పంచమీతీర్థం
⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
💥కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరుని పట్టపుదేవేరి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచానూరు "కార్తీక బ్రహ్మోత్సవాలు" నేటితో ముగియనుంది.
నవంబర్ 10 నుంచి నవంబర్ 18 వరకు జరిగే వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా.. నవంబర్ 18 - చక్రస్నానం, పంచమీ తీర్థం, ద్వజావరోహణం.
శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు పంచమీ తీర్థం (చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య రంగరంగ వైభవంగా జరుగుతుంది.
కార్తీక బ్రహ్మోత్సవాల్లో పద్మావతి అమ్మవారి చక్రస్నాన ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
అమ్మవారి జన్మ తిథిని పురస్కరించుకుని "పంచమీతీర్థం" పేరుతో అమ్మవారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించి, సుదర్శన చక్రమూర్తికి పుష్కరిణిలో పుణ్యస్నానమాచరింప చేస్తారు.
చక్రస్నాన ఘట్టంలో పుష్కరిణిలో స్నానమాచరిస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.
పవిత్ర వేద మంత్రోచ్చారణ.. మంగళ వాయిద్యాల నడుమ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి అవబృథోత్సవం కన్నులపండువగా సాగుతుంది.
💥తిరుచానూరు పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి ఆలయం నుండి సారె తరలింపు అనాదిగా కొనసాగుతుంది.
శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు కానుకలు.. రూ. 25 లక్షలు విలువ చేసే 500 గ్రాములు బరువు గల రెండు బంగారు పతకాలు, ఒక హారం, సారెతో పాటు పసుపు, కుంకుమ, గాజులు, పట్టువస్ర్తాలు, శ్రీవారి ప్రసాదాలు తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరిస్తారు.
వేకువజామున శ్రీవారి ఆలయంలో సారెను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు..
నడక మార్గంలో పాదయాత్ర ద్వారా సారె తీసుకెళ్లారు.. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషం గా పాల్గొని కర్పూర నీరాజనాలు పట్టారు..
గజరాజులు ముందు వెళ్తుండగా, బాజభజంత్రీలు, మేళతాళాల మధ్య సారె ఊరేగింపు జరుగుతుంది..
ఉదయం 6.30 గంటల నుండి 8 గంటల వరకు పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు..
అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు..
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుతుంది.
పంచమీ తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment