💥పోషించే తల్లి పోచమ్మ..

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏

🌼🏵️🌼🏵️🌼🏵️🌼🏵️🌼


💥పోషించే తల్లి పోచమ్మ..


గ్రామస్థులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపు కాస్తూ ఉండే దేవత... "గ్రామ దేవత"


ప్రకృతిని శక్తి స్వరూపిణిగా, జగన్మాతగా కొలవడం భారతీయ సంప్రదాయం.

ప్రకృతి శక్తుల విభిన్న కళలే గ్రామదేవతలని దేవీ భాగవతం పేర్కొంటోంది.

పరమాత్మను జగత్పతిగా, ప్రకృతిని విశ్వమాతగా ఆరాధిస్తారు.


🌹పోషణ, రక్షణ నిచ్చే దేవతలు..


ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి #తలుపులమ్మ.


తలపు అంటే ఆలోచన.. వాటిని తీర్చే తల్లి తలపులమ్మ.

క్రమముగా ఈమె 'తలుపులమ్మ'గా మారింది.


ఇంట్లో నుండి బయటికి వెల్లేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.


వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండే తల్లి పొలిమేరమ్మ.. క్రమముగా #పోలేరమ్మ అయింది.


పొలిమేరలో వుండే మరొక తల్లి #శీతలాంబ.

ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి.

తన గ్రామంలోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామంలోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే.


"ఎల్ల" అంటే సరిహద్దు అని అర్దము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.


ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోషించే తల్లి "పోచ+అమ్మ=#పోచమ్మ" అన్నమాట.


శీతల జ్వరాన్ని నివారించే దేవత కాబట్టి పోచమ్మతల్లిని ‘శీతల’ అని కూడా పిలుస్తారు. 


శాక్తేయ సంప్రదాయంలో శీతలాదేవి ఉపాసన విశేషంగా కనిపిస్తుంది.

ఆ ఆదిపరాశక్తిని పోచమ్మగా తమ ఇంటి దైవంగా, గ్రామదేవతగా పూజించుకుంటారు జానపదులు. నల్లపోచమ్మను పార్వతీదేవి అంశగా భావిస్తారు


ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది.


ఇక పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి #పుట్టమ్మ.

ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి.

అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు.

ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ' అని కూడా అంటారు. 


పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి #పాపమ్మ అని కూడా అంటారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే సుబ్బ+అమ్మ=సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది.


సాధారణంగా 15 వూళ్ళకో దేవత వుంటుంది.

'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమముగా అది '#మావుళ్ళమ్మ' అయింది.


శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా అంకగళమ్మ #అంకాళమ్మ మారిపోయింది.


బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి #బతుకమ్మ.


ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధి నించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమములో #కట్టమైసమ్మ అయింది.


గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా 


ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూ వుండే తల్లి సత్య+అమ్మ= సత్తెమ్మ.


స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని) సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది.


అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న) అమ్మ పుల్లమ్మ. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.


ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోట వున్న తల్లి అర్పణ+అమ్మ = అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది.


బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ= అప్పలమ్మ అన్నారు.


పార్వతే అమ్మోరు (అమ్మవారు)గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు