 

ఆతురత కలవాడా!


ప్రభు చరిత్ర సునివే కో రసియా ।

రామలఖన సీతా మన బసియా ॥ 8॥


💥ప్రభువగు శ్రీరాముని చరిత్ర వినుటయందు 

ఆసక్తి కలవాడా! సీతారామ లక్ష్మణులను హృదయమునందు ధరించువాడా!


సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।

వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥


💥సూక్ష్మ రూపమును ధరించి సీతాదేవికి కనిపించితివి. పిదుప భయంకర రూపమును ధరించి లంకాపురిని కాల్చివేసితివి.


భీమ రూపధరి అసుర సంహారే ।

రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥


💥భయంకర వేషమును ధరించి లంకాపురి యందున్న రాక్షసులను చంపి శ్రీరామచంద్రుని సకల కార్యములను చక్కచేసితివి.  


లాయ సంజీవన లఖన జియాయే ।

శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥


💥సంజీవనీ మూలిక తెచ్చి లక్ష్మణుని బ్రతికించితివి. అందుకు శ్రీరఘురాముడు సంతోషించి నిన్ను తన హృదయమునకు హత్తుకొనెను.


రఘుపతి కీన్హీ బహుత బడాయీ ।

తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥


💥శ్రీరామచంద్రమూర్తి నిన్ను గొప్పగా పొగడి 

"సోదరా! నీవు నాకు భరతునితో సమానముగా ప్రియమైన వాడవు" అని పలికెను.  


సహస్ర వదన తుమ్హరో యశగావై ।

అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥


💥"నీ కీర్తిని భవిష్యత్తులో అందరూ వేనోళ్ళ గానం చేసి తరించెదరు గాక!" అని పలికి శ్రీరాముడు 

నిన్ను కౌగలించుకొనెను.  


సనకాదిక బ్రహ్మాది మునీశా ।

నారద శారద సహిత అహీశా ॥ 14 ॥


💥సనకాది ఋషులు, మునీశ్వరులు బ్రహ్మాది దేవతలు, నారదుడు సరస్వతీదేవి మరియు ఆదిశేషుడు 


యమ కుబేర దిగపాల జహాం తే ।

కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥


💥యముడు కుబేరుడు దిక్పాలకులు నీ మహిమను వర్ణింపజాలనప్పుడు భూలోకమున కవులు పండితులు ఎట్లు సాధ్యమగును. 


తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।

రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥


💥నీవు సుగ్రీవునికి ఉపకారమొనర్చితివి. 

రామునితో అతనికి సఖ్యము గావింపచేసి 

రాజ్యపదవిని ఇప్పించితివి


తుమ్హరో మంత్ర విభీషణ మానా ।

లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥


💥నీ సలహాను పాటించి విభీషణుడు లంకకు రాజైన సంగతి లోకమంతటికీ తెలిసినదే.


యుగ సహస్ర యోజన పర భానూ ।

లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥


💥రెండువేల యోజనములు అనగా 16 వేల మైళ్ళ దూరమున ఉన్న సూర్యుని తీయని పండుగా భావించి దానిని మింగితివి.   


ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।

జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥


💥శ్రీరామచంద్రుడిచ్చిన ఉంగరమును నోట నుంచుకొని (రామ నామమును జపిస్తూ) సముద్రమును దాటితివి. ఇందులో ఆశ్చర్యము లేదు.


దుర్గమ కాజ జగత కే జేతే ।

సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥


💥ప్రపంచమునందు కఠినమైన కార్యములు ఎన్నెన్ని ఉన్నాయో అవి అన్నియూ నీ అనుగ్రహము వలన సరళములు కాగలవు.  


రామ దుఆరే తుమ రఖవారే ।

హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥


💥శ్రీరాముని ద్వారపాలకుడవు నీవు. 

నీ ఆజ్ఞలేనిదే లోపలికి వెళ్ళుటకు ఎవ్వరికీ వీలులేదు. 

(నీ అనుగ్రహము లేకుండా రాముని కృప ఎవరికీ దొరకదు)


సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।

తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥


💥నిన్ను శరణు పొందిన వారికి సమస్త సుఖములు లభించును. 

నీవు రక్షకుడిగా ఉండగా ఎవరికినీ 

భయపడవలసిన పనిలేదు. 


ఆపన తేజ సమ్హారో ఆపై ।

తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥


💥నీ యొక్క ప్రకాశమునకు బలపరాక్రమములను సంభాళించుకొనుటకు నీవే సమర్థుడవు. 

నీ పెద్దకేక విని ముల్లోకములు కంపించును.  


భూత పిశాచ నికట నహి ఆవై ।

మహవీర జబ నామ సునావై ॥ 24 ॥


💥ఓ మహావీరా! నీ నామస్మరణ వింటే భూతప్రేత పిశాచములు దగ్గరకు రావు. 


నాసై రోగ హరై సబ పీరా ।

జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥


💥నిరంతరము వీర హనుమంతుని జపించినచో 

సమస్త రోగములు నశించును. అన్ని పీడలు హరించుకుపోవును.


సంకట సే హనుమాన ఛుడావై ।

మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥


💥ఎవరైతే మనోవాక్కాయ కర్మలచే తనను ధ్యానించినచో వారిని ఆంజనేయుడు సమస్త సంకటముల నుండి విముక్తి చేయును.


సబ పర రామ తపస్వీ రాజా ।

తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥


💥శ్రీరామచంద్రుడు తాపసులకు అందరకు గొప్పవాడు. ప్రభువు వంటివాడు. ఆయన సకల కార్యములను ఓ ఆంజనేయా! 

నీవు చక్కగా సవరించుచుందువు.    


ఔర మనోరధ జో కోయి లావై ।

తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥


💥ఎవరు ఏయే కోర్కెలతో శ్రీ హనుమంతుని సేవింతురో వారికి ఆ కోర్కెలు తీరి అనంతమైన జీవన ఫల ప్రాప్తి కలుగును.


చారో యుగ ప్రతాప తుమ్హారా ।

హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥


💥ఓ హనుమా! నీ యొక్క ప్రతాపము నాలుగు యుగములలోనూ ప్రసిద్ధమైనవి. జగత్తంతయు నీ కీర్తి కాంతులతో ప్రకాశమానమై ఉన్నది


సాధు సంత కే తుమ రఖవారే ।

అసుర నికందన రామ దులారే ॥ 30 ॥


💥సాధన చేసేవారికి చక్కగా తపస్సు చేసేవారికి 

నీవు రక్షకుడవు. దుర్మార్గులను నాశనము చేయువాడవు మరియు శ్రీరామునికి అత్యంత ప్రియమైనవాడవు


అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।

అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥


💥అష్టసిద్ధులను నవవిధులను ప్రసాదింపగలుగునటుల జానకీ మాత నీకు వరమొసగెను


రామ రసాయన తుమ్హారే పాసా ।

సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥


💥రామ రసాయనము నీవద్ద గలదు. 

నీవు ఎల్లప్పుడూ శ్రీరామచంద్రుని సేవకుడవై ఉందువు


తుమ్హరే భజన రామకో పావై ।

జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥


💥నీయొక్క భజన వలన రామానుగ్రహము పొంది 

జన్మ జన్మంతారముల దుఃఖముల నుండి 

విముక్తి పొందెదరు.


అంత కాల రఘుపతి పురజాయీ ।

జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥


💥(నిన్ను భజించినవారు) మరణించిన పిదప వైకుంఠమునకు పోవుదురు. మరల జన్మించినచో వారు హరిభక్తులుగా 

ప్రసిద్ధి చెందుదురు.


ఔర దేవతా చిత్త న ధరయీ ।

హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥


💥ఇతర దేవతలకు తన హృదయము నందు స్థానమీయక శ్రీ హనుమంతునే ధ్యానించు వారికి (ఆంజనేయుడు) సమస్త సుఖములను ఒసంగును.


సంకట క(హ)టై మిటై సబ పీరా ।

జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥


💥మహాబలుడగు ఆంజనేయుని ఎవరైతే స్మరింతురో 

వారి సంకటములన్నియు తొలగి పీడలన్నియు నశించును


జై జై జై హనుమాన గోసాయీ ।

కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥


💥జితేంద్రియుడైన ఓ ఆంజనేయ! 

నీకు జయము జయము జయము. 

గురుదేవుని వలె (నాయందు) దయ జూపుము


జో శత వార పాఠ కర కోయీ ।

ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥


💥ఎవరైతే (ఈ చాలీసాను) నూరుమార్లు పఠనము చేయుదురో వారికి అన్ని బంధనములు వీడి 

పరమానంద ప్రాప్తి కలుగును


జో యహ పడై హనుమాన చాలీసా ।

హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥


💥ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను పఠింతురో 

వారికి పార్వతీపరమేశ్వరుల సాక్షిగా సిద్ధికలుగును


తులసీదాస సదా హరి చేరా ।

కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥


💥ఓ నాధా (ఆంజనేయా!) ఈ తులసీదాసు ఎల్లప్పుడూ 

హరి సేవకుడే కావున నా హృదయమందు నివసింపుము


దోహా

పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ ।

రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥

సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ ।


💥సమస్త సంకటములను హరింప చేసెడివాడవు. 

మంగళ స్వరూపుడవు, సమస్త దేవతలకు నాధుడవు అయినా ఓ ఆంజనేయా! సీతారామ లక్ష్మణ సహితుడవై నా హృదయమున వసింపుము.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం