💥ఈశ్వరుని రూపాలు...
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
💥ఈశ్వరుని రూపాలు...
శివున్ని సాధారణంగా లింగ రూపంలోనే కొలుస్తారు. అలాగని శివమూర్తులు లేవని కాదు. శివుడి లింగ రూప, విగ్రహా రూప విధానాలేమిటో చూద్దాం.
శివలింగాలు:
దైవికాలు:
దివ్యశక్తులున్నవి. కేదారినాథ్,. కాశీ, రామేశ్వర మొదలగు చోట్ల ఇవి ఉన్నాయి.
ఆర్షకాలు:
బుుషుల చే పూజింపబడేవి.
బాణాలు:
శివుడు బాణుడనే రాక్షసుడిని సంహరించగా అతని శరీర భాగాలు గంగ, నర్మదా మొదలగు నదులలో పడినవి. అవే శివలింగాలైనవి.
మానుషాలు : మానవులచే నిర్మించబడినది.
శివప్రతిమలు / విగ్రహాలు:
శివప్రతిమలు స్థానక (నిలుచున్న) భంగిమలోను, ఆసిన (కూర్చున్న), మరియు అనుగ్రహామూర్తి, సంహారమూర్తి మొదలగు భంగిమలలో కలవు.
స్థానక_శాంతమూర్తులు:
లింగోద్భవమూర్తి:
లింగం నుండి శివుడు జన్మించాడు. నాలుగు హస్తాలు, పైచేతులలో గొడ్డలి, జింక ఉంటాయి. మోకాలు క్రింది భాగం లింగం లో కలిసినట్టు ఉంటుంది.
చంద్రశేఖర మూర్తి:
శిరసుపై చంద్రుడు ఆభరణంగా ఉంటాడు. శివుడు ఒంటరిగా ఉంటే కేవల మూర్తి అని, పార్వతి తో ఉంటే ఉమామహేశ్వర మూర్తి అని అంటారు.
ఒక చేతిలో జింక, మరో చేతిలో గొడ్డలి లేదా ఢమరకం ఉంటాయి. క్రింది చేతులు అభయ, వరద (కోరికలు తీర్చే భంగిమ ) రూపంలో ఉంటాయి. జటామకుటంలో అర్ధ చంద్రుడు ఉంటాడు.
పాశుపత మూర్తి:
ఈ విగ్రహం చంద్రశేఖర మూర్తి లాగే ఉంటుంది. అయితే క్రింది చేతులలో త్రిశూలం, అక్ష మాల ఉంటాయి. నిత్య ఉత్సవాలకు ఈ పాశుపత మూర్తి విగ్రహాలను ఉపయోగిస్తారు.
ఆసీనమూర్తులు
సుఖాసీన మూర్తి:
భద్రపీఠంపై ఎడమ కాలు ఉంచి సుఖంగా కూర్చున్నట్లు ఉంటుంది. పై చేతులలో పరుశువు, మృగం ఉంటాయి.
ఉమాసహితమూర్తి:
సుఖాసీనుడైన శివునికి ఎడమవైపున పార్వతి కూర్చుని ఉంటుంది. శ్రీవారికి రెండు చేతులుంటాయి. ఒక చేతిలో ఉత్పల పుష్పం మరో చేయి సింహ కర్ణ పద్ధతిలో ఉంటుంది. శివుడు వృషభం వాహనంగా ఉంటాడు. ఈ రూపాన్నే వృషభారూఢ ఉమా సహిత మూర్తి అని అంటారు.
సోమ స్కంద మూర్తి :
ఇది అతి ప్రాచీనరూపం.పీఠంపై కూర్చుని ఉన్న శివపార్వతుల మధ్య స్కంద / కుమారస్వామి ఉంటాడు. కుమారస్వామి ఒక పక్క కూర్చుని లేదా నిలబడి లేదా పార్వతి తొడపై కూర్చుని ఉంటాడు.
ఉమామహేశ్వర మూర్తి :
ఈ విగ్రహం పై దాని లాగే ఉంటుంది. కాకపోతే కుమార స్వామితో పాటు గణపతి కూడా ఉంటాడు.
అనుగ్రహామూర్తులు:
చండీశానుగ్రహ మూర్తి:
చండిసుని అనుగ్రహిస్తున్న రూపం ఇది. ఆసీనులై శివపార్వతులుంటారు. శివుడి కుడిచేయి వరద ముద్రలోనూ ఎడమ చేయి చండీసుని తలను పట్టుకొని పూలమాల వేస్తున్నట్లు ఉంటుంది.
విష్ణు అనుగ్రహమూర్తి:
విష్ణు భగవానుడు శివుడి వద్ద నుండి సుదర్శన చక్రాన్ని పొందినాడు. విష్ణువు శివుడి వద్ద నుండి చక్రం పొందుతున్నట్లుగా ఈ రూపం ఉంటుంది.
నందీశానుగ్రహమూర్తి:
శివవాహనమైన నందికి మరణం తనకు వస్తుందని తెలుస్తుంది. అపుడు నంది తనకు శివుని సేవచేసుకొనే భాగ్యం కల్గించాలని కోరుకొన్నాడట. శివుడు నందికి శాశ్వత జీవితం ను ప్రసాదించాడు. నంది శివపార్వతుల వద్ద నుండి ఆశీర్వాదం పొందుతున్నట్లుగా ఈ విగ్రహం ఉంటుంది.
విఘ్నేశ్వరానుగ్రహమూర్తి:
వినాయయకుడికి ఏనుగు తల అమర్చిన తరువాత శివపార్వతుల నుండి ఆశీర్వాదం పొందుతున్నట్లుగా ఈ రూపం ఉంటుంది.
కిరాతార్జున మూర్తి:
శివుడు అర్జునినికి పశుపతాస్త్రం ప్రసాదించునట్లుగా ఈ విగ్రహం ఉంటుంది. శివుడి నాలుగు చేతులలో, పై చేతులలో మామూలు ఆయుధాలు క్రింది ఎడమ చేతిలో ధనస్సు కలిగి ఉంటాడు. పార్వతి దేవి కూడా ఉంటుంది. అర్జునుడు వీరి ఎదురుగా తపస్సు చేస్తూ ఉంటాడు.
రావణానుగ్రహమూర్తి:
రావణుడు కైలాసాన్ని కదిలించబోగా పార్వతి భయపడి శివుడిని కౌగలించుకొని పడిపోకుండా పట్టుకొమ్మని కోరింది. శివుడు కైలాసాన్ని కుడికాలితో తోక్కి పట్టగా రావణుడు పర్వతం క్రింద చిక్కాడు. రావణుడపుడు శివుడిని తన సామగానంతో పరవశింపచేశాడు. శివుడు ఆనందించి రావణుడిని ఆశీర్వదించాడు. శివపార్వతులున్న పర్వతం క్రింద రావణుడు పది తలలు ఇరవై చేతులు కలిగి ఉంటాడు. ఒక చేతిలో వీణ ఉంటుంది. శివుడి చుట్టూ భూతగణం ఉంటుంది.
#సంహరమూర్తులు:
కామాంతక మూర్తి:
శివుని తపస్సును మన్మధుడు భంగం చేయ ప్రయత్నిస్తే శివుడి మూడవ నేత్రం తో తీక్షణ చూపుతో మన్మధుని భస్మం చేసే రూపు ఇది. తీక్షణ చూపులతో శిరసుపై జటా మకుటంతో నాలుగు చేతులలో అక్ష మాల మొదలగునవి ఉంటాయి.
గజసంహరమూర్తి:
ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడనే రాక్షస సంహార రూపం ఇది. శివుడు నాట్య భంగిమలో ఉంటాడు. ఒక చేతిలో ఏనుగు దంతం ఉంటుంది. కపాలం, ఘంట ఇతర చేతులలో ఉంటాయి.
కాలారి మూర్తి:
తన భక్తుడైన మార్కేండేయుని సంహరించడానికి వచ్చిన యముడిని లింగం నుండి ఉద్భవించిన శివుడు కుడి కాలిని లింగం పై ఉంచి ఎడమ కాలు యముడి హృదయం పై ఉంటుంది. తీక్షణమైన చూపుతో వెనుక చేతిలో ఉన్న త్రిశూలం యముడికి గురి పెట్టబడి ఉంటుంది. పై ఇంకో చేతిలో గొడ్డలి ఉంటుంది. త్రినేత్రాలు కలిగి ఉంటాడు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment