💥కార్తీక పౌర్ణమి
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
💥కార్తీక పౌర్ణమి
స్థితి లయకారులైన లక్ష్మీపతి.. గౌరిపతులు ఏకోన్ముఖులై జీవజాలాన్ని ఆదుకునే గొప్ప సమయం "కార్తీక మాసం"
కార్తీక మాసం సర్వ పాపాలను కడిగేస్తుంది.
సకల శుభాలను కలిగిస్తుంది.
ఈ నెలలో ప్రతి రోజూ ప్రత్యేకమైనదే!
"కార్తీక పౌర్ణమి" అత్యంత విశిష్టమైనదని శాస్త్ర వచనం.
పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి. అలాగే విష్ణుమూర్తికి కూడా ఈ రోజు ఇష్టమైనదని భావిస్తారు.
ఈ పౌర్ణమినాడే పరమేశ్వరుడు త్రిపురాసురులను సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే దీనిని "#త్రిపురపౌర్ణమి" అంటారు.
దీనినే "#కైశికపౌర్ణమి" అని కూడా అంటారు.
💥"ఏకస్సర్వదానాని దీపదానం తథైకత" అని శాస్త్ర వచనం.
అంటే అన్ని దానాలు ఒక ఎత్తు దీపదానం ఒక ఎత్తు అని.
దీపదానం చేసేవారు స్వయంగా వత్తులను తయారు చేసుకోవాలని సూచించారు పెద్దలు.
వరిపిండి, గోధుమపిండితో ప్రమిదను తయారు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి.
దీపాన్ని పూజించి, నమస్కరించి శైవ వైష్ణవాలయాల్లో దానం చేయాలి.
ఇలా దీపదానం చేసిన వారికి సద్గతులు ప్రాప్తిస్తాయని చెబుతారు.
💥కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః!!
- ఈ శ్లోకం చదువుతూ కార్తిక పౌర్ణమి నాడు దీపం వెలిగించాలని శాస్త్రం చెబుతున్నది.
ఈ రోజు వెలిగించిన దీపపు కాంతిని చూసిన సమస్త జీవులకు శుభం జరగాలని కోరుకోవడమే ఈ శ్లోకం అర్థం.
దక్షిణాయనంలో వచ్చే కార్తిక మాసం ఉపాసనకు సంబంధించినది.
దీపారాధన చేస్తూ ‘దామోదరమావాహయామి’ అని గానీ, ‘త్రయంబకమావాహయామి’ అని గానీ తమ ఇష్ట దైవాలైన శివకేశవులను ఆవాహన చేస్తారు.
దైవీశక్తి సంతరించుకున్న ఈ దీపాలు ఆత్మజ్యోతిని కూడా ప్రకాశింపజేస్తాయని నమ్మకం. ఆధ్యాత్మిక సాధన సక్రమంగా జరిగేందుకు తోడ్పడతాయి.
💥కార్తిక పౌర్ణమి నాడు సాలగ్రామం, ఉసిరికాయలు దానం చేసినా కూడా పాపాలు నశిస్తాయంటారు.
అంతేకాదు ఇదే రోజున ఏడాది మొత్తానికి కలిపి 365 వత్తులతో దీపం వెలిగిస్తారు.
దీనిని ఆలయంలో గానీ, ఇంట్లోనే దేవుని ముందు, తులసి కోట ఎదుట వెలిగించవచ్చు.
ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం.
పౌర్ణమి రాత్రి ఆలయ ధ్వజస్తంభానికి వేలాడే ఆకాశ దీపాన్ని దర్శిస్తే సకల శుభాలూ కలుగుతాయని అంటారు.
కార్తిక మాసంలో ప్రతిరోజూ దీపారాధన చేయలేని వారు కనీసం పౌర్ణమి నాడైనా దీపం వెలిగించాలని పెద్దల మాట.
ఈ దీపజ్యోతి ఎవరిపై ప్రసరిస్తుందో వారికి సైతం పుణ్యం లభిస్తుందట.
అంతేకాదు, ఇతరులు వెలిగించిన దీపాన్ని ఆరిపోకుండా చూసినవారికి సైతం పుణ్యం దక్కుతుందట.
కార్తిక పౌర్ణమి నాడు స్త్రీలు ఉదయం నుంచి ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు.
దీపారాధన ఉసిరి చెట్టు కింద చేస్తే విశేష ఫలం లభిస్తుంది.
💥కార్తిక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించిన వారికి రాహు, శని, గురు, కుజ, పుత్ర, సర్ప, కాలసర్ప, కళత్ర దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
అంతేకాదు దీపారాధనకు దూది వత్తులు వెలిగిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది.
అరటి, తామర వత్తులను ఉపయోగిస్తే పుత్రశాపం తొలగిపోవడంతోపాటు పాపాలు నశిస్తాయి.
తెలుపు గన్నేరు వత్తులను ఉపయోగిస్తే సిరిసంపదలు సమకూరుతాయి.
సేకరణ... 💐🙏
🔱🕉️ హర హర మహాదేవ శంభో శంకర🕉️🔱

Comments
Post a Comment