⚜️🕉️🚩ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

 ⚜️🕉️🚩ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏


💥"లక్షయతీతి లక్ష్మీః" అని లక్ష్మీ శబ్దానికి వ్యుత్పత్యర్థం. లక్షింపచేసేదేదో అది లక్ష్మి. జగజ్జనని లక్ష్మీదేవి ఎంత దారి చూపేదైనా ఆ మూలతత్త్వాన్ని అందుకొందామనే దీక్ష మనకి ఉండాలి.


సిద్ధ లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ!

శ్రీ లక్ష్మీ ద్వారలక్ష్మీ శ్చ ప్రసన్నా మమ సర్వదా!!


"చంద్రాం హిరణ్మరుూం" చంద్రుడిలా స్వచ్ఛమైనది, సౌమ్యమయినది, ఎటువంటి నామ రూప వాసనా మాలిన్యము లేనిది తల్లి.


ఆ తల్లి నా మనసులో ప్రవేశపెట్టి మహాలక్ష్మీదేవిని ఉపాసించేటట్లుచేయమని ప్రార్థిస్తున్నాం మనం.

ఎవరిని? అగ్నిదేవుణ్ణి.


అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రభోధినీమ్ |

శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీర్జుషతామ్ ||

                                               -శ్రీసూక్తం.


గుఱ్ఱాలు ముందుంటే, రథాలు మధ్యలో ఉంటే, ఏనుగులు ఘీంకారం చేస్తూ వాటి వెనకాల నడుస్తూ ఉంటాయి.


"ఇంద్రియాణి హయనాహః’’ - ఇంద్రియాలే అశ్వాలు.


'ఆశు గచ్ఛతీతి అశ్వః’

అతి వేగంగా పరుగెత్తేదేదో అది అశ్వం. అవి ఇంద్రియాలే. 


రథమంటే మన శరీరం. ‘శరీరం రథమేవాతు’ ఇంద్రియాలనే గుఱ్ఱాలీడ్చుకుపోతుంటే, ఇది కదిలి పోతుంది.


అందుకే వాటి వెనకాలే మధ్యలో ఉంటుంది శరీరం. ‘హస్తినాద ప్రబోధినీం’- ఆ శరీరం కన్నా వెనకాల ఉంది హస్తి అనగా ఏనుగు. ఏమిటది? మన అహంకారం. 


శరీరాన్ని మమకారంతో చూస్తోంది. దాని కంటె ముందున్న ఇంద్రియాలనే అశ్వాలు, దాన్ని ఈడ్చుకుపోయి విషయానుభవమిస్తున్నాయి, జీవుడికి. ఇది జీవుడికున్న సంసార బంధం.


అహంకారమనే ఏనుగు ఆక్రందన చేస్తుంటే, నాదా ప్రబోధినీం- దాన్ని ప్రజ్వలింపజేస్తుంది, మాయాశక్తి. అదే హరిణి- మనలను సంసారాభిముఖంగా హరిస్తుంది. 


అలా కాకుండా సాయుజ్యం వైపు తీసికెళ్లాలి. దీనికి ‘శ్రీ’ కావాలి. ఆ శ్రీదేవినే ‘ఉపహ్వయే’ మనలోకి ఆవాహనం చేసికోవాలి. శరీరమనే రథమధ్యస్థయగు లక్ష్మియే చైతన్యలక్ష్మి.


చెవులు మూసికొంటే వినపడు నాదమే హస్తినాదం. అదే వేణునాదం- వీణానాదం- వేదనాదం- శంఖ ధ్వని ఆ నాదము చేత నిరంతరం బోధింపబడుతున్న చైతన్యలక్ష్మిని ఆరాధిస్తే, పరమాత్మను చేరుకొనే సన్నిధి చూపిస్తుంది. 


ఈ ఆరాధనలో మానవులు తమ ఇంద్రియాలను తాను చెప్పినట్లు నడుచుకొనేటట్లు చేసికొని, మనస్సుని అదుపులో ఉంచుకొని..


తమ శరీర రూప రథముల్ని భగవంతుని వైపు త్రిప్పుకొని సన్మార్గంవైపు మరలి పవిత్రులవ్వాలని  హితవు చెప్తుంది వరలక్ష్మీదేవిగా పూజలందుకొంటున్న శ్రీమహాలక్ష్మి.


పుణ్యాత్ములైన దేవీభక్తులకు, క్రోధంగాని, మత్సరంగాని, లోభంగాని, మలినమైన మనస్సుగాని ఏ అవగుణాలూ ఏర్పడవు. భక్తి ఒక్కటే వాటన్నిటినీ దూరంగా పారద్రోలగలదు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏