రామ కోదండ రామ రామ కల్యాణ రామ
⚜️🕉️🚩శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏
💥రామ కోదండ రామ రామ కల్యాణ రామ..
వాల్మికి మహర్షి రామాయణాన్ని సంస్కృతంలో 24,000 శ్లోకాలలో వ్రాసారు. అలానే, శ్రీరాముని కీర్తిస్తో త్యాగరాజు గారు, మన తెలుగులో, 24,000 కృతులను వ్రాసారట!
అందులోనుంచి మనకు కూడా అర్ధమయ్యే తెలుగు పదాలలో వ్రాయబడిన, తేలికైన ఒక ఆణిముత్యం:
ప. రామ కోదండ రామ రామ కల్యాణ రామ
చ1. రామ సీతా పతి రామ నీవే గతి
రామ నీకు మ్రొక్కితి రామ నీ చే జిక్కితి (రా)
చ2. రామ నీకెవరు జోడు రామ క్రీ-కంట జూడు
రామ నేను నీవాడు రామ నాతో మాటాడు (రా)
చ3. రామ నామమే మేలు రామ చింతనే చాలు
రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు (రా)
చ4. రామ నీకొక మాట రామ నాకొక మూట
రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట (రా)
చ5. రామ నేనెందైనను రామ వేరెంచ లేను
రామయెన్నడైనను రామ బాయక లేను (రా)
చ6. రామ విరాజ రాజ రామ ముఖ జిత రాజ
రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ (రా)
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment