🌷💥శ్రీ కార్తికేయ పంచకం💥🌷

 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏


దృశి స్కన్దమూర్తి శ్రుతౌ స్కన్దకీర్తి – ర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ |

కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం – గుహే సన్తు లీనా మమాశేషభావా


మునీనా ముతాహో! నృణాం భక్తిభాజా – మభీష్టప్రదా! స్సన్తి సర్వత్ర దేవాః |

నృణా మన్త్యజానా మపి స్వార్థదానే – గుహాద్దేవ మన్యం నజానే నజానే


💥భావం:

నా దృష్టియందు కుమారస్వామి దివ్యమూర్తి, చెవులయందు స్కందుని కీర్తి, నోటియందు ఎల్లప్పుడూ పవిత్రమైన స్వామి చరిత్ర, చేతులయందు ఆయన సేవ ఉన్నవై, శరీరము ఆయనకు దాసియై నా ఆలోచనలన్నీ ఆ గుహుని యందు లీనములగుగాక.


మునులకు గాని లేక భక్తి పరులగు నరులకు గాని వాంఛితముల నొసంగు దేవులంతట గలరు. కాని అంత్యవర్ణ సంజాతులగు మానవులకు గూడ నిజాభీష్టముల నొసంగుట యందు కుమారస్వామి కంటె వేరు దైవమును నేనెరుంగను, నే నెరుంగను.


🌷💥శ్రీ కార్తికేయ పంచకం💥🌷


విమల నిజపదాబ్జ౦ వేదవేదాన్త వేద్యం

మమకుల గురుదేహం వాద్యగాన ప్రమోహ౦

రమణ గుణజాలం రాగరాడ్భాగినేయం

కమలజ నుత పాదం కార్తికేయం భజామి || 1 ||


శివ శరవణజాతం శైవయోగ ప్రభావం

భవహిత గురునాథం భక్తబృన్ద ప్రమోదం

నవరస మృదుపాదం నాద హ్రీంకార రూపం

కవన మధురసారం కార్తికేయం భజామి || 2 ||


పాకారాతి సుతా ముఖాబ్జ మధుపం బాలేందు మౌళీశ్వరం

లోకానుగ్రహ కారణం శివసుతం లోకేశ త(స)త్త్వప్రదం

రాకాచంద్ర సమాన చారువదనం అ౦భోరువల్లీశ్వరం

హ్రీంకార ప్రణవ స్వరూప లహరీ౦ శ్రీకార్తికేయం భజే || 3 ||


మహాదేవా జ్ఞాతం శరవణభవం మంత్ర శరభం

మహాతత్త్వానందం పరమలహరి మందమధురం

మహాదేవాతీతం సురగణయుతం మంత్రవరదం

గుహం వల్లీనాథం మమహృదిభజే గృధ్రగిరీశం || 4 ||


నిత్యాకారం నిఖిల వరదం నిర్మలం బ్రహ్మతత్వం

నిత్యం దేవైర్వినుత చరణం నిర్వికల్పాదియోగం

నిత్యేడ్యం తం నిగమవిదితం నిర్గుణం దేవ నిత్యం

వందే మమ గురువరం నిర్మలం కార్తికేయం || 5 ||


|| ఇతి శ్రీ కార్తికేయ పంచకం సంపూర్ణం ||

సేకరణ... 💐🙏



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు