🌹॥ శ్రీ రాఘవేంద్ర అష్టకం ॥🌹

 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః🌹🙏


💥శ్రీ రాఘవేంద్ర తీర్థులు కలియుగ కల్పవృక్షం.


"మంత్రాలయం"లో వెలసిన శ్రీ రాఘవేంద్రతీర్థులు.

భక్త కోటికి కష్టాలు కడ తేరుస్తూ మంత్రాలయం మహర్షిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. 


మంత్రాలయ ఋషి రాఘవేంద్రులు...

మానవ కళ్యాణంకోసం వెలిసిన మహిమాన్విత మహనీయుడు "శ్రీరాయలు"

భక్తులు రాఘవేంద్రస్వామిని "శ్రీరాయలు" అని పిలుచుకుంటారు.


శ్రీరాఘవేంద్రులు జ్ఞాన సంపన్నుడు, సిద్ధ పురుషుడు.


స్వామి బృందావనం చేసిన "మంచాల" గ్రామం #మంత్రాలయం నేడు ఒక మహా పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది.

ఆనాటి నుంచి ఈ "బృందావనం" నుంచే స్వామి భక్తుల కోర్కెలు తీర్చుతూ రాఘవేంద్రస్వామిగా పూజలు అందుకుంటున్నాడు.

భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా, సాహితీవేత్తగా, మహిమలు చూపే మహనీయుడుగా పూజలు అందుకున్న రాఘవేంద్రులు భక్తుల హృదయాలలో కొలువై వున్నాడు


"మంత్రాలయం"లోని బృందావన సన్నిధానంలో భక్తులు పొందే శాంతి, సంతృప్తి మాటలకందనివి. 


అలజడి, అశాంతి, ఆందోళనలతో నిండిన నేటి నాగరిక సమాజానికి అటువంటి సత్పురుషుల సాహిత్యం, సాన్నిహిత్యం, సాన్నిధ్యం ఎంతో అవసరం.

అది నిరంతరం వెలిగే అఖండ జ్యోతి.


పూజ్యాయ రాఘవేంద్రాయ

సత్యధర్మ రతాయచ

భజతాం కల్పవృక్షాయ

నమతాం కామధేనవే 🌹🙏


🌹॥ శ్రీ రాఘవేంద్ర అష్టకం ॥🌹


జయ తుంగాతటవసతే వర మంత్రాలయమూర్తే |

కురు కరుణాం మయి భీతే పరిమళతతకీర్తే ||


తవ పాదార్చనసక్తే తవ నామామృత మత్తే

దిశదివ్యాం దృశమూర్తే తవ సంతత భక్తే ||


కృత గీతాసువివృత్తే కవిజన సంస్తుతవృత్తే |

కురు వసతిం మమ చిత్తే పరివృత భక్తార్తే ||


యోగీంద్రార్చితపాదే యోగిజనార్పితమోదే |

తిమ్మణ్ణాన్వయచంద్రే రమతాం మమ హృదయమ్ ||


తప్తసుకాంచనసదృశే దండకమండలహస్తే |

జపమాలావరభూషే రమతాం మమ హృదయమ్ ||


శ్రీరామార్పితచిత్తే కాషాయాంబరయుక్తే |

శ్రీతులసీమణిమాలే రమతాం మమ హృదయమ్ ||


మధ్వమునీడితతత్త్వం వ్యాఖ్యాంతం పరివారే |

ఈడేహం సతతం మే సంకట పరిహారమ్ ||


వైణికవంశోత్తంసం వరవిద్వన్మణిమాన్యమ్ |

వరదానే కల్పతరుం వందే గురురాజమ్ ||


సుశమీంద్రార్యకుమారై-ర్విద్యేంద్రైర్గురుభక్త్యా |

రచితా శ్రీగురుగాథా సజ్జన మోదకరీ ||


ఇతి శ్రీ సువిద్యేంద్రతీర్థ విరచిత శ్రీ రాఘవేంద్ర అష్టకమ్ ||

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏