💥సంతాన రక్షణకు, సకల దోష నివారణకు.. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః 🌼🌸🙏

 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః🌹🙏


💥సంతాన రక్షణకు, సకల దోష నివారణకు.. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః 🌼🌸🙏


షడాననం చందనలేపితాంగం మహోరసం దివ్యమయూరవాహనమ్ |

రుద్రస్యసూనుం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ||


కుమారస్వామిగా, శివపార్వతుల పుత్రునిగా, కృత్తికా సూనునిగా, షణ్ముఖునిగా, మహాబలశాలిగా, నెమలి వాహనంగా, ధ్వజంగా కలిగినవానిగా ప్రత్యేకతలు పొందిన దైవం సుబ్రహ్మణ్యస్వామి.


శివ పరివారంలో దేవసేనకు నాయకునిగా వెలిగినవాడు. వల్లీ దేవసేనలకు భర్తగా పురాణ ప్రసిద్ధి గాంచినవాడు. 


మనకు ఏది కావాలంటే అది కలిగినవానిని ప్రార్థన చేయడం సహజం. ఈ దైవానికి అత్యంత అధిక బలం, రక్షించే శక్తి ఉన్నాయి. అందువల్ల మానసిక, శారీరక శక్తిని అత్యధికంగా ఇచ్చేవాడు సుబ్రహ్మణ్యుడు.


‘బ్రహ్మ’ శబ్దానికి ‘అధికంగా విస్తరించింది’ అని అర్థం. ‘ప్రకృతి’, ‘కాలం’ అనే అర్థాలూ ఉన్నాయి. వీటిని మనకు సరైన విధంగా అందించి సద్వినియోగం చేసుకునే అవకాశం కలిగించినవాడు ‘సుబ్రహ్మణ్యుడు’


విద్యుదయస్కాంత శక్తికి ప్రతీకాత్మక దైవమే మన సుబ్రహ్మణ్య స్వామి. ఆకాశం నుండి భూమిమీదకి వచ్చే కిరణాలన్నీ వంగి సర్పిలాకృతిగా వస్తుంటాయి. వాటికి సంకేతంగానే సుబ్రహ్మణ్య స్వామి సర్ప రూపాపాదనను చూడాలి.


కృత్తికా నక్షత్రాధిపతి అగ్ని అంశతో జన్మించాడనే భావంతో ‘కార్తికేయుడు’ (కృత్తిక కుమారుడు) అనే పేరు కూడా ఉంది.


కృత్తిక ఆరు నక్షత్రాలతో కూడుకుని ఉంటుంది కాబట్టి, ఇతడు షణ్మాతృకుడు. ఇవే ముఖాలుగా భావిస్తే ‘షణ్ముఖుడు’ అవుతున్నాడు.


సర్పాకృతితో కూడుకున్న వీర్య శోణితాలలో శక్తిని పెంచి సత్సంతానాన్ని అందించేవాడుగా సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.


భూగోళాన్ని రక్షిస్తూ, భూమికి ఎన్నో రూపాల్లో వినియోగపడుతున్న మహాబలవంతుడిగా ఈ దైవాన్ని జపించాలి.


మనలోని శారీరక మానసిక శక్తిని పెంచుకోవడానికి, సంతానరక్షణకు, వైజ్ఞానిక బలానికి, ప్రకృతి రక్షణకుకూడా ఈ స్వామి ఆరాధనవల్ల అతిగా మేలు చేకూరుతుంది. 


‘ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః’ అనే జపాన్ని మనం రోజూ 1 గంట చేసుకోగలిగితే, పైన చెప్పిన ఫలితాలు మన నిత్యజీవితంలో అనుభవంలోకి వస్తాయి. అన్ని రకాల దోషాలూ నివారితమై సంతోషం సిద్ధిస్తుంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం