💥పరమ శివుడు సర్వాంతర్యామి గదా, మరి ఆయనకు నంది వాహనమెందుకు?

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


💥పరమ శివుడు సర్వాంతర్యామి గదా, మరి ఆయనకు నంది వాహనమెందుకు?


పరమాత్మ తత్త్వానికి లింగము ఎలా చిహ్నమో, జీవ తత్త్వానికి నంది చిహ్నము.


పశుత్వముతో కూడిన జీవ తత్త్వము ప్రకృతి వైపున తన దృష్టిని తిప్పక, ఈశ్వరుని వైపు త్రిప్పటం చేత భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని పొందింది, నంది. 


నందికి ఈశ్వరునికి మధ్యలో, ఎవరూ అడ్డు తగల కూడదు. నంది ధర్మానికి ప్రతీక. నంది శృంగముల మధ్య నుండి ఈశ్వర లింగాన్ని దర్శించాలని చెప్తారు. 


పశుత్వము నుండి ధర్మాన్ని ఆచరిస్తూ దైవత్వాన్ని చింతించటం ద్వారా, నంది ఈశ్వరునిగా మారి, నందీశ్వరుడుగా ఏకమవుతాడు.


పశుతత్త్వాన్ని విసర్జించి దృష్టిని ఈశ్వరుని వైపు మరల్చి ధర్మ మార్గంలో నడవటం చేతనే నంది, నందీశ్వరుడుగా మారిపోయాడు.


💥నాలుగు పురుషార్థాలలో, అర్థ కామాల్ని ధర్మంతో అనుభవించాలని..

అప్పుడు మనిషి, పశుత్వం నుంచి విముక్తుడై, పశుపతి తత్త్వాన్ని అందుకోగలడని..

పాశుపతమైన ఈ దీక్ష ఉంటే, పశుపతి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని..


తనలో ఉండే పశు రాక్షస గుణాల్ని అణచుకొని మానవత్వాన్ని పెంపొందించుకుంటూ, మొలకెత్తుతున్న అంతర్లీన దైవ తత్త్వాన్ని ప్రజ్వలింప చేసుకుంటూ.. 


సర్వజనుల శ్రేయస్సుకి ఉపకరించే, కార్యములను స్వార్థ రహితంగా చేస్తూ, సర్వమానవ సౌభ్రాత్రతతో విశ్వ మానవ కల్యాణాన్ని వీక్షించాలి, అదే శివతత్త్వము, శివారాధన ఆంతర్యము.

సేకరణ... 💐🙏



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు