💥శివుడు అర్థమైతే సత్యం అర్థమవుతుంది..

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


💥శివుడు అర్థమైతే సత్యం అర్థమవుతుంది..


గుణ, రూప, రస, గంధ, స్పర్శాత్మక మైన సమస్తమూ రుద్రుని సృష్టి. బ్రహ్మాదులందరూ అమృత రూపుడిగా ఆరాధించే ఆ పరమేశ్వరుడు అచలుడు. ఆనంద మూర్తి. ఆదిత్య వర్ణుడు, సర్వాధిపతి, తిమిరాతీతుడు. సర్వుడు.


ఇట్టి పరమేశ్వరుని కన్న పెద్ద గానీ – చిన్న గానీ – సాటి గానీ ఎవరూ లేరు. సర్వ ప్రాణుల యందు – అణువణువు నందు నిండిన స్వయం ప్రకాశక సదానంద మూర్తి.


మోక్షార్ధి అయిన వాడు ఆశ్రయించ దగ్గ ఏకైక విరాడ్రూపుడు ఆ పరమేశ్వరుడొక్కడే! శివ తత్వ జిజ్ఞాసువులకు సైతం అందినట్టే అంది, అగోచరమయ్యే మహా మూర్తి మంతమైన తత్వం ఆయనది. అట్టి శివ తత్వం లోని కొన్ని విషయాలని పరిశీలిద్దాం.


1. జ్యోతిర్లింగాలు:

శివుడిని 12 జ్యోతిర్లింగ రూపాలలో వున్నాడని నమ్మి కొలుస్తారు. జ్యోతిర్లింగ అంటే చీకటిని (అజ్ఞానాన్ని) చీల్చి వెలుగు…( జ్ఞానాన్ని) ప్రసాదించేది.


2. లింగాకారం:

శివ లింగం పైకి లింగం కింద పానవట్టం యోని రూపంలో వుంటుంది. అది స్త్రీ పురుషుల ప్రతీక. ఒకటి లేనిది ఇంకొకటి లేదు.అవినాభావ సంబంధం.


3. ప్రళయం:

శివుడ్ని ప్రళయ కారకుడు గా నమ్ముతారు. ప్రళయ కారకుడని తెలుసుకుని ఏమిటి ప్రయోజనం?


శివుడు మూడు ప్రళయములకు కారణం.

1) రాత్రి నిద్ర: అన్ని ప్రాపంచిక మాయల నుండి మరపు నిచ్చేది.

2) శారీరక మరణం: స్థూల (అంగ శరీరం) , సూక్ష్మ ( మనసు), కారణ ( అజ్ఞానం) శరీరాల నుంచి విముక్తి కలుగచేసేది.

3) మహాప్రళయం: సమస్తం శివుని లో కలిసిపోవడం. 

అంతరార్ధం: ఈ మూడు శరీరాలు మాయకల్పితం, అశాశ్వతం కావటం వలన, శివుడు వాటినుంచి విముక్తి కల్పించడం.


4. శివ, విష్ణు, బ్రహ్మ:

శివుడి నించి విష్ణువు, విష్ణువు నించి బ్రహ్మ ఆవిర్భవించారంటారు. బ్రహ్మ సృష్టిస్తే, విష్ణువు నడిపించడం, శివుడు అంతం చేయటం అనేవి లోకోక్తి. అంతరార్ధం: సృష్టి, స్థితి,లయ ఒకచోట నుంచి రావటం, మరలా అందులోకి పోవటం.


5. మరణం ఒక వేడుక:

వారణాసిలో ఘాట్లను చూస్తే, ప్రపంచంలో అదొక్కటే స్థలంలో జీవిత చక్రంలోని అన్ని దశలు : జన్మ , పెరగటం, మరణం అన్నీ నది ఒక చివరనుంచి ఇంకో చివరలోపు కనిపిస్తాయి.

ఉజ్జయినీ లో శివునికి జరిగే భస్మ హరతికి.. ముందు రోజు ఖననం చేసిన శరీర భస్మాన్ని తెచ్చి వాడతారు. శివుడు తన శరీరమంతా భస్మాన్ని అలుముకుంటాడు.


6. పంచభూత లింగాలు:

దక్షిణ భారతంలోనున్న పంచ భూత లింగాలు (అగ్ని, వాయు, భూమి, ఆకాశం, జలం) ఆ అద్వితీయ శక్తి అన్ని ధాతువులలో, భూతాలలో ఉందని రుజువు చేస్తాయి. శివం కానిదింకేమైనా ఉందా ? 


7. శక్తి సూత్రం:

శక్తి ఒక రూపంనుంచి ఇంకో రూపానికి మారవచ్చు కానీ శక్తి తయారు కాబడదు. నాశనం కాబడదు. అద్వైతాన్ని ఇంతకంటే స్పష్టంగా సరళంగా చెప్పగలమా? ఒక జీవి, చెట్టు, రాయి, జాలం లోని ఆ పరబ్రహ్మం ఒకటే. పై తొడుగులు వేరు, అశాశ్వతం. 


8. రుద్రం:

శివుని పూజించే పద్దతులలో రుద్రం మొదటిది. రుద్రంలో ఏం వుంది ? మహాన్యాసం, నమకం, చమకం. 


మహాన్యాసం అంటే: చేసేది శివుడే, నీవు శివుడవేనని నిర్ధారణ చేస్తుంది. ఆ తరవాతే మిగతావన్నీ.

చమకంలో ఏం వుంది? సమస్తమూ శివమే — దొంగ, నురుగు, జీవులు అంతా (అద్వైతం)


9. శివుని ధ్యానముద్ర:

నీ నిజస్థితి తెలుసుకోవటానికి సాధనం — శ్రవణ, మనన, నిధి, ధ్యాసాలు (ధ్యానం) 


10. అద్వైతం:

అద్వైతం తెలిపిన శంకరుల పేరు శివుని పేరు కావడం యాదృచ్చికమా ? జన్మ, స్థితి, మరణం - ఈ చక్రం మాయలో భాగం, అసత్యం. ఉన్నదొక్క బ్రహ్మమేనన్నదే సత్యం. తత్వమసి, శివోహం, అహం బ్రహ్మాస్మి అనే తత్వ వాక్యాలు చెప్పే సత్యం ఇదే.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు