💥శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
⚜️🕉️🚩ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః🌹🙏
💥శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం..
సర్వ పుణ్యముల ఫలం.. కార్తీక పౌర్ణమి.
ఆ కార్తీక పౌర్ణమి రోజున "సత్యనారాయణ వ్రతం" చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
సమస్త దోషాల నుంచి... సమస్యల నుంచి బయటపడేసే ఈ వ్రతాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు.
అయితే కార్తీకమాసంలో చేయడం వలన కలిగే ఫలితం విశేషమైనది.
ఈ వ్రతాన్ని ఆచరించడానికి 'కార్తీక పౌర్ణమి' మరింత విశేషమైనదిగా చెప్పబడుతోంది.
కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణస్వామి వ్రతం చేయడం వలన ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు అంటున్నారు.
💥మాఘేవా, మాదవేమాసిం, కార్తికేవా శుభేదినే..
- అని సత్యనారాయణ వ్రత కథలో మొదటి అధ్యాయంలో చెప్తారు.
అంటే మాఘ మాసంలో గానీ, చైత్ర మాసంలో గానీ, కార్తిక మాసంలో గానీ ఒక శుభదినాన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయాలని అర్థం.
సత్యనారాయణ వ్రతం ప్రత్యేకించి కార్తీకమాసంలో పౌర్ణమి రోజు ఆచరించడం మంచిదని వేద పండితులు చెబుతున్నారు.
💥త్రిమూర్తి స్వరూపమైన సత్యనారాయణ స్వామి రామావతారంలో తన భక్తుడైన 'రత్నాకరుడు'కి ఇచ్చిన మాట కోసమే 'అన్నవరం'లోని రత్నగిరిపై ఆవిర్భవించాడు.
భక్తుడికి సంతోషాన్ని కలిగించడం కోసం వైకుంఠం నుంచి వచ్చిన స్వామి, భక్తుల కష్టనష్టాలను తీరుస్తూ సత్యమహిమ కలిగిన దైవంగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.
తపస్సుల ద్వారా తప్ప పొందలేని స్వామి అనుగ్రహం, ఆ స్వామి వ్రతాన్ని ఆచరించడం వలన పొందవచ్చని పండితులు చెబుతున్నారు.
సత్యనారాయణస్వామి వ్రతాన్నే సత్యవ్రతంగా కూడా పిలుస్తుంటారు. ఒకసారి సంకల్పించుకుంటే ఆ స్వామి వ్రతం చేసి తీరవలసిందే.
వాయిదా వేయడం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందనేది ఆ వ్రత కథల్లోనే కనిపిస్తుంది.
అంకితభావంతో... నియమ నిష్టలతో ఈ వ్రతం చేసిన వారిని స్వామి వెంటనే అనుగ్రహిస్తాడనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి.
💥సాయంకాలం కానీ, ఉదయం కానీ శుచిగా స్నానమాచరించి.. బ్రాహ్మణులను, బంధు మిత్రాదులను రప్పించి, దేవాలయంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ, సముద్రతీరాన కానీ, నదీతీరాన కానీ, స్వగ్రహమునకానీ, పుణ్యక్షేత్రములందు సత్యనారాయణ వ్రతం చేయించాలి.
పూజా స్థలాన్ని గోమయముచే శుద్ధిచేయాలి.
తూర్పుగా బియ్యం, చూర్ణము, పసుపు, కుంకుమలతో ముగ్గులు పెట్టి, మంటపము గావించి, మామిడాకుల తోరణములతో సుందరముగా అలంకరించి పూజాద్రవ్యములు రాగిపాత్ర నూతన వస్త్రాలు, కొబ్బరికాయ, పూజా స్థలము నందు ఉంచాలి.
భక్తితో దీపారాధన చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి.
ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కష్టనష్టాలు తొలగి పోతాయి. ధనధాన్యాలకు లోటుండదు.
సౌభాగ్యకరమైన సంతానం, సర్వత్రా విజయం లభిస్తుంది. మాఘ, వైశాఖ, కార్తీక మాసముంలందు కానీ, ఏదైనా శుభదినాన దీనిని ఆచరించాలి.
దారిద్ర్యం తొలగిపోవాలంటే.. ఈ వ్రతాన్ని ఆచరించాలి.
#ప్రార్థన:
అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం
హృషీకేశం జగన్నాథం వాగీశం వరదాయకమ్
సుగుణం చ గుణాతీతం గోవిందం గరుడడ్వజం
జనార్థనం జనానందం జానకీవల్లభం హరిమ్
ప్రణామామి సదా భక్త్వా నారాయణ మజం పరం
దుర్గమే విషమే ఘోరే శత్రుణాపరిపీడితే
విస్తారయతు సర్వేషు తథానిష్ఠ భయేషు చ
నామాన్యేతాని సంకీర్త్య ఫలమీప్సిత మాప్నుయాత్
సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం
లీలాయా వితతం విశ్వం యేన తస్మై నమోనమః
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment