💥లోకబాంధవుడు దివాకరుడు
⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🌹🙏
💥లోకబాంధవుడు దివాకరుడు
దేవతలు, మానవులే కాదు.. రాముడు, కృష్ణుడు లాంటి అవతార పురుషులూ ఆయనను అర్చించారని ఐతిహ్యం.
శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయస్తోత్ర పఠనంతోనే లంకేశ్వరుడిపై విజయం సాధించాడని, హనుమ సూర్యోపాసన ద్వారానే సర్వవిద్యలు అభ్యసించినట్లు పురాణ కథనం.
శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు సూర్యారాధనతో కుష్టువ్యాధి నుంచి విముక్తుడయ్యాడట. ధర్మరాజు వనవాస కాలంలో సూర్యారాధనతోనే ‘అక్షయ పాత్ర’ను పొంది ఆకలిదప్పులను జయించగలిగాడు. దివాకరుడిని ప్రసన్నం చేసుకునే సత్రాజిత్ ‘శ్యమంత కమణి’ని పొందాడు.
మానవ మనుగడకు ప్రధానమైన ఆహార, ఆరోగ్యప్రదాత సూర్యభగవానుడే.
‘సర్వం సూర్యమయం జగత్..’ అన్నట్లు సకల జగత్తు ఆయన తేజస్సుతో చైతన్యం పొందుతోంది. సమస్త ప్రాణకోటి ఆయనపైనే ఆధారపడి ఉంది.
‘నమస్కార ప్రియోభానుః’ అని ఆర్యోక్తి. కేవలం వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసా దించే ప్రత్యక్ష భగవానుడు సూర్యదేవుడు.
యోగ్యత, అయోగ్యలతో నిమిత్తం లేకుండా సర్వ జీవకోటికి సమానంగా వెలుగులు (కాంతులు) పంచే భగ వానుడు.
సృష్టి స్థితి లయలు సూర్యుని ప్రమేయంతోనే జరుగుతున్నాయని..
(సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితానిచ/సూర్యే లయం ప్రాప్నువంతి య సూర్యః సోహ మేవచ)
‘సూర్యోపనిషత్తు’ పేర్కొంది.
సూర్యభగవానుడికి, సముద్రుడికి, మట్టికి (భూమికి) గల స్నేహం, బాంధవ్యం వర్షం, పంటల రూపంలో లోకాన్ని ఆదుకుంటోంది.
తన కిరణాలతో నీటిని గ్రహించి వర్షరూపంలో ధరణిని సస్యశ్యామలం చేస్తున్నాడు. తినే మెతుకుపై వారి వారి పేర్లుంటా యన్నది ఎంత నిజమో, పండే ప్రతి గింజ సూర్య భగవానుడి దయాపాత్రమనడం అంతే నిజమంటారు విజ్ఞులు.
ఆయనకు గల అనేక పేర్లలో ‘మిత్రుడు’ అనేది సార్థకమైనది. సమస్త లోకాలకు కర్మసాక్షిగా అనంతమైన శక్తికిరణాలతో వెలుగును, తేజస్సును ప్రసాదిస్తున్న ఆదిత్యుడు ఆదితి కశ్యప ప్రజాపతి కుమారుడిగా విశాఖ నక్షత్రంలో ఉద్భవించినట్లు బ్రహ్మాండ పురాణ కథనం.
‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ (ఆరోగ్యం కోసం భాస్కరుని ఆరాధించాలి) అంటారు. సూర్యారాధన సర్వరోగాలను హరించి ఆరోగ్యాన్ని, బలాన్ని, తేజస్సును ప్రసాదిస్తుంది. ఆయన ఔషధరూపుడని, ఆయన కిరాణాల వల్ల ఎన్నో వ్యాధులు తొలగి పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఉదయాస్తమయ వేళల్లోని సూర్యకిరణాలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.
సూర్యభగవానుడు సమత్వానికి, చైతన్యానికి, క్రమశిక్షణకు ప్రతీక. తరతమ భేదాలు, పాప పుణ్యాలతో నిమిత్తం లేకుండా అందరికి వెలుగు నిస్తాడు.
ఆయన ఉదయాస్తమానాలు క్రమశిక్షణకు నిదర్శనం. కాలానికి ఆదిత్యుడే కొలమానం. సమస్త జీవరాశికి ఆధారభూతుడు. కాలం ఎవరి కోసం ఆగదని నిరూపిస్తూ సాగుతాడు.
లోకబాంధవుడు సూర్యుడు ఎవరి ప్రభావం లేకుండానే ఉదయిస్తూ, ఆరోగ్యభాగ్యాన్ని ప్రసాదిస్తూ తన పని చేసుకుంటూ పోతాడు. ఎప్పటిపనులు అప్పుడు చేయాలన్న సందేశం ఆయన గమనంలో కనిపిస్తుంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment