⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🌹🙏

 ⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🌹🙏


ఉదయగిరి ముపేతం భాస్కరం పద్మహస్తాం |

సకల భువన నేత్రం నూ త్నరత్నోపధేయం |

తిమిరకరి మృగేంద్రం బోధకం పద్మినీ నాం |

సురవరమభి వంద్యం, సుందరం, విశ్వరూపం ||


💥మనలో భగవంతుడు లేడని అనేవారు ఉంటారు గానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు.


జాతి, మత, దేశ బేధాలు లేకుండా అన్ని విశ్వాసాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరిచే కీర్తింపపడేవాడు సూర్యుడు. అందుకే ఆయన ప్రత్యక్ష దైవం, లోకసాక్షి. 


జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియమానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు.


ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని భక్తిభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచ మంతటా ఉంది.


జీవుల ఉనికికీ, మనుగడకు ఆధారం సూర్యుడే. నిస్వార్ధ కర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు.


సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక. పూరి గుడిసెమీద, రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడాయన. పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు.


విధినిర్వహణలో కూడా సూర్యుడే అందరికి ఆదర్శం. ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడు. 


సృష్టిలోని సంపదకు, విద్యావిజ్ఞానాలకు ఆయనే మూలపురుషుడు. సూర్యుని వల్లనే సంపద కలుగుతోంది అనడానికి  ఎన్నో పురాణకథలు ప్రచారంలో ఉన్నాయి.


అరణ్యవాస సమయంలో తమవెంట వచ్చిన పౌరులకు, మునులకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మ రాజు సూర్యుని ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడు ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు. ఆ అక్షయపాత్ర అక్షయంగా ఆహార పదార్థాలను అందిస్తుంది.


అలాగే సత్రాజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతకమనే మణిని పొందుతాడు. ఆ మణి రోజూ పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది.


ఇక విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేదశాస్త్రాది విద్యలన్నింటిలో నిష్ణాతుడు.


సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు. బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీమంత్రం. ఇహానికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి.


జీవుల పుట్టుకకూ  పోషణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే లభిస్తున్నాయి. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే. ఆ మనస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు.


ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే. అంతటికీ, అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషులు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు. సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు.


సూర్యుడే గురువనీ, సూర్యకాంతే జ్ఞానమనీ చెబుతారు. శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్య కాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందనీ వీరంటారు.


పంచ భూతాలలో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది.


శబ్ధానికి కొన్ని పరిమితులున్నాయి. శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది. వెలుగు అపరిమిత మైనది. కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమమూ అవసరంలేదు. వెలుగు అన్నింటికంటె వేగంగా పయనిస్తుంది.


ఋషులు, యోగులు ఎంతో కాలంపాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు. ఇది సాధ్యమా అని సందేహించే వారుంటారు. 


పంచభూతాలతోకూడిన ప్రకృతి, ఆ ప్రకృతిలోని భాగమైన మనమూ, మన శరీరంలోనే నిద్రాణంగా ఉన్న అపారశక్తులనూ, వాటిని మేలు కొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశముండదు.


సూర్యనమస్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది.


మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరచుకున్నప్పుడు శరీరం నిలుపుకోవడానికి బాహ్యమైన ఆహారపదార్థాల అవసరం తగ్గుతుంది. అంటే భోగశరీరం యోగ శరీరంగా మారి పోతుంది. అప్పుడు అపారమైన శాంతి, సమస్థితి కలుగుతాయి.


వెలుపలి సూర్యునికంటె వేయిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మన లోపలే ఉన్నాడు. అలాగే జ్ఞాన వివేకాలు కూడా మన లోపలే ఉన్నాయి.


ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డు పడుతూ ఉంటుంది. సాధనతో ఈ మాయ అడ్డును తొలగించుకుంటే మనలోని సూర్య శక్తి మనల్ని తేజోవంతం చేస్తుంది.


అందుకే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే సూర్య ఆరాధన చేయమంటారు పండితులు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు