💥శ్రీ రామచంద్రుని వంశ వృక్షం💥

 ⚜️🕉️🚩శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏


శరీరస్య గుణానాం చ, దూరమత్యంత మంతరం

శరీరం క్షణవిధ్యంసి, కల్పాంతస్థాయినో గుణాః


🌹శరీరానికి, గుణానికి చాలా భేదమున్నది. శరీరం ఏ క్షణంలో నైనా పతనమౌతుంది. (తేలు కుడితే, దోమ కుడితే, అత్యంత సూక్ష్మక్రిమి దాడి చేస్తే నశించేది శరీరం) కాని సృష్టి చివరి వరకు నిలిచి ఉండేది వ్యక్తి గుణం మాత్రమే.


శరీరం కోసం జీవించడం కాదు. లోకకళ్యాణం కోసం ఈ జీవితాన్ని అర్పించాలి. ఈ శరీరాన్ని ఉపయోగించి లోకకల్యాణ కారకమైన సద్గుణాలను సంపాదించుకోవాలి.


మనం విగ్రహారాధకులం మాత్రమే కాదు, గుణారాధకులం. మహాపురుషుల విగ్రహాలు పెట్టుకున్న మనం వారి గుణాలనూ స్మరించాలి.


💥లోకాభిరాముని వంశం ఎంత గొప్పదో చూడండి. రాముడు ఒక ఉత్తమ కొడుకుగా, ఉత్తమ ప్రజాసేవకుడు 'రాజు'గా, ఉత్తమ మిత్రునిగా, ఉత్తమ భర్తగా, ఉత్తమ సోదరునిగా, ఉత్తమ శిష్యునిగా ఈ విధంగా అనేకమైన సుగుణాలు కలిగిన రాముడుకి అన్ని ఉత్తమ లక్షణాలు రావడానికి వారి వంశజులను ' పూర్వీకులను' గమనిస్తే అర్ధం అవుతుంది, శ్రీరామ చంద్రుని వంశ పరంపర విన్నా చదివినా , పుణ్యఫలం దక్కుతుంది.


💥శ్రీ రామచంద్రుని వంశ వృక్షం💥


బ్రహ్మ కొడుకు మరీచి


మరీచి కొడుకు కశ్యపుడు.


కశ్యపుడు కొడుకు సూర్యుడు.


సూర్యుడు కొడుకు మనువు.


మనువు కొడుకు ఇక్ష్వాకువు.


ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.


కుక్షి కొడుకు వికుక్షి.


వికుక్షి కొడుకు బాణుడు.


బాణుడు కొడుకు అనరణ్యుడు.


అనరణ్యుడు కొడుకు పృధువు.


పృధువు కొడుకు త్రిశంఖుడు.


త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు ( లేదా యువనాశ్యుడు )


దుంధుమారుడు కొడుకు మాంధాత.


మాంధాత కొడుకు సుసంధి.


సుసంధి కొడుకు ధృవసంధి.


ధృవసంధి కొడుకు భరతుడు.


భరతుడు కొడుకు అశితుడు.


అశితుడు కొడుకు సగరుడు.


సగరుడు కొడుకు అసమంజసుడు.


అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.


అంశుమంతుడు కొడుకు దిలీపుడు.


దిలీపుడు కొడుకు భగీరధుడు.


భగీరధుడు కొడుకు కకుత్సుడు.


కకుత్సుడు కొడుకు రఘువు.


రఘువు కొడుకు ప్రవుర్ధుడు.


ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.


శంఖనుడు కొడుకు సుదర్శనుడు.


సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.


అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.


శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.


మరువు కొడుకు ప్రశిష్యకుడు.


ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.


అంబరీశుడు కొడుకు నహుషుడు.


నహుషుడు కొడుకు యయాతి.


యయాతి కొడుకు నాభాగుడు.


నాభాగుడు కొడుకు అజుడు.


అజుడు కొడుకు ధశరథుడు.


ధశరథుడు కొడుకు రాముడు.


రాముడి కొడుకులు లవ కుశలు.. ఇది శ్రీ రాముని వంశ వృక్షం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు