💥నిత్య పూజగా శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన ఎలా చెయ్యాలి?💥
⚜️🕉️🚩ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః🌹🙏
💥నిత్య పూజగా శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన ఎలా చెయ్యాలి?💥
అన్నింటికన్నా పతాక స్థాయి మోక్షం.. అదే ఇవ్వగలరు అంటే ఇంక ఏదైనా ఇవ్వగలరు అని గుర్తు.
మోక్షం ఇవ్వగలిగిన రూపాలు ఏవి అన్నవాటిని శంకర భగవత్పాదాచార్యులు (షణ్మతస్థాపనాచార్య) ఆరింటిని నిర్ధారణ చేశారు.
1) పరమశివుడు 2) అంబిక (అమ్మవారు)
3) సూర్యుడు 4) విష్ణువు 5) సుబ్రహ్మణ్యుడు
6) విఘ్నేశ్వరుడు.
ఈ ఆరుగురి పేర్లమీదే శైవము, శాక్తేయము, సౌరము, వైష్ణవము, కౌమారం, గాణాపత్యము అని ఆరు సిద్ధాంతాలు. ఇందులో అయిదుగురికి పూజలో స్థానం ఇచ్చారు.
"పంచాయతనం" అంటే అయిదు.
పరమశివుడు, అమ్మవారు, శ్రీమహావిష్ణువు, సూర్యుడు, విఘ్నేశ్వరుడు పంచాయతనంలో ఉంటారు.
మోక్షం ఇవ్వగలిగిన వాళ్ళలో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు. పూజలో మాత్రం సుబ్రహ్మణ్యుడు లేడు.
మరి ఎలా పూజ చేయడం?
💥సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నా సరే జ్యోతి స్వరూపుడు. ఆయన ఎక్కడ ఉంటే "అజ్ఞాన దగ్ధం"... అజ్ఞానాన్ని తీసేస్తాడు.
సుబ్రహ్మణ్యుడు అంటే ఎప్పుడూ జ్ఞానమూర్తి. జ్యోతి స్వరూపంగా వెలిగిపోతూంటాడు.
పూజ మొట్టమొదటగా దీపం వెలిగించి మొదలుపెట్టాలి. ఆ దీపశిఖలో వెలుగుతున్నటువంటి జ్యోతి సుబ్రహ్మణ్యుడే.
పూజ పూర్తి అయేది మంగళ నీరాజనంతో... నీరాజనంలో ఉన్న జ్యోతి సుబ్రహ్మణ్యుడే.
జ్యోతిని చూస్తూ మీరు ఏ మూర్తి దగ్గర వేసినా సుబ్రహ్మణ్యుడికి అందుతుంది.
💥దీపం దగ్గర ఒక పళ్ళెం పెట్టి జ్యోతిస్స్వరూపంగా సుబ్రహ్మణ్యుడు వెలిగిపోతున్నాడు అని భావన చేసి పళ్ళెంలో పువ్వులు వేస్తూ ఉంటే ఆ పువ్వులు వెళ్ళి ఆయన పాదాలమీద పడతాయి.
💥"ఆత్మావై పుత్ర నామాసి"
సుబ్రహ్మణ్యుడి మూర్తి పెట్టుకొని ఆయన వంక చూస్తూ శివుడికి వేస్తే సుబ్రహ్మణ్యుడికి అందుతుంది.
💥సుబ్రహ్మణ్యుడు పార్వతీదేవి కొడుకు, పార్వతీదేవి శ్రీమన్నారాయణుడికి చెల్లెలు నారాయణి. కనుక పార్వతీదేవి కొడుకు విష్ణువుకు మేనల్లుడు అవుతాడు.
మేనల్లుడు.. అల్లుడు ఎందుకంటే విష్ణువు యొక్క కూతురు వల్లి. మేనల్లుడే అల్లుడైనాడు.
శైవము, వైష్ణవము వియ్యం అందాయి సుబ్రహ్మణ్యుడి వల్ల.
సుబ్రహ్మణ్యుడు రక్షణశక్తి. సుబ్రహ్మణ్యుడు శివకేశవులు ఇద్దరికీ ప్రతీక. స్థితికారశక్తిగా విష్ణుస్వరూపంగా ఉంటాడు.
అందుకే సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నీ కొండలమీదే ఉంటాయి.
కాబట్టి విష్ణువు పాదం దగ్గర వేసినా సుబ్రహ్మణ్యుడికి అందుతుంది.
💥చేతిలో ఉండేది వేలాయుధం – శక్తిని చేతిలో పట్టుకుంటాడు. అమ్మ శక్తియే ఆయన చేతిలో శూలం.
అమ్మ దగ్గర వేస్తే సుబ్రహ్మణ్యుడికి అందుతుంది.
💥తేజోమూర్తి సూర్యనారాయణమూర్తి దగ్గర వేసినా ఆయనకు అందుతుంది.
💥గణపతికి సుబ్రహ్మణ్య సంబంధంగా "స్కందపూర్వజాయ నమః" అని ఉంది.
ఆయన దగ్గర వేసినా సుబ్రహ్మణ్యుడికి అందుతుంది.
💥అందుకని ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యుడికి పూజలో మూర్తిని శంకరాచార్యుల వారు ఇవ్వలేదు. జ్యోతిస్స్వరూపుడు దీపంగా ఉన్నాడు కాబట్టి అక్కడ చేసినవన్నీ సుబ్రహ్మణ్యుడికే అందుతాయి.
ఇలా సుబ్రహ్మణ్య పూజను పూర్ణం చేసుకోవచ్చు.
సేకరణ...💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment