తలచుకున్న వారినెల్ల తరింప జేసేవాడు ఈ అయోధ్య రాముడు.
⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🌹🙏
శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు ... సూర్యుడి తేజస్సును కలిగినవాడు. అలాంటి రాముడి పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది అయోధ్య.
'రామాయణం' చదివిన ప్రతి ఒక్కరూ, అప్పట్లో తాము అయోధ్య వాసులమైతే బాగుండునని అనుకుంటారు. అప్పుడు తాము అక్కడ ఉంటే ఆయనను అడవులకు వెళ్లనిచ్చేవాళ్లము కాదని అనుకుంటారు. అలా రామచంద్రుడు ఆనాటి ప్రజలను మాత్రమే కాదు, ఆ తరువాత యుగాలను కూడా ప్రభావితం చేశాడు.
బాల రాముడికి కౌసల్యాదేవి నింగిలోని చంద్రుడిని చూపిస్తూ గోరుముద్దలు తినిపించేదట. ఆ తరువాత ఆ చంద్రుడి దిష్టే తగులుతుందేమోనని దిష్టి తీసేదట.
చంద్రుడే అసూయపడే సౌందర్యం రామచంద్రుడి సొంతం. అలాంటి ఆ స్వామి బాలరాముడిగా ఇప్పుడు అయోధ్యలో కొలువయ్యాడు. ముద్దులొలుకుతూ .. ముచ్చటగొలుపుతూ మనసు మనసుకి మరింత చేరువయ్యాడు.
ఆధ్యాత్మిక వైభవాన్ని విశ్వమంతటా విస్తరింపజేసేవాడు ఈ అందాల రాముడు.. తలచుకున్న వారినెల్ల తరింప జేసేవాడు ఈ అయోధ్య రాముడు.
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment