💥కార్తీక శుద్ధ విదియ.. "భగినీహస్త_భోజనం" (యమ ద్వితీయ)
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
💥కార్తీక శుద్ధ విదియ.. "భగినీహస్త_భోజనం" (యమ
ద్వితీయ)
తోబుట్టువు ఆప్యాయతా… ఓ పండగే..!
ఈ రోజున సోదరి ఇంట్లో చేతి భోజనం చేసే సోదరులకు సంపూర్ణ ఆయుష్షు కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.
💥#పురాణగాధ:
సూర్యుడికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.
వారి పేర్లు యమధర్మరాజు, అమ్మాయి పేరు యమున.
చెల్లెలికి అన్న పైన విపరీతమైన ప్రేమాభిమానాలు.
ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నో సార్లు పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు.
ఓ రోజున అర్ధాయుష్కుడైన మార్కండేయుడి ప్రాణాన్ని
హస్తగతం చేసుకునేందుకు యముడు పాశాలతో
వెళ్తాడు.
అప్పుడు ఆ బాల భక్తుడు మహాశివుణ్ని శరణు
వేడుకుంటాడు. స్వామి త్రిశూలం తీసుకుని యముడి
వెంటపడటంతో, ఆయన తన చెల్లెలి ఇంటికి వెళ్లి
తలదాచుకుంటాడు.
ఆ కార్తీక మాస విదియ రోజున సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండివంటలతో భోజనం పెట్టింది.
చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు.
ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు.
ఆమె ఈ కార్తీకశుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది.
ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి, అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం (అకాల మరణం) లేకుండా వుంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతిగా వుంటుంది అని వరాలిచ్చాడట.
అందువలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది. యమునకు, యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే "యమ ద్వితీయ" పేరుతో అద్వితీయ పర్వదినంగా ఖ్యాతి పొందింది.
సోదరి చేతి వంట కాబట్టి "భగినీ హస్తభోజనం"గా ప్రాచుర్యం లోకి వచ్చింది.
తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు.. సోదరుడు ఆమెకు చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఇతర కానుకలిచ్చే సంప్రదాయమూ ఉంది.
ఈ రోజున సోదరులను ఇంటికి పిలిచి వారి నుదుట బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, మిఠాయిలు తినిపించి అక్కాచెల్లెళ్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతారు.
తమ సోదరులు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు.
ఈరోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద "యమదీపం" పేరుతో నాలుగు ముఖాల దీపాన్ని కూడా ఉంచుతారు.
ఈనాడు యమధర్మరాజుని, చిత్రగుప్తుని, యమునను స్మరించిన మహిళలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని నమ్ముతారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment