🌺🔱శ్రీ శివ మంగళాష్టకం🔱🌺

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱

🏵️🌼🏵️🌼🏵️


కార్తీకం సర్వ మంగళకర మాసం.

భక్త జనకోటికి శుభకరం. హరిహరాదులకు ప్రీతిపాత్రం. 

మానవాళికి కొంగుబంగారం.


ఈ మాసంలో చేసే స్నానం అత్యంత ఆరోగ్యప్రదం.

ఇచ్చే దానం పుణ్య ఫలప్రదం.

చేసే జపం మనో నైర్మల్యకారకం. వ్రతం సంపత్కరం.

ఈ మాసంలో వెలిగించే దీపం శుభకరం.


స్థితి లయకారులైన లక్ష్మీపతి.. గౌరిపతులు ఏకోన్ముఖులై జీవజాలాన్ని ఆదుకునే గొప్ప సమయం.


💥"శ్రీ శివ మంగళాష్టకం" శుభప్రదమైన ప్రార్థన.

రోజూ మంగళాష్టకం పాడి శివుని స్తుతించే వారికి

మృత్యుభయం ఉండదు, రోగ భయం ఉండదు.


🌺🔱శ్రీ శివ మంగళాష్టకం🔱🌺


భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే ।

కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ॥ 1 ॥


వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ ।

పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ ॥ 2 ॥


భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే ।

రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ ॥ 3 ॥


సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే ।

సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ ॥ 4 ॥


మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే ।

త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ ॥ 5 ॥


గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ।

ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ ॥ 6 ॥


సద్యోజాతాయ శర్వాయ భవ్య జ్ఞానప్రదాయినే ।

ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్ ॥ 7 ॥


సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ ।

అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ ॥ 8 ॥


మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ ।

సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ ॥ 9 ॥

సేకరణ... 💐

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు