⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏


💥చతుర్దశ భువనాలు శివమయ సంధానాలు, మంగళకరమగు శివ శబ్దము సకల చరాచర జీవకోటికి ఆధారము.


పరమేశ్వరుడు ఆది అంతాలు లేని సర్వవ్యాపనమైన చైతన్య శక్తి. అట్టి శక్తికి గుర్తు గుండ్రని రూపం. అందుకే శివుడిని లింగాకారంగా అర్చన చేస్తున్నాం.


ఆ లింగమే త్రికోటేశ్వరుడు. ఆయనే కోటప్ప. అంతటి మహోత్కృష్టమైన క్షేత్రమే త్రికూటాచలం. అదియే కోటప్పకొండ.


పవిత్రమైన చారిత్రక క్షేత్రాలలో కోటప్పకొండ ప్రసిద్ధమైన అతి ప్రాచీన శైవక్షేత్రం.


💥దక్షయజ్ఞ విధ్వంసానంతరం లయకారుడైన శంకరుడు

శాంతి వహించి యోగనిష్ఠతో 12 సం|| వటువుగా

దక్షిణామూర్తి అవతారంలో సకల దేవతలతో కూడి ఈ

త్రికూటాద్రిపై నివసిస్తూ..


మధ్యమ శిఖరమైన రుద్రశిఖరమున బిల్వవనాంతర్గత వటవృక్షము క్రింద బ్రహ్మాసన స్థితుడై, బ్రహ్మ విష్ణ్వాది సకల దేవతలకు, సనకసనందనాది పరమహంసలకు, నారదాది దేవర్షులకు వాలఖాల్యాదియోగ సిద్ధులకు, వశిష్ఠాది మహర్షులకు, మేధాది రాజవర్యులకు

బ్రహ్మొపదేశమిచ్చిన ప్రదేశము, దివ్యపుణ్యధామము

రుధ్రశిఖరము.


ఇచట మహాదేవుడు దక్షిణామూర్తి రూపంతో సమస్త దేవతలు సేవించి తరింప చిన్ముద్రధారుడై దర్శనమిచ్చెనని భక్తుల విశ్వాసం. 

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు