💥శ్రీ రాఘవేంద్ర గురుతీర్ధుల బృందావన ప్రవేశం
⚜️🕉️🚩ఓం శ్రీ గురురాఘవేంద్రాయ నమః🌹🙏
🏵️🌼🏵️🌼🏵️🌼
పూజ్యాయ రాఘవేంద్రాయ, సత్యధర్మరతాయచ |
భజతాం కల్పవృక్షాయ, నమతాం కామదేనవే ||
🍁🍁🍁🍁🍁
💥శ్రీ రాఘవేంద్ర గురుతీర్ధుల బృందావన ప్రవేశం...
🌹ఒకసారి ఆశ్రమంలో రాఘవేంద్ర యతీంద్రులు తత్వబోధ గావిస్తున్నారు.
ఉన్నట్టుండి స్వామివారు తమ ఉపనిషద్వాణిని ఆపారు.
అకస్మాతుగా ఎందుకాపారో తెలియని భక్తులు కారణం తెలియక ఆతృతగా చూస్తున్నారు.
స్వామివారు తల పైకెత్తి ఆకాశాన్ని చూస్తూ, లేచి నిల్చున్నారు.
ఏమీ అర్ధంకాక అయోమయంగా భక్తులూ నిల్చున్నారు.
కొంతసేపు పిమ్మట శిష్యుల మనోభావములు గమనించి, "నాయనలారా! ఇవన్నీ దేవరహస్యాలు.
కుశుమవర్తి శ్రీకృష్ణద్వైపాయన స్వామి మహాభక్తులు, సిద్ధపురుషులు. సర్వకర్మలను నిర్వర్తించుకొని మహత్తర జీవనం గడిపిన పుణ్యపురుషులు వారు.
ఆ మహాపురుషులు నేడు తమ పాంచభౌతిక దేహాన్ని విసర్జించి, దివ్యదేహంతో విమానరూఢులై, ఆ శ్రీహరి సదనానికి పయన మవుతున్నాడు.
ఇది గమనించిన మేము, ఆ మహాభక్త శిఖామణులకు అభివాదం చేసి నిల్చున్నాం.
అపుడే మహాత్మా! మీరు శ్రీహరిపధాన్ని చేరుకుంటున్నారు, మరి మా మాటేమిటని అడిగాం.
అందుకా ఆ భక్తశిఖామణులు తమ చేతి రెండు వ్రేళ్ళను ముమ్మారు చూపారు.
విషయం అర్ధం చేసుకున్న మేము కాలానికి, ఆ మహాభక్త శిఖామణులకు తలవంచి మా సజీవ బృందావన సమాధికోసం ఎదురు చూస్తున్నామన్నారు.
ఇది విన్న శిష్యవర్గం, భక్తజనం కళవళ పడ్డారు. అమ్మో, శ్రీ గురుతీర్ధుల వారు మనల్ని విడిచిపెట్టే మాట... ప్రళయ ఝుంఝూ మారుతమై ప్రతిధ్వనించిందక్కడ.
🌹శ్రీ గురుసార్వభౌములు అతిత్వరలో బృందావనాంతర్గతులవుతున్నారన్న వార్త చూస్తుండగా, దావానంలా వ్యాపించింది.
ఈ వార్త విన్న దివాన్జీ వెంకన్న పంతులు క్షణాల్లో బయలుదేరి వచ్చి, స్వామి అని బావురుమన్నాడు.
"దీనికెందుకింత ఆందోళన? మీ కోసమే కదా, ఈ జీవసమాధి తీసుకునేదీ, ఇలా దేహదారినై ఉంటే ఏ కొంతమందినో రక్షించే మేము బృందావన స్థితులమైతే, ఎక్కడెక్కడ వారిని... తలచిన క్షణాన తక్షణం ఆదుకోగలము అని చెప్తున్న, గురువర్యుల మాటలను అడ్డం వస్తూ...
'మీరేం చేసినా, అది మాకోసమేనంటారు.
ఇది భరించదగ్గ విషయమేనా మాకోసమైనా మీరీ పని చేయడానికి వీల్లేదు'...
ఆపుకోలేని దుఃఖంతో, ప్రార్ధిస్తున్న వెంకన్నను వారిస్తూ... "చూడు నాయనా! ఇహలోక దృష్టిని కనుక విడిచిపెట్టగల్గితే, ఆ ఈశ్వరశక్తి...లోకసృష్టి సర్వము అర్ధం చేసుకోగలుగుతావు.
ఇది దైవ నిర్ణయం. దైవ శాసనం.
డబ్బై సంవత్సరాలు మా శరీరంతో భూలోకంలో వుండాలని, ఆ తదుపరి ఏడువందల సంవత్సరాలు బృందావన స్థితులమై వుండాలని నిర్దేశించిన పరమేశ్వరాజ్ఞను మనం ధిక్కరించగలమంటావా? కనుక దైవ ఆదేశం సర్వదా శిరోధార్యం.
అందుకని, ఇతర చింతనలను విడిచి, మాకు అతిత్వరలో బృందావనం ఏర్పాటు చెయ్యమని శ్రీ గురుదేవులు ఆదేశించారు.
🌹శ్రీ రాఘవేంద్ర గురుతీర్ధులు వెంకన్నకు ఓ శిల చూపించి, ఈ శిల శ్రీరామ లక్ష్మణులు ఏడు ఘడియలకాలం విశ్రమించిన పవిత్ర శిల కాబట్టి, ఈశిలతో మాకు బృందావనాన్ని రూపొందించమని చెప్పిరి.
మనస్సును చిక్కబెట్టుకుని శ్రీ గురుతీర్ధుల ఆజ్ఞకు బద్దుడై, శ్రీ గురు అఖండనామ స్మరణం చేస్తూ, అనుకున్న విధంగా బృందావన నిర్మాణం పూర్తిచేసాడు దివాన్ వెంకన్న.
శ్రీ గురుతీర్ధులు బృందావన స్థితులయ్యే సమయం దగ్గర పడుతుంది.
కాలమెంత కఠినమైనది, దైవమెంత నిర్దయుడని బృందావన ప్రవేశ వార్త విన్న ప్రతి ఒకరు గుండెలవిసేలా రోదిస్తూ, కుమిలిపోతున్నారు.
శ్రీరాఘవేంద్ర తీర్ధులవారు తమ ఇహలోక బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని బృందావన స్థితులు కావాలి కనుక, తమ ఉత్తర పీఠాధిపతి నియమాకానికి నిశ్చయించి...
తమ పూర్వాశ్రమ సోదరులైన శ్రీగురురాజాచార్యుల వారి పౌత్రులు శ్రీ వెంకన్నాచార్యుల వార్ని ఉత్తరపీఠాధిపతిగా నిర్ణయించి,
సర్వభక్తజన, వైదిక, పండిత సమక్షంలో శాస్త్రవిధిన మంత్ర, ముద్రాధారణ మూర్తులను గావించి, పీఠాధిపతిగా ప్రకటించి, 'యోగీంద్రతీర్ధులు' గా నామమొసగి, మహాపీఠ సింహాసనాన్ని అలకరింపచేసారు.
🌹1671వ సంవత్సరం -
మంత్రాలయ మహిమాన్వితులు, మహాసిద్ధులు, గురుసార్వభౌములు, సకల భక్తజన హృదయాంతర్వర్తులు, జగత్కళ్యాణ కారకులు, సద్ధర్మ మూర్తులు, ధర్మ రక్షాపరులు... శ్రీ రాఘవేంద్ర గురుతీర్ధుల బృందావన ప్రవేశం -
"ప్రియభక్తులారా! శ్రీహరి ఆదేశాన్ని శిరసావహించడం మన ధర్మం. సర్వభక్తజన ప్రియంకరుడైన శ్రీహరి మాకు సజీవ బృందావన ప్రవేశాన్ని ప్రసాదించారు.
ఈ బృందావనంలో మేము ఏడువందల సంవత్సరాలు నిలిచే వుంటాం.
క్షీణ శరీరంతో సర్వభక్తజనులను సేవింపలేమనే ఉద్దేశంతో శ్రీహరి మాకీ దివ్యావకాశాన్ని అనుగ్రహించారు.
ధర్మబద్ధంగా దీక్షాయుతంగా మీరు సలిపే సర్వ కార్యక్రమములకు మా తోడ్పాటు ఆశీస్సులు ఉంటాయి.
మన జ్ఞానచక్షువులను సక్రమమార్గంలో పయనింపచేసి మనం, మనతోపాటు మన తోటివారు పావనమయ్యేటట్లు చేసుకుందాం.
గురు పరంపరగా సద్గురువులు ప్రవచించిన వాటిని, ఆచరించి తరించమన్న నా అభ్యర్ధనను ప్రతిఒక్కరూ స్వీకరించి, ధన్యచరిత్రులయి తరించండి, తరింపజెయ్యండి. ఓం తత్ సత్ !!!
ఇలా సద్బోధ నొసగి శ్రీ గురు సార్వభౌములు, సర్వులను కృపాదృష్టితో చూస్తూ, బృందావన ప్రవేశం గావించారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment