యాజ్ఞవల్క్య మహర్షి జయంతి

 ⚜️🕉️🚩ఓం శ్రీ యాజ్ఞవల్క్య గురుభ్యో నమః🌹🙏


💥మనకు మార్గనిర్దేశం చేసేదీ మహానుభావులుగా

తీర్చిదిద్దేదీ గురువర్యులే.

ఉలి లాంటి పలుకులతో శిలలను శిల్పాలుగా చెక్కే అధ్యాపకులే లేకుంటే బండరాళ్లలా మిగిలిపోమా? జ్ఞానబోధకులే లేకుంటే అంధకారంలో అలమటించమా! 


💥కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసాలకు పెట్టింది పేరు.. ఈ మూడు ఉంటే సామాన్యుడు కూడా ఎంతో ఉత్తముడిగా ఎదిగి తీరుతాడని నిరూపించిన "యాజ్ఞవల్క్య మహర్షి" జయంతి నేడు.


|| గురు ప్రార్థన ||


ఓం వందేఽహం మంగళాత్మానం భాస్వంతంవేదవిగ్రహమ్ |

యజ్ఞవల్క్యం మునిశ్రేష్ఠం జిష్ణుం హరిహర ప్రభుమ్ || 


జితేంద్రియం జితక్రోధం సదాధ్యానపరాయణమ్ | ఆనందనిలయం వందే యోగానంద మునీశ్వరమ్ || 


ఏవం ద్వాదశ నామాని త్రిసంధ్యా యః పఠేన్నరః |

యోగీశ్వర ప్రసాదేన విద్యావాన్ ధనవాన్ భవేత్ ||


ఓం శ్రీ యాజ్ఞవల్క్య గురుభ్యో నమః |

కణ్వకాత్యాయనాది మహర్షిభ్యో నమః ||


💥"యాజ్ఞవల్క్య మహర్షి" మహర్షులలో విలక్షణుడు.

గురువైన వైశంపాయనుడికి శాపవిమోచనం చేసిన తాపసి.


ఋషులలో ఆగ్రగణ్యుడై, నేటి న్యాయ శాస్త్రానికి మూలమైన అద్భుత "యాజ్ఞవల్క్య సృతి"ని మనకు అందించిన మహనీయుడు.


కర్మ జ్ఞాన మార్గాలే మోక్షానికి దారి అని తెలియపరిచినవాడు యాజ్ఞవల్క్యడు.

సప్తర్షుల సన్మానాన్ని అందుకున్న యోగీంద్రుడు. 


సమస్త విద్యలూ అభ్యసించి, నాలుగు వేదాలూ నేర్చుకొని విద్యానిధియై మహారుషులచేత యోగీంద్ర పట్టాభిషేకం జరిపించుకున్న పరమయోగీశ్వరుడు యాజ్ఞవల్క్యడు.


ఈయన తల్లితండ్రులు సునంద, యజ్ఞవల్క్యుడు.

ఈ మహర్షి బాష్కలుని దగ్గర ఋగ్వేదం, జైమిని మహర్షి దగ్గర సామవేదం, తరుణి దగ్గర అధర్వణవేదం అభ్యసించాడు.


తర్వాత వైశంపాయనుడి శిష్యుడై యజుర్వేదం అధ్యయనం చేశాడు.


💥గురువును మించిన శిష్యుడు.. 


వైశంపాయనుడు తనకు చుట్టుకున్న బ్రహ్మహత్యాదోషం నుండి బయటపడే మార్గం సూచించమని శిష్యులను అడుగుతాడు.


అందుకు నేనొక్కడినే సమర్ధుడునని యాజ్ఞవల్క్యడు చెప్పగానే ఆగ్రహించిన గురువు నేను నేర్పిన విద్యను తిరిగి ఇచ్చేయవలసిందిగా ఆదేశిస్తాడు. 


యాజ్ఞవల్క్యడు గురువును మన్నించమని కోరి తన తపశ్శక్తితో వైశంపాయనుడి బ్రహ్మహత్యా దోషం తొలగిస్తాడు.


అంతేకాకుండా గురువు నేర్పిన విద్యను రుధి రూపంలో విడచి వెళ్ళిపోతాడు.

ఆ పదార్ధాన్ని తిత్తిరి పక్షులు తింటాయి.

వాటి పలుకులే "#తైత్తిరీయ_ఉపనిషత్తు"గా రూపుదాల్చింది.


తర్వాత యాజ్ఞవల్క్యడు సూర్యభగవానుని ఆరాధించి, శుక్ల యజుర్వేదం నేర్చుకొని గురువుని మించిన శిష్యుడయ్యాడు.

సరస్వతీ దేవిని ఉపాసించి సమస్త విద్యలు అభ్యసించాడు.


కతుడను మహర్షి కుమార్తె "కాత్యాయని"ని.. గార్గి శిష్యురాలైన "మైత్రేయి"ని వివాహం చేసుకున్నాడు.

వీరికి చంద్రకాంతుడు, మహామేఘుడు, విజయుడను కుమరులు జన్మించారు.


💥మహతపస్వి.. 


జనక మహారాజు ఒక యాగం చేస్తాడు.

యాగానంతరం ఋషులలో గొప్పవారు ఎవరో వారు మాత్రమే ధన రాసులతో కూడిన తాంబూలం స్వీకరించేందుకు ముందుకు రావాలని కోరారు. 


అక్కడున్న వారెవరూ ముందుకు రారు. దాంతో యాజ్ఞవల్క్యడు తన శిష్యులను తాంబూలం తీసుకొమ్మని ఆజ్ఞాపిస్తాడు.

యాజ్ఞవల్క్యని తరపున ఆయన శిష్యులు తాంబూలం స్వీకరిస్తారు.


జనకునిచే అందరికన్నా గొప్పవాడిగా పూజలందుకున్న యాజ్ఞవల్క్యడు ఆయనకు బోధచేశాడు.


విశ్వావసుడనే గంధర్వుడు సైతం యాజ్ఞవల్క్యని దగ్గరకు వచ్చి తత్త్వోపదేశం పొందుతాడు.


న్యాయశాస్త్రానికి ఆధారమైన ధర్మసూక్ష్మములను ఈనాటి సమాజానికి, న్యాయ వ్యవస్థకు ఉపయోగపడేలా ఆయన చేసిన రచన "యాజ్ఞవల్క్య స్మృతి"గా ప్రసిద్ధి చెందినది.


యాజ్ఞవల్క్య స్మృతిలో లోక వ్యవహారంలో అవసరమయ్యే మెళకువలన్నీ వివరంగా నిర్వచించాడు. న్యాయ పరిష్కర్తగా నిలిచాడు.


ఆచారధ్యాయం, వ్యవహారాధ్యయం, ప్రాయశ్చిత్తాధ్యాయం అనే మూడు అధ్యాయాలలో సమస్త విషయ చర్చతో కూడిన సామాజిక వ్యవస్థను అవిష్కృతం చేసింది యాజ్ఞవల్క్యడు స్మృతి. 


ఈ మహర్షి మహా యోగీశ్వరులకే అద్భుతంగా వివరించిన యోగ ప్రవచనం యోగయాజ్గ్న వల్క్యం. 


యోగశాస్త్రం పేరిట ప్రచారం వ్యవస్థకు నిర్వచనం చెప్పిన న్యాయమూర్తి, మహర్షి, మహాతత్త్వవేత్త.


యాజ్ఞవల్క్య ఋషి ప్రాతఃస్మరణీయుడు.

అతనీ జయంతి రోజున అతనీని ఆరాధిస్తే జ్ఞానసంపత్తి కలుగుతుంది. ఆయన చరితం ఆదర్శపథం, అనుచరణ యోగ్యం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు