💥వందే శివం శంకరం💥

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱

🏵️🌼🏵️🌼🏵️


💥వందే శివం శంకరం💥


భగవంతుడు సర్వవ్యాపకుడు..

సర్వాంతర్యామి.

భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా,

ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పర తత్త్వము ఒకటే.

ఈ విధమైన పరతత్త్వానికి రూపం, ఆకారం, అవయవాలు లేవు.

ఈ సత్య విషయాలను తెలియజెప్పే తత్త్వ స్వరూపమే "#లింగం"


🌹లింగాభిషేకములో పరమార్ధం..


పానిపట్టుపై శివలింగం అంటే మానవుని హృదయ పద్మంపై ఆత్మలింగము.


పంచామృతాభిషేకం - భక్తీ, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనలతో దైవాభిషేకంచేయాలి.


జలధారాపాత్ర అనన్య అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నం..


లింగం జీవాత్మకు సంకేతం.

జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం.


🌹పరమశివుని రూపంలో పరమార్ధం..


మెడలో సర్పం, శిరస్సుపై గంగ - కుండలిని జాగృతిని సూచిస్తున్నాయి.

శివ నామం లోని మూడు గీతలు - జాగృతి, స్వప్న, సుషుప్తి స్థితులను తెలుపుతున్నాయి. 


మద్యబిందువు తురీయావస్థకు ప్రతీక.

అలానే శివుని మూడో నేత్రం ఆజ్ఞాచక్ర స్థానంలో ఉండే ప్రజ్ఞాచక్షువు.

అర్ధనారీశ్వర తత్వంలో శివపార్వతులు ఇడా, పింగళ, నాడులకు సంకేతాలు.


పాక్షికంగా మూయబడిన కళ్ళు ధ్యానస్థితిలో అంతర్ముఖ స్థితికి దర్పణం.


శివుడు ఆదిగురువు, యోగ గురువు.

శివుని వృత్తి భిక్షాటన, ఆసనం పులి చర్మం, ధరించేది గజచర్మం, నివసించేది స్మశానం.

ఆయన దగ్ధం చేసింది మదాకారం... ఇవన్నీ జన్మ బంధ విమోచనలకు మార్గాలకు సూచనలు.


🌹ప్రతినెలా 28వ రోజు (మాస శివరాత్రి) విశిష్టత..


మనిషి శరీరంలో ఉండే 24 తత్వాలనూ చైతన్యంతో అధిగమించినవారు 25 వ తత్వమైన జ్ఞానాన్ని,

క్రమంగా 26 వ తత్వం ఆత్మ, 27వ తత్వం పరమాత్మలను అధిగమించి 28వ తత్వం విదేహస్థితిని అందుకుంటారు.

ఆ విదేహస్థితికి సంకేతమే శివలింగం.

అందుకే ప్రతినెలా 28వ రోజున మాస శివరాత్రిగా పాటిస్తారు. 


🌹"శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు" అనటం లోని ఆంతర్యం...

చీమ నుంచి బ్రహ్మ వరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే.

సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే.

శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు.

అంటే మృతపదార్థమని అర్థం.


శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం.

శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం.

శివమే సర్వజగత్తులకు మూలాధారం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥