🔱🌷"శ్రీదుర్గా ద్వాత్రింశన్నామ మాలా"🌷🔱

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏


సర్వ బాధల నుండి విముక్తి చేసే #దుర్గాదేవి నామం..!!

🔱🌷"శ్రీదుర్గా ద్వాత్రింశన్నామ మాలా"🌷🔱


💥దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి

అమ్మవారు దుర్గాదేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.


పగటి వేళలో సూర్య నేత్రంతోను..

సంధ్యా సమయంలో అగ్ని నేత్రంతోను..

రాత్రి సమయంలో చంద్ర నేత్రంతోను ఆ తల్లి లోకాలను దర్శిస్తూ ఉంటుంది.

ఆ మహా శక్తి స్వరూపిణి అధీనంలోనే ప్రకృతి శక్తులన్నీ నడుస్తుంటాయి.


సమస్త దేవతా స్వరూపమైన దుర్గాదేవిని దేవతలు.. మహర్షులు అనునిత్యం పూజిస్తుంటారు. దుర్గాదేవి పాదాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆశ్రయిస్తారో, అలాంటి వారిని ఆ తల్లి ఒక రక్షణ కవచంగా కాపాడుతూ ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


"#దుర్గా" అనే నామం రెండే అక్షరాలూ అయినప్పటికీ, ఆ నామానికి గల శక్తి అంతా ఇంతా కాదు. సమస్త లోకాలను ఈ రెండు అక్షరాలే రక్షించగలవు.


ఆ తల్లి నామాన్ని అనునిత్యం స్మరించడం వలన,

సమస్త పాపాలు హరించబడతాయి. ఆపదలో వున్న వారు దుర్గా నామాన్ని స్మరించడం వలన, వాటి నుంచి గట్టెక్కుతారు.


అనారోగ్యాలతోను.. ఆర్ధికపరమైన సమస్యలతోను

ఇబ్బందులు పడుతున్నవాళ్లు, ఆ తల్లి నామాన్ని స్మరించడం వలన వాటి నుంచి విముక్తిని పొందుతారు. దుర్గా నామాన్ని స్మరించడం వలన గ్రహసంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయి.


ఈ శ్లోకం చాలా శక్తిమంతమయిన శ్లోకం.

దుర్గాదేవికి సంభందించిన 32 నామాలు ఇందులో ఉన్నాయి.


ఈ శ్లోకం "దుర్గాసప్తసతి"లో కనిపిస్తుంది.

ఈ శ్లోకాన్ని ఎవరు రోజూ చదువుతారో వారు అన్ని భయాలనుంచీ కష్ఠాలనుంచీ విముక్తులవుతారు.


💥శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ మాలా స్తోత్రం💥


దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ

దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ

ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా

ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక దవానలా

ఓం దుర్గ మాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ

ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా

ఓం దుర్గమ జ్ఞాన సంస్థానా దుర్గమ ధ్యాన భాసినీ

ఓం దుర్గ మోహాదుర్గ మాదుర్గమార్ధ స్వరూపిణీ

ఓం దుర్గ మాసుర సంహంర్త్రీ దుర్గమాయుధధారిణీ

ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమాదుర్గమేశ్వరీ

ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గ దారిణీ


నామావళి మిమాం యస్తు దుర్గాయా మమ మానవః

పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి నసంశయః

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు