💥శివపంచాక్షరీ స్తోత్రము💥

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


💥భగవంతుడి నామాన్ని అర్థం తెలియకపోయినా భక్తితో ఉచ్చరించినా తగినంత ఫలం లభిస్తుంది. 


శివ భక్తుడైన సౌనందగణేశ ముని ఒకసారి యమలోకానికి వెళ్లగా యమధర్మరాజు ఆయనను సత్కరించి, వచ్చిన కారణమేంటని అడిగాడు.

తాను యమలోకంలోని విశేషాలను చూడడానికి వచ్చినట్లు ముని చెప్పారు.


దీంతో తన లోకంలో నరకయాతనలు అనుభవిస్తున్న పాపాత్ములను యముడు ఆ మునికి చూపించాడు. వారి పరిస్థితికి జాలిపడిన ఆ మహర్షి..

ఓ జనులారా! ఇది "ఓం నమశ్శివాయ" అనే మంత్రం దీనిని ఉచ్చరిస్తే మీ యాతనలు పటాపంచలవుతాయని తెలిపారు.


ముని చెప్పగా వారంతా పంచాక్షరిని జపించారు. దీంతో వారికి నరక విముక్తి లభించి, అంతా కైలాసం చేరుకున్నారట.


ఆ మహర్షి వారికి పంచాక్షరి మంత్రానికి అర్థం బోధించలేదు. కానీ భక్తితో ఉచ్చరించినంత మాత్రానే వారికి కైలాసం లభించింది.

అర్థయుక్తంగా ఉచ్చరిస్తే ‘"అధికస్య అధికం ఫలమ్‌" అన్నట్టు అధికంగా ఫలం లభిస్తుంది.


💥శివపంచాక్షరీ స్తోత్రము💥


నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశ్శివాయ [ 1 ]


మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథ నాథ మహేశ్వరాయ

మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశ్శివాయ [ 2 ]


శివాయ గౌరీ వదనారవింద-సూర్యాయ దక్షాధ్వర నాశకాయ

శ్రీ నీల కంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశ్శివాయ [ 3 ]


వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానర-లోచనాయ తస్మై వకారాయ నమశ్శివాయ [ 4 ]


యజ్ఞ స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ

దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశ్శివాయ [ 5 ]


ఫలశృతి

పంచాక్షర-మిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ

శివలోక-మవాప్నోతి శివేన సహ మోదతే

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏