💥 ఈరోజు (6/1/2024) 21వ పాశురం (21 వ పాట):

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


సంసార దు:ఖములను అనుభవించుచున్న జీవులపై దయతో శ్రీమన్నారాయుణుడు అమ్మవారికి (లక్ష్మి) జీవులు ముక్తిని పొందు సులభోపాయములను మూడింటిని ఉపదేశించెను.

అవి శ్రీహరి నామసంకీర్తనము, శరణాగతి, పుష్పార్చన. 


ఈ మార్గములను బోధించి జీవులను తరింప చేయదలచిన అమ్మవారు శ్రీ విష్ణుచిత్తులకు తులసీ వనమున లభించినది.

శ్రీవిష్ణుచిత్తులు ఈమెకు "గోదా" అని నామకరణం చేసిరి. 


యుక్త వయస్సు రాగానే గోదాదేవి శ్రీవటపత్ర శాయిని భర్తగా పొందదలచి, అట్లు పొందుటకు పూర్వము గోపికలు వ్రతమును ఆచరించిరని విని తానావ్రతమును అనుకరించి ఒక వ్రతము చేయదలచి 30 పాశురముల రూపంలో వ్రతమును రచించెను. దాని పేరే ‘తిరుప్పావై’


ఈ తిరుప్పావు మూడు భాగములుగా పేర్కొనెదరు.

మొదటి 5 పాశురములు ఉపోద్ఘాతము.

తరువాతి పాశురములలో నందగోపుని భవన పాలకుని, ద్వారపాలకుని, మేల్కొలిపి లోనికి వెళ్ళి నందుని, యశోదను, శ్రీకృష్ణభగవానుని, బలరాముని మేల్కొలుపుట, తరువాత నీలాదేవిని మేల్కొలుపుట, 


తరువాత శ్రీకృష్ణుని నీలాదేవిని ఇరువురిని మేల్కొలుపుట, శ్రీకృష్ణ భగవానుని సభాస్థలిలో వేంచేసి సింహాసనాసీనుని కమ్మని ప్రార్థించుట, స్వామి వేంచేయగానే మంగళాశాసనము చేయుట,


తరువాత తాము వచ్చిన పనిని నివేదించి తమకు సర్వ కాల సర్వావస్థల యందు కైంకర్య మును చేయు భాగ్యమును ప్రసాదించ మని ప్రార్థించుట-

ఇది "తిరుప్పావై" సారము.


💥 ఈరోజు (6/1/2024) 21వ పాశురం (21 వ పాట):


పాశురము – 21


ఏట్రకలంగ ళెదిరిపొంగి మీదళిప్ప


మాట్రాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కల్


ఆట్ర ప్పడైత్తాన్ మగనే ! యరివురాయ్


ఊట్రముడై యాయ్ ! పెరియాయ్ ! ఉలగినిల్


తోట్రమాయ్ నిన్ర శుడరే ! తుయిలెళాయ్


మాట్రారునక్కు వలితులైన్దు ఉన్ వా శర్కణ్


ఆట్రాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే


పోట్రియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలోరెమ్బావాయ్


ఆవుల పాలు ధారగా కారేనోయి

కుండలు నిండి పాలు పొంగెనోయి

గోవులగుంపుల గోపాలనందనోయి

నీవు సత్యమైన పరమాత్మ వోయి

నిను కోరువారిని రక్షించుదు వోయి

 లోకాలకు జ్యోతి స్వరూపుడవోయి

మహామహిమాల సంపన్నుడవోయి

నిదుర నుండి నీవు మేల్కొనవోయి

శత్రువులు నీపాదదాసు లయిరోయి

నీ పాదపద్మాలు వీడుండ లేమోయి

నీ పాదాలు కీర్తించ వచ్చితి మోయి

మంగళాశాసనములు చేతుమోయి


భావం:


పాలను పిడుకుటకై పొదుగల క్రింద ఎన్ని భాండములుంచినను అవన్నియు పొంగి పొరలి పోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద గల్గిన శ్రీ నందగోపుని కుమారుడవైన ఓ శ్రీకృష్ణా! మేల్కొని మమ్ము కనరా వయ్యా! అప్రతిహత ధైర్య సాహసములను కల్గియును ఆశ్రితపక్షపాతివై, సర్వులకును ఆత్మ స్వరూపుడవైన నీవు యీ భూలోకమునందు అవతరించిన ఉజ్జ్వల రత్న దీపమా! వేద ప్రమాణ ప్రసిద్ధుడా! ఆ వేదము చేతనైనను ఎరుక పడనంతటి మహా మహిమాన్వితుడా! ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము. శత్రువులెల్లరు నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి, నీవాకిట నిల్చి, నన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరమూ అనన్య ప్రయోజనులమై ‘నీవే తప్ప ఇతః పరంబెరుగ’మని నీ పాదానుదాసులమై వచ్చితిమి. నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కల్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము. నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళా శాసనము చేయ నిల్చినాము స్వామీ! నిన్నాశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొనుస్వామీ! లేచి రావయ్యా! అని వేడుకొంటున్నారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏