💥స్కందుడు.. సంకటహరుడు💥

 ⚜️🕉️🚩ఓం సుబ్రహ్మణ్యాయ నమః🌹🙏


శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం

దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజం |

స్కందం షణ్ముఖం దేవం శివతేజం చతుర్భుజం

కుమారం స్వామినాధం తం కార్తికేయం నమామ్యహం ‖


💥స్కందుడు.. సంకటహరుడు💥


సుబ్రహ్మణ్యునికి అనేక పేర్లున్నా ప్రతి నామం వెనుక ఒక అంతరార్థం దాగి ఉంది. ఈ స్కందుడన్న నామం వెనక ఉన్న గాథను రామాయణం ఎరుకపరుస్తోంది.


ఒకానొక కాలంలో ఆదిదంపతులు తల్లిదండ్రులు కావాలనుకొన్నారు. ఆదిశక్తిని పూజించడం ఆరంభించారు.


ఆకాలంలోనే శూరపద్మాసురుడనే రాక్షసుడు సజ్జనులను బాధించేవాడు. శివకుమారునితో తప్ప మరణ భయంలేని ఆ శూరపద్మాసురుడు దేవతలను సైతం హింసించడం ఆరంభించాడు.


దేవతలంతా కలసి పరమేశ్వరుడికి శివకుమారుణ్ణి ప్రసాదించమని వేడుకున్నారు. పరమేశ్వరుడు అభయం ఇచ్చాడు.


కాలం గడుస్తున్నా శివకుమారోదయం కలుగలేదు. బాధలను భరించలేని దేవతలు ఆలోచనలు చేశారు. 


పరమశివుని దగ్గరకు వెళ్లి శివరేతస్సును భరించే శక్తి ఒక్క పార్వతీదేవికి ఉందా అన్న అనుమానాన్ని వెలిబుచ్చారు.


పార్వతి వారి అనుమానానికి కినుక వహించి అపుత్రవంతులుగా వారిని శపించింది.


పరమేశ్వరుడు ఆలోచించి ‘దేవతలారా, మీ ఇష్టప్రకారమే నా రేతస్సును భూమిపై విడుస్తాను’ అని చెప్పాడు.


దేవతలందరు వాయువును పిలిచి నీవు అగ్నితో కూడి శివరేతస్సును ధరించమని చెప్పారు. కాని అగ్ని ఆ తేజస్సు ను భరించ లేక గంగకు బదలాయంచారు.


ఆమె కూడా ఆ శివతేజస్సును భరించలేక కొన్నాళ్లకు హిమాలయ ప్రాంతంలో విడిచి పెట్టింది.


ఆ వీర్య ప్రభావం చేత అక్కడ శ్వేత పర్వతం ఏర్పడింది. ఆ పర్వత ప్రాంతమంతా శివ తేజః ప్రభావంతో సర్వధాతుమయం అయంది.


ఆ శ్వేత పర్వతం నుంచి శరవణం ప్రభవించింది. దాని నుంచి కుమారస్వామి జన్మించాడు.


అలా గంగ స్కలించినందువల్ల ఉద్భవించిన శివ కుమారుడే స్కందుడన్న నామధేయంతో విఖ్యాతుడయ్యాడు.


ఆ శివకుమారుడే శూరపద్మాసురుని సంహరించాడు. దేవతలకు ఆనందాన్ని కలిగించాడు. వల్లీ, దేవసేన అనే కన్యలను పెళ్లాడి వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణునిగా కొలువై భక్తుల కోరికలను ఈడేరుస్తున్నాడు.


ఈ స్కంద నామధేయ సుబ్రహ్మణ్యునికి ఆషాఢమాస పంచమి నాడు ప్రత్యేక పూజలు జరుపుతారు. 


కార్తికేయునిగా, శరవణునిగా, కుమారునిగా, సుబ్రహ్మణునిగా, అగ్ని సంభవునిగా - ఇలా అనేక పేర్లతో స్కందుని సంభావిస్తూ స్కందపంచమి నాడు సుబ్రహ్మణ్యుని విశేషార్చనలు, సుబ్రహ్మ ణ్యుని వివాహాలు చేస్తారు.


ఈ స్కందుని పూజ సంకటాలను తీరుస్తుందని భక్తుల నమ్మకం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు