💥పరమ శివునకు ఐదు ముఖాలు.
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
🔱 హర హర మహాదేవ శంభో శంకర🔱
🏵️🌼🏵️🌼🏵️
ఐదుమోములతోడ అన్ని జూచెడివాడు
ఐదక్కరములకే అంది వచ్చెడి వాడు!!
ఐదు భూతమ్ములకు ఆదిభూతము వీడు
ఐదు ప్రాణమ్ములకు నాధారమైన వాడు!!
ఐదు చేతల జగతి నాటగా నడిపించి
ఐదవతనపు తల్లి నక్కున జేర్చిన వాడు!!
ఐదంగములను ఓంకార రూపమువాడు
ఐదు ప్రణవముల గుఱియైన నిత్యుడు వీడు!!
ఐదు నారాచముల జోదునణచిన వాడు
ఐదు బ్రాహ్మల రూపమైన షణ్ముఖనుతుడు!!
💥పరంజ్యోతి అయిన శివుడు సర్వజగత్కారణుడు,
జగద్వ్యాపకుడు. ఆ తత్త్వమే అతని పంచవదనాలలో గోచరిస్తున్నది.
సర్వతోముఖమైన జ్యోతి తత్త్వమే ఐదు ముఖాలతో వ్యక్తమౌతున్నది. అన్ని దిశలనూ పరిశీలించే, ఊర్ధ్వ ప్రసరణ కలిగిన ప్రకాశ స్వరూపమే పంచముఖ తత్త్వం.
ఈ ప్రపంచమంతా పంచతత్త్వ విస్తారమే.
ఈ విశ్వ విజ్ఞానానికి సాకారమే శివుని పంచముఖ స్వరూపం.
💥పరమ శివునకు ఐదు ముఖాలు.
అవి సద్యొజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖములు. ఇవి పంచ భూతములకు ప్రతీకలు.
తూర్పున తత్పురుష వదనం, దక్షిణాన అఘోర వదనం, పశ్చిమాన సద్యోజాత ముఖం, ఉత్తరాన వామదేవాస్యం, ఊర్ధ్వాన ఈశాన ముఖం.
ఓం కారంలోని ఐదు అంశాలు.. అ, ఉ, మ, బిందు, నాదం. ఈ పంచాంగాలే పంచ వదనాలు.
ఈ వదనాల నుండే క్రమంగా న, మః, శి, వా, య – అనే ఐదు ‘అక్కరముల’ (అక్షరాల) మహా మంత్రం ఆవిర్భవించింది. ఈ పంచాక్షరీ మంత్రజపమే, పర తత్త్వమైన శివసాయుజ్యాన్ని ప్రసాదిస్తుంది.
ఈ 5 ముఖములు భగవానుని 5 మహా కృత్యములైన
సృష్టి ( పుట్టుక),
స్థితి (పెరుగుట),
లయ (గతించుట),
తీరోధాన (కర్మనుబట్టి ఏ జన్మ ఎత్తాలొ/ మరల పుట్టుట / బ్రహ్మాండ నాశనం),
అనుగ్రహములు (కైవల్యం / మోక్షం / శివ సాన్నిధ్యం ప్రసాదించుట) చేయబడును.
ఈ 5 ముఖముల నుండి 7 (2+1+1+2+1) కోట్ల మహా మంత్రములు ఉద్భవించినవి. అవి:
#సద్యొజాత ముఖము నుండి గాయత్రి మొదలైన 2 కోట్ల మంత్రములు ఉద్భవించినవి. వీటిని "పూర్వమ్నాయ" మంత్రములు అంటారు.
వామదేవ ముఖము నుండి 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని "దక్షిణామ్నాయ" మంత్రములు అంటారు. శైవాగమమ్ ఇందులోనిదే.
అఘోర ముఖమునుండి వైష్ణవాగమముకు సంబంధించిన 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని "పశ్చిమామ్నాయ" మంత్రాలు అంటారు.
తత్పురుష ముఖము నుండి శక్తేయములైన 2 కోట్ల మంత్రములు ఉద్భవించినవి. మహా విద్యాది మంత్రములు ఇందులోనివే. వీటిని "ఉత్తారామ్నాయ" మంత్రాలంటారు.
ఈశాన్య ముఖమునుండి ఆత్మ-ఆనందం కు సంబంధించిన 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని "ఊర్ధ్వామ్నాయ" మంత్రాలు అంటారు.
అందువలన ఈ 5 ముఖములను స్తుతించటం వలన 7 కోట్ల మహా మంత్ర జప ఫలితం ఉంటుంది.
వాటినే "సధ్యోజాతాది పంచ బ్రహ్మ మహా మంత్రాలు" అంటారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment