⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏


సమస్తలోక శంకరం నిరస్త దైత్యకుంజరం!

దరేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరం!

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం!

మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం!!


💥"...... దిగీశాదిరూపం

అసత్ సత్ స్వరూపం జగద్ధేతురూపం సదావిశ్వరూపం గణేశం నతాః స్మః ||


అని గణపతిని గర్గ మహర్షి కీర్తించినట్లు గణేశపురాణంలో ఉంది. 


దశదిశలా వ్యాపించి ఉన్నవాడు; అసత్ (నశించిపోయే వస్తువులు, ప్రపంచం, పంచభూతాలు మొదలైనవి), సత్ (శాశ్వతమైనది, పరబ్రహ్మతత్త్వం) - ఈ రెండింటి రూపంలో ఉన్నవాడు, జగత్తుకు కారణమైనవాడు, ఈ విశ్వం యొక్క రూపంలో ఉన్న గణేశునికి నమస్కారాలు అని భావం.


కనపడని తత్త్వమే కాదు, కనిపించే ఈ జగత్తు కూడా గణపతి స్వరూపమే. ఆయన తప్ప అన్యమైనది లేదు. 


💥భగవాన్ రమణ మహర్షి, వారి ఉపదేశసారంలో 'జగత ఈశాధీయుక్త సేవనం, అష్టమూర్తి భృద్దేవపూజనం -5||’


ఈ జగత్తే ఈశ్వరుడు అనే బుద్ధితో కూడి, దీనికి సేవ చేస్తే, అది అష్టమూర్తులుగా వ్యక్తమవుతున్న భగవంతునికి చేసే పూజయే అవుతుంది అని భావం.


ఇది పరిపూర్ణమైన భక్తియోగ మార్గం. అందుకోసం అంతర్ముఖమై, ఆ అంతఃదృష్టిని నిలుపుకుంటూనే దేశానికి, ధర్మానికి, లోకానికి సేవ చేయాలి, అందరికీ ప్రేమను పంచాలి.


అంతటా దైవాన్నే చూస్తే, అప్పుడు కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం, చిరాకు మొదలైన లక్షణాలకు తావు ఉండదు. ఇతరుల కోపంలో కూడా మనం స్వామినే చూస్తాము. ద్వేషాన్ని కూడా ద్వేషించము, పగను కూడా ప్రేమిస్తాము. 


ఎందుకంటే అన్నిటిలో ఆయనే ఉన్నాడు. మంచి, చెడులు రెండూ ఆయన నుంచే ఉద్భవించాయి. ఒకటి ఎలా ఉండాలో చెప్తే, ఇంకోదాని ద్వారా ఎలా ఉండకూడదో చెప్తున్నాడు.... మనం అనుకున్నది జరగనప్పుడు, అనుకోనిది జరిగినప్పుడు, మన ఆశలకు భిన్నంగా జరిగినప్పుడు కోపం వస్తుంది.


కానీ అంతటా ఆయనే ఉన్నాడు, ఆయన ఆజ్ఞ ప్రకారమే ఏదైనా జరుగుతోంది అని నిజంగా నమ్మితే, అనుకోనిది జరిగినా కోపం ఉండదు, బాధ ఉండదు.


ఎవరి వల్లనో పనులు ఆగిపోయాయని వాళ్ళ మీద విరుచుకుపడటం ఉండదు. మనం అలాంటి స్థితిని చేరుకోవాలి. 


నిజానికి ఇవన్నీ చదివితే అనుభవంలోకి రావు, ఆచరణలో పెట్టాలి, మనం చేసే ప్రతి పనిలో ఆయన్ను చూడగలగాలి. అందుకు సిద్ధమవ్వాలి. పాత ఆలోచనలను ఈ క్షణంలోనే విడిచిపెట్టాలి.  


కర్మ (ఆచరణ) ద్వారా మాత్రమే జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. ఖచ్ఛితంగా దైవం యొక్క స్పందనను మనం వినవచ్చు. ప్రతి దాన్లోను జీవం ఉట్టిపడటం కనిపిస్తుంది. 


అప్పుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న మహాగణపతి దర్శనం అవుతుంది. అదే గణపతి ‘మహాకాయం’.  


విశ్వరూప గణపతికి ఎన్నో ముఖాలు ఉంటాయి. అందులోకి నీ ముఖం కూడా ఒకటి ఉంటుంది. అంటే నువ్వు ఆయన నుంచి వేరుగా లేవు. ఆయనలోనే ఉన్నావు. అదే మహాకాయం.


సదావిశ్వరూపం గణేశం నతాః స్మః

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం