⚜️🕉️🚩ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః🌹🙏

 ⚜️🕉️🚩ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥సంతాన రక్షణకు, సకల దోష నివారణకు.. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః💥🙏


కుమారస్వామిగా, శివపార్వతుల పుత్రునిగా, కృత్తికా సూనునిగా, షణ్ముఖునిగా, మహాబలశాలిగా, నెమలి.. వాహనంగా, ధ్వజంగా కలిగిన వానిగా ప్రత్యేకతలు పొందిన దైవం సుబ్రహ్మణ్యస్వామి.


మానసిక, శారీరక శక్తిని అత్యధికంగా ఇచ్చేవాడు సుబ్రహ్మణ్యుడు.


'బ్రహ్మ’ శబ్దానికి ‘అధికంగా విస్తరించింది’ అని అర్థం.

‘ప్రకృతి’, ‘కాలం’ అనే అర్థాలూ ఉన్నాయి.

వీటిని మనకు సరైన విధంగా అందించి సద్వినియోగం చేసుకునే అవకాశం కలిగించినవాడు ‘సుబ్రహ్మణ్యుడు’


విద్యుదయస్కాంత శక్తికి ప్రతీకాత్మక దైవమే మన సుబ్రహ్మణ్య స్వామి.

ఆకాశం నుండి భూమి మీదకి వచ్చే కిరణాలన్నీ వంగి సర్పిలాకృతిగా వస్తుంటాయి.

వాటికి సంకేతంగానే సుబ్రహ్మణ్య స్వామి సర్ప రూపారాధనను చూడాలి.


కృత్తికా నక్షత్రాధిపతి అగ్ని అంశతో జన్మించాడనే భావంతో ‘కార్తికేయుడు’ (కృత్తిక కుమారుడు) అనే పేరు కూడా ఉంది.

కృత్తిక ఆరు నక్షత్రాలతో కూడుకుని ఉంటుంది కాబట్టి, ఇతడు షణ్మాతృకుడు.

ఇవే ముఖాలుగా భావిస్తే ‘షణ్ముఖుడు’ అవుతున్నాడు.


సర్పాకృతితో కూడుకున్న వీర్య శోణితాలలో శక్తిని పెంచి సత్సంతానాన్ని అందించేవాడుగా సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.


భూగోళాన్ని రక్షిస్తూ, భూమికి ఎన్నో రూపాల్లో వినియోగ పడుతున్న మహా బలవంతుడిగా ఈ దైవాన్ని జపించాలి. 


మన లోని శారీరక మానసిక శక్తిని పెంచుకోవడానికి, సంతాన రక్షణకు, వైజ్ఞానిక బలానికి, ప్రకృతి రక్షణకు కూడా ఈ స్వామి ఆరాధనవల్ల అతిగా మేలు చేకూరుతుంది.


"ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః" అనే జపాన్ని మనం రోజూ 1 గంట చేసుకోగలిగితే, పైన చెప్పిన ఫలితాలు మన నిత్య జీవితంలో అనుభవంలోకి వస్తాయి.

అన్ని రకాల దోషాలూ నివారితమై సంతోషం సిద్ధిస్తుంది.

🍁🍁🍁🍁🍁


💥॥ శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్నం ॥💥


షడాననం చందనలేపితాంగం మహోరసం దివ్యమయూరవాహనమ్ ।

రుద్రస్యసూనుం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 1 ॥


జాజ్వల్యమానం సురవృందవంద్యం కుమార ధారాతట మందిరస్థమ్ ।

కందర్పరూపం కమనీయగాత్రం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 2 ॥


ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం త్రయీతనుం శూలమసీ దధానమ్ ।

శేషావతారం కమనీయరూపం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 3 ॥


సురారిఘోరాహవశోభమానం సురోత్తమం శక్తిధరం కుమారమ్ ।

సుధార శక్త్యాయుధ శోభిహస్తం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 4 ॥


ఇష్టార్థసిద్ధిప్రదమీశపుత్రం ఇష్టాన్నదం భూసురకామధేనుమ్ ।

గంగోద్భవం సర్వజనానుకూలం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 5 ॥


యః శ్లోకపంచమిదం పఠతీహ భక్త్యా

బ్రహ్మణ్యదేవ వినివేశిత మానసః సన్ ।

ప్రాప్నోతి భోగమఖిలం భువి యద్యదిష్టం

అంతే స గచ్ఛతి ముదా గుహసామ్యమేవ ॥

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️




Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు