💥త్వమేవ శరణం మమ!

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥త్వమేవ శరణం మమ!


సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ

అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ॥

                                                    -భగవద్గీత.


"భగవద్గీత"లోని ఈ శ్లోకానికి "#చరమశ్లోకము"అని పేరు. ఈ శ్లోకంలో...

"శరణాగతుడైన జీవుడేమి చేయాలో " మొదటి చరణం తెల్పితే, రెండవ చరణంలో "భగవంతుడేమి చేస్తాడో" మనకు స్పష్టమవుతుంది. 


"సర్వ ధర్మాల్ని త్యజించి నన్నాశ్రయింపుము.

'అహం’ అంటే నేను- భగవానుడను, సర్వజ్ఞుడను. సర్వశక్తుడను అయిన నేను-

‘త్వా’- నిన్ను, అకించనుడవై, అనన్య గతికుడవై నన్నే ఉపాయంగా నమ్మి వున్న నిన్ను-

సమస్త పాపాలనుండి విముక్తుణ్ని చేయగలను" అని గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు అర్జునుని శోకం మాన్పుటకు ఈ ‘చరమ శ్లోకాన్ని’ ఉపదేశించాడు.


ఈ ఉపదేశం కేవలం అర్జునునికే కాదు, సమస్త మానవాళి కోసం శ్రీకృష్ణ పరమాత్మ అందించిన సందేశం.


ఆలోక్య సర్వ శాస్త్రాణీ విచార్యచ పునః పునః

ఇదామేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా!!


💥భావం:

సమస్తములైన శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చూడగా, నిరంతర "నారాయణ" ధ్యానమొక్కటే, సర్వదా, ధ్యేయంగా కనబడుతోంది.


శ్రీమన్నారాయణుడే రక్షకుడనీ, గతియని విశ్వసించి ఆయన చరణాలను ఆశ్రయించడమే...

"శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే".

కల్యాణ గుణ పూర్ణుడైన శ్రీమన్నారాయణుని చరణాలే శరణ్యం. 


ధ్యాయేన్నారాయణందేవం

స్నానాదిఘ చ కర్మసు,

ప్రాయశ్చిత్తం హి సర్వస్వ

దుష్కృత స్వేతివైశ్రుతిః!


💥భావం:

స్నానపానాది గల సమస్త కర్మలలో "నారాయణుని" స్మరించు కొన్నట్లయితే, సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి మంచి మార్గంలో పయనించడానికి వీలవుతుంది.


సంసార తాపత్రయాన్ని పోగొట్టే మూల మంత్రం "ఓం నమో నారాయణాయ" అదే "అష్టాక్షరీ" మంత్రం.


అష్టాక్షరిలోని ‘ప్రణవం’ అంటే ‘ఓం’కారం- స్వామిత్వాన్ని, ‘నమః’ అనే పదం ‘శరణ్యత్వాన్ని’, ‘నారాయణ’ పదం ప్రాప్యత్వాన్ని ప్రబోధిస్తున్నాయి.


అష్టాక్షరీ మంత్రాన్ని హృదయగతం చేసుకొని, అనునిత్యం అనుష్ఠించడం వల్ల సాలోక్య, సామీప్య, సారూప్యాది వైభోగాలను అనుభవించి, స్వామివారి విభూతిలో విలీనమవ్వడమే "సాయుజ్యం"


ఆమ్నా యాభ్య  సనాన్యారణ్య రుదితం వేదవ్రతా న్యవ్వహాం

మేద శ్ఛేద ఫలాని పూర్తవిధయస్సర్వే హుతం భస్మని

తీర్థా నామవగాహనాని చ గజస్నానం వినా యతృద

ద్వంద్వామ్భోరుహ సంస్మృతీర్విజయతేదేవస్స నారాయణః


💥భావం:

'శ్రీ మన్నారాయణుని’ స్మరించకుండా చేసిన వేదాభ్యాసం అరణ్యరోదన వంటిది.

ఎన్ని ధర్మ కార్యాలను చేసినా బూడిదలో పోసిన పన్నీరు వలె వ్యర్థమవుతుంది, ఎన్ని తీర్థ సేవనలు చేసినా గజస్నానమే అవుతుంది (వ్యర్ధమే)


శ్రీమన్నామ ప్రోచ్చ్యనారాయణాఖ్యం

కేన ప్రాపుర్వాం ఛితం పాపినోపి,

హనః పూర్వం వాక్రు వృత్తాన తస్మిన్

తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖమ్


💥భావం:

‘శ్రీమన్నారాయణ’ నామాన్ని ఉచ్చరించువాడు ఎంతటి పాపి అయినా, దైవ కృపతో మోక్షాన్ని పొందుతాడు. అంతటి పుణ్యకార్యాన్ని (నామస్మరణం) గత జన్మలో చేయకపోవడం వలెనే, ఇప్పుడు ‘ఈ దుఃఖభాజకమైన జన్మ’ కలిగింది.


"త్వమేవ శరణం మమ" అని త్రికరణ శుద్ధిగా ఆ పరబ్రహ్మకు తన్ను తాను సమర్పించుకొన్నవారే ముక్తికి యోగ్యులు! మహానందానికి పాత్రులు!!

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏